కొన్ని ప‌రిస్థితులు చాలా చిత్రంగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మ‌న ప్ర‌మేయం లేకపోయినా.. చిక్కుల్లో ప‌డిపోతాం. మ‌రికొన్ని సార్లు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న ప్ర‌మేయంతోనే చిక్కులు కొని తెచ్చుకుం టాం. దీనిలో ఏది ఎప్పుడు జ‌రిగినా.. చిక్కులు అనుభ‌వించేది మాత్రం మ‌న‌మే!  సో.. కాబ‌ట్టి.. మ‌నం కొం చెం మారితే.. ఏ చిక్కులు ఉండ‌వు క‌దా!?- ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది... ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో.  `మా రాజుగారు చానా గొప్పోళ్లండీ బాబూ..!`- అంటూ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కొనియాడిన నోళ్లే.. ఇప్పుడు `కేవ‌లం ఎంపీ అయిపోతేనే కాదండి రాజుగారూ.. మ‌నం కొంచెం మారాలండి బాబూ!!`- అంటున్నాయి.

ఆకెళ్లి ముల్లుకు గుచ్చుకున్నా.. ముల్లొచ్చి.. ఆకుకు త‌గులుకున్నా.. జ‌రిగేదేంటో కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స ‌రం లేదు. ప్ర‌స్తుతం రాజ‌కీయ నేత‌ల ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. త‌న‌కు తిరుగేలేద‌ని, దేశ‌రాజ‌కీయాల్లో తానే సీనియ‌ర్‌న‌ని చెప్పుకొన్న నాయ‌కులు మ‌ట్టి క‌రిచిన ప్ర‌జాస్వామ్యం ఇది! ``మ‌న‌కేదో జ‌రిగిపోయింద ని, మ‌న ఈగో దెబ్బ‌తినేసింద‌ని తెగ ఫీల‌వ‌డం మానేసి.. మ‌న ప‌నేదో మ‌నం చేసుకుంటూ పోతా వుంటే.. ఆ వ‌చ్చే గుర్తింపేదో రాకుండా ఎవ‌డైనా ఆపుతాడంటావా?``- అంటాడు దాస‌రి నారాయ‌ణ రావు ఎమ్మెల్యే ఏడుకొండ‌లు సినిమాలో! ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే.. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు.. త‌న‌కు భ‌ద్ర‌త కొర‌వ‌డింద‌ని కేంద్రానికి లేఖ రాశారు.

దీంతో స్థానికంగా ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై.. చ‌ర్చ జ‌రుగుతోంది. శాంతి, సామ‌ర‌స్యానికికి పెట్టింది పేరైన న‌ర‌సాపురంలో హ‌త్య‌ల‌కు తావులేద‌ని, కేవ‌లం ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయ‌ని అంటున్నారు. ఏదేమైనా.. మీరు దూకుడు పెంచార‌ని, ఇలా కాకుండా.. ప‌నిలో దూకుడు పెంచి ఉంటే..ప‌ర‌మార్థం వేరేగా ఉండేద‌ని కూడా ఇక్క‌డ ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ``వైసీపీ నాయ‌కులు దిష్టి బొమ్మ‌లు త‌గ‌ల బెడుతుం టే.. సీఎం జ‌గ‌న్‌కి క‌నిపించ‌లేదా?``- అని రాజుగారు ప్ర‌శ్న సంధించారు. పార్టీ పెట్టారు. మీకు టికెట్లు ఇచ్చారు. స‌రే మీరే గెలిచారో.. ఆయ‌నే గెలిపించారో.. ఏదో ఒక‌టి జ‌రిగి.. మీకు ప్ర‌జ‌లు ఓటేశారు. ఇక‌, మీ ప‌నేంటి?  మీరు చేయాల్సింది ఏమిటి?  జుట్టు జుట్టు ముడేసుకుని.. క‌య్యాల‌కు కాలుదువ్వ‌డ‌మా?

సొంతింటికే నిప్పు పెట్టుకునే ద‌గుల్బాజీ ప‌నులు చేయ‌డ‌మా?  మీకు వాటాలు ద‌క్క‌లేద‌నో, వాళ్ల‌లో వాళ్లే పంచేసుకుంటున్నార‌నో అక్క‌సు త‌ప్ప మ‌రేమీ క‌నిపించ‌ని మీ రాజ‌కీయాలు పెచ్చ‌రిల్లి దిష్టి బొమ్మ‌ల ద‌హ‌నాల‌కు దారితీస్తే.. త‌న ప‌నిమానుకుని సీఎం జ‌గ‌న్ మీకు కాపాలా ఉండాలా?  ఏంటిది రాజుగారూ.. మ‌రీ అజ్ఞానం కాక‌పోతేను! అంటున్నారు రాజుగారికి ఓటేసినోళ్లే! ఇక‌, తాజాగా ఎంపీగారు మ‌రో వ్యాఖ్య చేశారు. ``ఏబీఎన్‌తో మాట్లాడే.. మాకు విధించే శిక్ష‌లు వేరేగా ఉంటాయి!`` అని!! దీనికి కూడా స్థానికులు మంచి కౌంట‌ర్‌తోనే కుమ్మేశారు. ``రాజు గారు.. ఒక్క‌సారి రింగులు రింగులు వేసుకుని రెండేళ్ల కింద‌కి వెళ్లిపోంది. అప్ప‌ట్లో అధికార పార్టీ టీడీపీ.. సాక్షికి ఇంట‌ర్వ్యూలు ఇచ్చిందా?  త‌న పార్టీ నేత‌ల‌ను సాక్షితో మాట్లాడ‌నిచ్చిందా?  ఏ పార్టీ అయినా అంతేసార్‌!! అందుకే కేవ‌లం ఎంపీ అయిపోతేనే స‌రా.. మ‌నం కొంచెం మారాలండా!!``- అంటున్నారు. మ‌రి రాజుగారు ఏమంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: