ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారా..? అంటే అవుననే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. అది కూడా ఒక్కసారి కాదట.. రెండు సార్లు అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అసల పవన్, జగన్ కి ఎందుకు ఫోన్ చేశాడు..? అంత అవసరం పవన్ కి ఏముంది..? అనే ప్రశ్నల గురించి ఆరాతీయగా.. దాని వెనకున్న అసలు కథ బయటపడింది. అదేంటంటే..

 

ఇటీవలే పదో తరగతి పరీక్షల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం జగన్ సర్కార్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఆయన ఈ చర్యను ఖండిస్తూ.. ఏపీ ఎమ్మెల్యేల ప్రాణాలే కాదు. పదో తరగతి విద్యార్థుల ప్రాణాలు కూడా ముఖ్యమే. కరోనా వల్ల ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులే నిర్వహిస్తుంది. కానీ, పదో తరగతి పరీక్షలు మాత్రం పూర్తిగా నిర్వహిస్తామని చెబుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఉంది. వాళ్లకు తెలుసు పదో తరగతి విద్యార్థులకు ఓటు హక్కు లేదని… అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

 

https://twitter.com/PawanKalyan/status/1272868071724552192 

 

అయితే పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా మారాయి. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఈ ఉదయం పవన్ కళ్యాణ్, సీఎం జగన్ కి ఫోన్ చేసి పదో తరగతి పరీక్షల విషయం గురించి పర్సనల్ గా మాట్లాడినట్టు సమాచారం. కాగా, సీఎం జగన్ కూడా పవన్ మాటలకు చాలా సానుకూలంగా స్పందించారట. దీనిపై ఖచ్చితంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని జగన్ కూడా పవన్ కి చెప్పినట్టు టాక్. అయితే కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీఎం జగన్ కూడా దీనిపై అప్పటికే ఆలోచిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.

 

దీనిపై బాగా చర్చించిన రాష్ట్ర ప్రభుత్వం.. పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసి, అందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయం తెలియగానే పవన్ మళ్ళీ సీఎం జగన్ కి ఫోన్ చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. అలాగే తన విన్నపాన్ని పరిగణంలోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపినట్టు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో టాక్. అదేవిధంగా పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దు చేసి ట్యాక్సీల యజమానులను ఆదుకోవాల‌ని ప‌వ‌న్ కళ్యాణ్, సీఎం జగన్ ని కొరినట్టు తెలుస్తుంది దీనిపై కూడా జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: