దెబ్బ మీద దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా.? చాలామందికి ఇది తెలిసే ఉంటుందిలే.. మనందరం ఏదోక సందర్భంలో అలాంటి పరిస్థితిని ఎదుర్కోని ఉంటాం. మరి అలా తగిలిన దెబ్బ మీద మరో దెబ్బ.. ఆ మరో దెబ్బ మీద ఇంకో దెబ్బ పడితే ఎలా ఉంటుందో తెలుసా..? అమ్మ బాబోయ్ అన్ని దెబ్బలు తగిలితే మనిషన్నవాడు ఉంటాడా అనే అనుమానం మీకు కలగక మానదు. కానీ, అలాంటి మనిషి ఒకరున్నారు.. దానికి నిదర్శనం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

 

కానీ, అవి మీరనుకునే దెబ్బలు కాదులే.. రాజకీయ దెబ్బలు. 2019 ఎన్నికల్లో ఓటమితో మొదలైన ఈ దెబ్బలు చంద్రబాబుకి ఇంకా పడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోవడం, అవినీతి కేసుల్లో సొంత నాయకులు జైలుకి వెళ్ళడం, సొంత నేతలే ఆయన్ని బండ బూతులు తిట్టడం, ఇలా ఒకటేమిటి.. 2020 రాజ్యసభ ఎన్నికల వరకు పడుతూనే ఉన్నాయి. ఒక రాజకీయ నేతకి జీవితాంతంలో ఎన్ని దెబ్బలు తగలాలో చంద్రబాబుకి కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే అన్ని తగిలాయి. దీనికి కారణం ఏంటి..? అధినాయకుడు రాజకీయంగా బలహీన పడ్డాడా..? సొంత నేతలు అతనిపై దండెత్తడానికి కారణం ఏంటి..?

 

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక జాతీయస్థాయి నేతకు, జాతీయ రాజకీయాలను శాసించానని చెప్పుకునే నేతకు ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది. దాదాపు ఆయన అనుభవం అంత వయసున్న సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతులో ఘోర ఓటమి చెందడానికి కారణం ఏంటి..? వీటన్నీకి ఒక వ్యక్తే సమాధానం. అతను మరెవరో కాదు చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్. తన తర్వాత తన కొడుకే పార్టీని నడిపించాలన్న చంద్రబాబు అత్యాశే ఆయన పాలిట శాపంగా మారింది. నాయకత్వ లక్షణాలు లేని లోకేష్ చేతిలో పార్టీని పెట్టాలనుకోవడం సొంత నేతలకే నచ్చలేదు.. అందుకే వారు వేరే పార్టీలలోకి వెళ్లిపోయారు. అలాగే బాబు అలా చేయాలనుకోవడం ఆంధ్ర ప్రజలకు కూడా నచ్చలేదు అందుకే బాబుని ఓడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: