స్వ‌రాలు..కొత్త‌గా ఉన్న‌వి..కోయిల చెంత చేరిన‌వి..అక్ష‌రాల‌కు కూజితాలు నేర్పిన‌వి..మ‌ళ్లీ మ‌రో వ‌సంతానికి ఆరంభంగా మారేవి ఇదిగో.. ఇక్క‌డే..ఈ వ‌సంతానే..పాత్రికేయం..సుదీర్ఘంగా సాగిపోతోంది..ఎక్క‌డో ఆరంభించిన ప్ర‌యాణం ఇదిగో పాతికేళ్ల దూరం ప్ర యాణించింది..ఆ వ‌య‌స్సు..ఆ..వ‌సంతం అలా ఉండంగానే మ‌రో వ‌సంతం వ‌చ్చి, ప‌ల‌క‌రించ‌నుంది.శ్రీ‌కాకుళం వాకిట ఆత్మ‌గౌర‌వ నినాదాలు వినిపించిన ప్ర‌తిసారీ ఒకింత పుల‌కింత‌. ఆ..గౌర‌వానికి కొన‌సాగింపుగా ఎవ్వ‌రైనా ఉంటే మ‌రింత పుల‌కింత..ఆ..గౌర‌వం కు భంగం వాటిల్లితే కోపం. శ్రీ‌కాకుళం వాకిట అలాంటి ఆత్మ గౌర‌వాన్ని అందుకునేందుకు, నిరంత‌రం  నిలుపుకొనేందుకు ప్ర‌య ‌త్నించే కొద్ది మందిలో ఒక‌రు..ఆయ‌న. ఆయ‌నే వంశ‌ధార ఉర‌వ‌డిని నిత్యం ప్రేమించే కొంక్యాన వేణుగోపాల్. జూన్ 19 ఆయ‌న పుట్టిన రోజు..ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతూ అందిస్తున్నానొక ప్ర‌త్యేక క‌థ‌నం.

 

స్టూడెంట్ నంబ‌ర్ ఒన్.. : బ‌డి నేర్పిన పాఠాలే ఇవి..
కొంక్యాన వేణు గోపాల్..విద్యార్థి రాజ‌కీయ ద‌శ నుంచి..ఉమ్మ‌డి రాష్ట్ర ఉద్య‌మ ద‌శ వ‌ర‌కూ..లేదా ఉద్య‌మం నుంచి ఉద్ధృతి వ‌ర‌కూ అన్నింటినీ  అవ‌లోకించి, పాత్రికేయం, ర‌చ‌నా వ్యాసంగం కొన‌సాగిస్తున్నారు. సామాజిక దృక్ప‌థాల‌ను బ‌ల‌ప‌రుస్తూ, త‌న‌దైన పం థాకు ప్రాధాన్యం ఇస్తూ వార్తా ర‌చ‌న సాగిస్తున్నారు. ఇదీ ఆత్మీయుల మాట. ఈ జ‌న్మ‌దిన వేళ మీకు శుభాకాంక్ష‌లు చెబుతూ.. అందిస్తున్నానొక ప్ర‌త్యేక క‌థ‌నం. ముఖ్యంగా జిల్లా వెనుక‌బాటు, సామాజిక, ఆర్థిక పురోగ‌తి లేమిపై త‌రుచూ త‌న క‌థ‌నాల్లో ప్ర‌స్తా వించే ఆయ‌న, కొత్త ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థిస్తూ, మూడు రాజ‌ధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. అదేవిధంగా విష తుల్య రసాయినాలు వెద‌జ‌ల్లే  ప‌రిశ్ర‌మ‌ల రాకపై గ‌తంలోనూ గొంతెత్తారు. నాలెడ్జ్ సెంట‌ర్ల ఏర్పాటు, స్కిల్ డెవ‌ల‌ప్ సెంట‌ర్ల ఏర్పా టు వంటివి అవ‌స‌రం అని ఎన్న‌డూ చెబుతుంటారాయ‌న‌. జ‌ర్న‌లిస్టులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకుంటూ, సామాజిక బాధ్యత అన్న‌ది మ‌రువ‌కూడ‌ద‌ని విశ్వ‌సిస్తారు.

 

క‌వీ నిన్ను స్మ‌రింతు..నాన్నా నీ దీవెన అందుకుని..
తండ్రి గోవింద‌రాజులు అందించిన సామాజిక దీప్తి, అన్న‌య్య ఛాయారాజ్ క‌వి..శ్రీ‌కాకుళం గొంతుకగా అందించిన ఓ స్ఫూర్తి.. క‌లగ లిపి ఇటుగా అడుగులు వేశారు.విద్యార్థి ద‌శ నుంచి ప‌లు స‌మ‌స్య‌ల‌పై లేఖల రూపేణ క‌థ‌నాలు అందించి, త‌రువాత ప్ర‌ముఖ ప‌త్రి క ఆంధ్ర‌భూమిలో అంచెలంచెలుగా ఎదిగారు. ఓ సాయంకాల ప‌త్రిక‌కు న్యూస్ ఎడిట‌ర్ గా విధు లు నిర్వ‌ర్తించి, త‌న సేవ‌లు అందిం చారు. ఎడిట‌ర్ గా, వ్య‌వ‌స్థాప‌క సార‌థిగా మ‌రో సాయంకాల ప‌త్రిక జై జ‌యం నిర్వ‌హ‌ణ బాధ్య‌త లు నిర్విరామంగా నిర్వ‌ర్తిస్తున్నా రు. ఎన్నో క‌ష్ట న‌ష్టాల‌కు ఓర్చి ఈ క్ర‌తువు కొన‌సాగిస్తున్నారు. అన్న‌య్య కొంక్యాన ముర‌ళిధ‌ర్ అందించిన ప్రోత్సాహం..ఇన్నేళ్లు గా..వివిధ రంగాల్లో రాణించేందుకు, ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు, స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు ఓ కార‌ణం.అలానే ఆయ‌న‌తో పాటు నిరంతరం ప‌రుగులు తీసే మ‌రో యువతేజం కొంక్యాన శివ‌శంక‌ర్ కూడా..!

 

నాటి నుంచీ నేటి వ‌ర‌కూ : ఆంధ్ర‌భూమి వాకిట
జ‌ర్న‌లిస్టుగా ఆయ‌న  ఎక్కువ  పేరు అందుకుంది..ఆంధ్ర‌భూమిలోనే పుష్క‌ర కాలంకు పైగా అక్క‌డ సేవ‌లు అందించారు. జిల్లా కేం ద్రంలో రిపోర్ట‌ర్ గా త‌న వృత్తిగ‌త జీవితం మొద‌ల‌యింద‌ని, ఒక ల్యాండ్ ఫోన్ నుంచి వివ‌రాలు అందుకుని, వార్త‌లు రాసిన రోజులు న్నాయ‌ని గుర్తుచేసుకుంటారు.ముఖ్యంగా జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం సామాన్య‌మే అయినా.. అవి తన‌ను ఎంత‌గానో మార్చాయ‌ని, ప్ర‌భావితం చేశాయ‌ని, సొంత ప‌త్రిక స్థాపించిన‌ప్పుడు కూడా అవే కొన‌సాగాయ‌ని, అందుకే ఈ అక్ష‌రాలే ఆప్తులు అని త‌న న‌మ్మ‌కం అని అంటారాయ‌న.

 

సాయం అంటే క‌దిలి..
ప‌ల్లె నుంచి ప‌ట్నం దాకా
ప‌ట్నం నుంచి దేశ రాజ‌ధాని దాకా
ఎవ్వ‌రు త‌నను సంప్ర‌దించినా
క‌ష్టం అంటే స్పందించ‌డం తొలి ల‌క్ష‌ణం

 

ముఖ్యంగా గ్రామీణ వాతావ‌ర‌ణం నుంచి వ‌చ్చిన ఆయ‌న చిన్న‌నాట నుంచి ఇదే ప‌ద్ధ‌తిలో పెరిగారు.ముఖ్యంగా నాన్న అందించిన సేవా నిర‌తి కార‌ణంగానే ఇప్ప‌టికీ వీరు చుట్టు ప‌క్క‌ల ప‌ల్లెల్లోనూ, పేరొందిన రాజ‌కీయ కుటుంబాల్లోనూ గౌర‌వం, ఆద‌రం అందు కుంటున్నారు. అదే సేవానిర‌తికి  కొన‌సాగింపుగా నాన్న పేరిట ఒక ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ నెల‌కొల్పి, ఆయ‌న స్మ‌ర‌ణలో ప్ర‌తి ఏటా తోచి నంత రీతిలో కార్య‌క్ర‌మాల‌కు రూపక‌ల్ప‌న గావిస్తున్నారు. పాత్రికేయ స‌మాజంలో ఒక చిన్న విలేక‌రి వ‌చ్చి త‌న‌కు సాయం కావా ల‌న్నా ఆయ‌న చేస్తారు.అలానే ఎవ్వ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా ఆయ‌న స్పందించే తీరే ఇంత మంది స‌న్నిహితులను పొందేందుకు కా ర‌ణం అయిందన్న‌ది వాస్త‌వం.

 

కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే వారు కూడా త‌రువాత స్నేహితులు అయిపో యార‌ని చెబుతారు. ముఖ్యంగా సౌమ్యంగా ఉండండం, వివాదాలకు  దూరంగా ఉండ‌డం ఆయ‌న ల‌క్ష‌ణం. రెడ్ క్రాస్ కార్య‌క‌ర్త‌గా ప లు మార్లు కీల‌కంగా ప‌నిచేసి విపత్తుల స‌మ‌యంలో త‌న విధి నిర్వ‌హ‌ణ‌ను మ‌రువులేదు. ర‌క్త‌దాన శిబిరాల నిర్వ‌హ‌ణ‌లో నేటికీ త‌న‌వంతు బాధ్య‌తను క్ర‌మం త‌ప్ప‌క నిర్వ‌హిస్తూ, ఆప‌ద వేళ‌ల్లో బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉ న్నా స‌రే! త‌న వంతు సాయం అందించేందుకు ఎన్న‌డూ వెన‌క‌డుగు వేసిన దాఖ‌లాలే లేవ‌న్న‌ది మ‌రో వాస్త‌వం.

 

వివర‌ణ..విశ్లేష‌ణ.. : ఏబీకే నుంచి ప‌తంజలి వ‌ర‌కూ
జ‌ర్న‌లిజంలో ఏబీకే నుంచి ప‌తంజ‌లి వ‌ర‌కూ అంద‌రు ఎడిట‌ర్ల తీరూ చెప్ప‌గ‌ల‌రు. ముఖ్యంగా అన్ని ప‌త్రికల శైలీ వివ‌రించ‌గ‌ల‌రు. పాత్రికేయం పేరిట వ‌స్తున్న మార్పులు విశ‌దీక‌రించ‌గ‌ల‌రు. విశ్లేషించ‌గ‌ల‌రు. జిల్లా రాజ‌కీయ య‌వ‌నిక‌పై నాటి బొడ్డేప‌ల్లి రాజ‌గోపాల రావు ద‌గ్గ‌ర నుంచి నేటి యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు వ‌రకూ అంద‌రి ప్ర‌యాణం ఏయే సంద‌ర్భాల్లో ఎలా మ‌లుపు తిరిగిం ద‌న్న‌ది వివ‌రించ‌గ‌ల‌రు. ప‌లు పౌర హ‌క్కుల సంఘాల‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా వారితో కొన్ని కీల‌క సంద‌ర్భాల్లో ప‌నిచేసిన అనుభవంతో  ఆయా ప‌రిణామాల‌నూ విశ్లేషించ‌గ‌ల‌రు..అనేక సంఘాలకూ,సామాజిక కార్య‌క్ర‌మాల‌కూ సార‌థిగా ఉంటూ త‌నదైన వ్య‌క్తిత్వం నిలుపుకుంటున్నారు. అంద‌రి మ‌న్న‌న‌లూ పొందుతున్నారు.

 

రాజ‌కీయం..సామాజికం..పాత్రికేయం
సామాజికం..స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల్లో
నాటి ప్ర‌భంజ‌నంలో ఎన్నో మార్లు
నాయ‌కుల తీరుపై బాహాటంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు
ముఖ్యంగా ఎన్జీఓల‌తో క‌లిసి ఉద్య‌మం న‌డిపారు
నాటి సంయుక్త కార్యాచ‌ర‌ణ‌కు కీల‌కంగా ఉన్నారు

 

తొలి అడుగులు : నాన్నే తొలి గురువు
రాజ‌కీయంగా అయితే తండ్రి గోవింద‌రాజులుకు వివిధ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో మంచి అనుబంధం ఉన్న కార‌ణంగా నాటి స‌మితి వ్య‌వ‌స్థ‌ల్లో కీల‌కంగా ఆయ‌న ఉన్న కార‌ణంగా నాన్నే తొలి గురువు..అయ్యారు.విద్యార్థి ద‌శ‌లో ఎన్ఎస్‌యూఐకు ప్రాతిని ధ్యం వహించ‌డం, జిల్లా స్థాయిలో కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన అనుభవం ఉండ‌డం రీత్యా  త‌రువాత ఇటుగా వ‌స్తారనే చాలా మంది అ నుకున్నా, అనూహ్యంగా పాత్రికేయ రంగాన్నే ఎంచుకుని, రాజ‌కీయ నేప‌థ్యం నుంచి సామాజిక ప‌రిణామ గ‌తుల‌ను అర్థం చేసు కోవ‌డం ప్రారంభించారు. వామ‌ప‌క్ష భావ‌జాలంపై సానుభూతి ఉన్న‌వారిగా పేరొందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను స‌మైక్య రాష్ట్రంగా ఉంచాల‌ని ఉద్య‌మ స‌మ‌యంలోనూ ప‌లు సంఘాలతో క‌లిసి ప‌నిచేశారు.

 

వివిధ సంద‌ర్భాల్లో..వివిధ హోదాలలో...
శ్రీ‌కాకుళం ప్రెస్ క్ల‌బ్  అధ్య‌క్షునిగా వ‌రుస‌గా మూడు సార్లు అధ్య‌క్షునిగా ప‌నిచేసి, ఆ ప‌దవికి వ‌న్నెతెచ్చారు.అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దే శ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్(ఏపీడ‌బ్ల్యూజేఎఫ్‌)కు వ‌రుసగా మూడు సార్లు  రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా, రెండు సార్లు రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఉంటూ, నేష‌న‌ల్ అలియ‌న్స్ ఆఫ్ జ‌ర్న‌లిస్ట్స్(ఎన్ఏజే)లో దేశ రాజ‌ధాని కేంద్రంగా జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. ఈ సంఘంలో నేష‌న‌ల్ కౌన్సిల్ స‌భ్యులుగా కీల‌క బాధ్య‌త‌లు అందుకుని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌‌ర‌ఫున గొంతుక వినిపిస్తున్నారు. విప‌త్తుల స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టులు సేవ‌లందిస్తున్నా, క‌రోనా వంటి మ‌హ మ్మారులు విజృంభ‌ణ‌ల నేప‌థ్యంలో ప్రాణాలు కోల్పోతున్నా జ ర్న‌లిస్టుల‌కు క‌నీసం ప‌రిహారం ఇవ్వ‌క‌పోవ‌డం బాధాక‌రమ‌ని పేర్కొంటూ త‌న పాత్రికేయ సంఘాలు (ఏపీడబ్ల్యూజేఎఫ్,ఎన్‌ఏజే) త ‌ర‌ఫున అత్యున్న‌త న్యాయ స్థానంలో పోరాటం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: