2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీపై కయ్యానికి కాలుదువ్విన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని చూసి అబ్బో బాబు అంటూ ఆయన పక్షాన చేరి ఒక కూటమిగా ఏర్పడ్డారు కొందరు ప్రముఖ నేతలు. చంద్రబాబు అండతో మోదీని ఇట్టే ఢీ కొట్టేయొచ్చు అనుకున్నారు. కట్ చేస్తే.. ఎన్నికల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది, మోదీ సారధ్యంలోని బీజేపీకి భారీ మెజార్టీ దక్కింది. దీంతో మోదీ మరోసారి ప్రధాని అయ్యారు. కానీ, చంద్రబాబు మాత్రం బొక్కబోర్లా పడి ఘోర ఓటమి చెందారు.

 

ఇక అప్పటినుంచి చంద్రబాబు, మోదీని విమర్శించడం ఆపేశారు. పైగా సమయం దొరికినప్పుడల్లా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడిదాక అంతా బాగానే ఉంది. ప్రస్తుతం బాబుకు కూడా బీజేపీతో ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీకే. ఎన్నికల ముందు బాబుతో కలిసిన ఈమె.. ఎన్నికల అనంతరం ఎందుకురా బాబు.. ఈ బాబుతో కలిశాను అని తల పట్టుకుంటున్నారట.

 

కూటమి సమయంలో అయితే తాను లేదా మ‌మ‌తా మాత్ర‌మే ప్ర‌ధాని పదవికి అర్హుల‌మ‌ని బాబు ఆశ చూప‌డంతో మ‌మ‌తా కేంద్ర స‌ర్కార్‌పై కాస్త ఎక్కువ దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అలాగే గ‌త ఏడాది జ‌న‌వ‌రి 19న మ‌మ‌తాబెన‌ర్జీ నేతృత్వంలో కోల్‌క‌త్తాలో నిర్వహించిన మహార్యాలీలో బాబుతో కలిసి మోదీపై ఒంటికాలిపై లేచారు మమతా. ఇప్పుడే ఇవే మ‌మ‌తాబెన‌ర్జీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని టాక్. కరోనా వీడియో కాన్పరెన్స్ కి ఆమెను ప్రధాని ఆహ్వానించకపోవడమే ఇందుకో నిదర్శనం అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రధాని మోదీ మమతా దూకుడుని బాగానే గుర్తుపెట్టుకున్నారని తెలుస్తుంది.

 

అందుకే ఆమెపై మోదీ టార్గెట్ పెట్టినట్టు సమాచారం. పైగా ఈ మధ్య కాలంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కూడా ఈమెకు విభేదాలు ఏర్పడ్డట్టు తెలుస్తుంది. అందుకే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో జ్ఞానోదయం తెచ్చుకున్న మమతా.. ఆ రోజు బాబు మాటలకు ఆశ పడకుండా ఉండిఉంటే బాగుండేదని భావిస్తున్నారట. కానీ, తప్పదు.. మోదీపై పోరాటం ముందుకే వెళ్లాడమే తప్పా వెనక్కి తగ్గడం ఉండదు. మరి ఇలాంటి పరిస్థితులను మమతా ఎలా నెట్టుకొస్తారో చూడాలి. ఏదిఏమైనా బాబు మాటలు నమ్మి బొక్కబోర్లా పడ్డ మమతాను చూసి చాలామంది నేతలు అయ్యోపాపం అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: