జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో  ఆందోళన చేయాలన్న చంద్రబాబునాయుడు పిలుపును ఇద్దరు ఎంఎల్ఏలు పట్టించుకోకుండా షాకిచ్చారు. బడ్జెట్ ఆమోదానికి జగన్ ప్రభుత్వం రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలను మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే  మంగళవారం మొదటిరోజున సమావేశాలు ప్రారంభం కాగానే చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎంఎల్ఏలు గోల మొదలుపెట్టారు. రాజ్ భవన్ నుండి ఒకవైపు గవర్నర్ బిశ్వజిత్ హరిచందన్ ప్రసంగం మొదలుపెట్టగానే అసెంబ్లీ హాలులో టిడిపి నినాదాలు మొదలుపెట్టింది.

 

ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోకుండా ఇద్దరు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి మాత్రం దూరంగా ఉండిపోయారు. మిగిలిన ఎంఎల్ఏలతో పాటు టిడిపి ఎంఎల్ఏలుగా పై ఇద్దరికి కూడా చంద్రబాబు ఆదేశాలను ముందుగానే ఎన్టీయార్ ట్రస్టు భవన్ నుండి మొబైల్ మెసేజ్ లు వచ్చాయట. అయితే ఉదయం అసెంబ్లీలోకి ప్రవేశించిన దగ్గర నుండి పై ఇద్దరు ఎంఎల్ఏలు మిగిలిన టిడిపి ఎంఎల్ఏలకు దూరంగానే ఉన్నట్లు సమాచారం.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము జరుపుతున్న నిరసనల్లో కలిసి రావాలని కొందరు వంశీ, గిరి దగ్గరకు వెళ్ళి మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదని తెలిసింది.

 

గవర్నర్ ప్రసంగం చేస్తున్నపుడు కాసేపు సభలోనే గోల చేసిన చంద్రబాబు అండ్ కో తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. టిడిపి సభ్యులంతా వెళ్ళిపోయినా వంశీ, గిరి మాత్రం సభలోనే కూర్చున్నారు. సాయంత్రం సభ అయిపోయేంత వరకూ ఇద్దరూ సభలోనే కూర్చున్నారు.  ముగ్గురు ఎంఎల్ఏలు చంద్రబాబు నాయకత్వానికి ఎదురు తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళద్దరితో పాటు కరణం బలరామ్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా అసలు మంగళవారం అసెంబ్లీకే హాజరుకాలేదని సమాచారం.

 

విచిత్రమేమిటంటే చంద్రబాబు అండ్ కో పై ముగ్గురు ఎంఎల్ఏలను జగన్ వైసిపిలో చేర్చుకున్నాడని ఆరోపిస్తునే మరోవైపు పార్టీ తరపున విప్ జారీ చేసే విప్ లు, ఇతర ఆదేశాలను ట్రస్టు భవన్ తరపున ముగ్గురికి పంపుతున్నారు. అంటే పై ముగ్గురు ఎంఎల్ఏలు  టిడిపిలోనే ఉన్నారా ? లేకపోతే వైసిపిలో చేరారా ? అదీకాకపోతే స్వతంత్రులుగా కంటిన్యు అవుతున్నారా ? అనే విషయంలో చంద్రబాబుకే క్లారిటి లేదన్న విషయం తెలిసిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: