ఏ ఎన్నిక‌ల్లో అయినా ఒకే గెలుపు .. ఒకే ఓట‌మి ఉంటుంది. అయితే తాజాగా జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒకటి కాదు రెండు ఓట‌ములు ఎదుర‌య్యాయి. ఎన్నిక ఒక‌టే అయినా ‘రెండు ఓటములు‘ నమోదు చేసుకుంది. అస‌లు ఏ మాత్రం బ‌లం లేని చోట ఎందుకు పోటీ చేయారో వాళ్ల‌కే తెలియాలి.. అది కూడా ఘోరంగా ఓడిపోయే చోట ఓ ఎస్సీ వ‌ర్గానికి చెందిన నేత‌ను నిల‌బెట్ట‌డం చంద్ర‌బాబు చేసిన మ‌రో మిస్టేక్ అనే చెప్పాలి.  టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య నినాదం ‘ఆత్మప్రభోదానుసారం’ ఓటు అసలు ఎవరైనా పట్టించుకున్నారా ?  అంటే ఆయ‌న‌కు ఘోర‌మైన అవ‌మానం మిగ‌ల‌డం మిన‌హా ఎవ్వ‌రికి ఏం ఒర‌గ‌లేదు.

 

టీడీపీకి 23 మంది సభ్యులు అధికారికంగా ఉండగా..ఆ పార్టీ అభ్యర్ధికి కేవలం 17 మాత్రమే పడ్డాయి. అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు  ఎమ్మెల్యేలు కరణం బలరామ్, మద్దాలి గిరి అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇక మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ఇప్ప‌టికే అరెస్టు అయ్యి హాస్ప‌ట‌ల్లో ఉన్నారు. ఇక మ‌రో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కరోనా కారణంగా స్వీయ నిర్భందంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఖ‌చ్చితంగా గెలిచే టైంలో ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ర్ల రామ‌య్య‌కు సీటు ఇస్తామ‌ని చెప్పి.. చివ‌ర్లో చంద్ర‌బాబు వ‌ర్గానికి చెందిన పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్‌కు సీటు ఇచ్చారు.

 

అప్పుడు వ‌ర్ల రామ‌య్య‌కు ఘోర అవ‌మానం మిగిలింది. ఇక ఇప్పుడు మ‌రోసారి ఘోరంగా ఓడిపోయే ప్లేస్‌లో ఆయ‌న్ను నిల‌బెట్ట‌డంతో మ‌ళ్లీ ఘోరంగా ఓడిపోయి మ‌రోసారి అవ‌మానం మిగుల్చుకున్నారు. ఈ ఎన్నిక బరిలో నిలవటం ద్వారా ఎన్నికల్లో ఓడిపోవటం ఒకటి…అర్హత లేకుండా పోటీచేశారనే విమర్శలు.. పాత త‌ప్పుల‌ను విప‌క్షాల‌తో త‌వ్వించుకుని తిట్టించుకోవ‌డం మిగుల్చుకోవ‌డం మిన‌హా టీడీపీకి ఒరిగిందేమి లేదు. ఈ క్ర‌మంలోనే ఓ ఎమ్మెల్యే ఓడిపోయిన‌ప్పుడు ఎస్సీ వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని నిల‌బెట్టారు.. గెలిచిన‌ప్పుడు మీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని నిల‌బెట్టారు ?  అని ఓ ఎమ్మెల్యే లెట‌ర్ రాశారు. ఆ ఎమ్మెల్యే ఎవ‌రా ? అన్న‌దానిపై ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: