సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన విషయం దిశగా అడుగులేస్తుందా..? ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయబోతుందా..? కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమైందా..? ఇలాంటి విషయాలు పూర్తిగా తెలియాలంటే.. ఇది పూర్తిగా చదవాల్సిందే.!

 

భారతదేశంలో కరోనా ప్రభావం అన్నీ రాష్ట్రాల్లో ఒకలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొంచం భిన్నంగా ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తనకున్న అధికారాలతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ కి మధ్య యుద్ధం మొదలైంది. ఆయన అతడు టీడీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడని అధికారపక్షం ఆరోపించింది. అది కాస్తా హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా చేరింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది.. ఇదంతా అందరికీ తెలిసిన కథనే.

 

తెలియాల్సిన కథ ఏంటంటే.. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత వాయిదా పడ్డ ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కూడా భావించింది. కానీ కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే సూచనలు కనపడకపోవడంతో ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి 2021లో ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అప్పటిలోపు ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు 2021 గణతంత్ర దినోత్సవం నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.

 

ఎలాగైనా సరే కొత్త జిల్లాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందట. వాస్తవానికి ఇదంతా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ.. కాబట్టి ఎన్నికల అధికారితో సమావేశమై ప్రస్తుత పరిస్థితిని ఆయనకి వివరించి పాత నోటిఫికేషన్ ను రద్దు చేయించి.. సమయం వచ్చినప్పుడు కొత్త నోటిఫికేషన్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయట. దీనిపై వచ్చిన వార్తల్లో  ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకన ఇంకా విడుదల కాలేదు. కానీ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలు చూస్తుంటే దీనిపై త్వరలోనే ఒక స్పష్టత రాబోతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: