రాజ‌కీయాల్లో నేను అన్నేళ్లున్నాను.. ఇన్నేళ్లున్నాను.. అని చెప్పుకోవ‌డం కాదు!  ఎంత వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారనేదే కీల‌కం. ఓ సినిమాలో మ‌హేష్‌బాబు చెప్పిన‌ట్టు.. ``ఎప్పుడొచ్చాం అన్న‌ది కాద ‌న్న‌య్యా!!`` అన్న‌ట్టుగా పాలిటిక్స్‌లోనూ ఎప్పుడు అడుగు పెట్టార‌న్న‌ది కాదు.. ఎంతగా ప్ర‌జ‌ల హృద‌యా ల‌ను కొల్ల‌గొట్టాం అన్న‌దే కీల‌కం!ఇప్పుడు ఇవే మాట‌లు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అన్వ‌యం అవుతున్నాయి. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప‌దేళ్ల‌కు మించ‌దు. అయినా కూడా ఒంట‌రి పోరులో అధికారాన్ని ద‌క్కించు కున్నారు. స‌రే! ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా కూడా త‌న వ్యూహాత్మ‌క అడుగుల‌తో గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు అంద‌రి మ‌న‌సుల‌నూ కొల్ల‌గొట్టారు.

ప్ర‌స్తుతం వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి.. చైనా దూకుడును క‌ట్ట‌డి చేసే విష‌యంలో `ఏం చేద్దాం..` అనే విష యంపై సీఎంల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం జ‌గ‌న్ చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు. `ఈ ఆప‌త్స‌మ‌యంలో మేమంతా మీ వెంటే`- అంటూ వెల్ల‌డించారు. ఎక్క‌డా స‌ల‌హాలు కానీ.. సూచ‌న‌లు కానీ చేయ‌లేదు. అంతేకాదు, తానొక రాష్ట్రానికి సీఎంగా ఉన్నాన‌ని, మొత్తం 5 కోట్ల ప్ర‌జ‌ల త‌ర‌ఫున మీకు హామీ ఇస్తున్నాన‌ని, మీరు ఎలా చేసినా.. ఏం చేసినా.. మేం మీవెంటే ఉంటామ‌ని చెప్పారు. అంతే.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ముగ్ధుల‌య్యారు. నిజానికి మోడీ ప్ర‌తిప‌క్షాల‌తో ను అన్ని పార్టీల నేత‌ల‌తోనూ మాట్లాడ‌తార‌ని స‌మాచారం అంద‌గానే.. రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రెడీ అయింది.

ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. చంద్ర‌బాబును మోడీ ఎలా వ‌దిలిపెడ‌తారు.. అనుకున్నారు. కానీ, ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టిన మోడీ.. జ‌గ‌న్‌ను సంప్ర‌దించారు. అదేస‌మ‌యంలో త‌మ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తోనూ మోడీ మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌.. ఒక్క‌దెబ్బ‌కు అన్న‌ట్టుగా.. దేశ భ‌ద్ర‌త విష‌యంలో ఆయ‌న ఎలాంటి సందేహాలు వ్య‌క్తం చేయ‌కుండా.. మొత్తంగా మీ వెంటే ఉంటామ‌ని చెప్ప‌డం ద్వారా మోడీ హృద‌యాన్ని ఆయ‌న కొల్ల‌గొట్టారు. ఈ ప‌రిణామం తాలూకు ఫ‌లితం.. చాలా ఉంటుంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న ధోర‌ణికి జ‌గ‌న్ చెక్ పెట్టేలా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు.

అంతేకాదు, చైనా విష‌యంలో మోడీపై న‌లుదిక్కులా విమ‌ర్శ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో.. జ‌గ‌న్.. `ఇది విమ‌ర్శ‌ల‌కు తావులేని స‌మయం. ఎవ‌రూ వ్య‌క్తిగ‌త రాజ‌కీయాలు చేయ‌కుండా దేశ భ‌ద్ర‌త‌కు ప్ర‌తి ఒక్క‌రూ క‌ట్టుబ‌డాలి`` అని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ రెండు విష‌యాల్లోనూ ఢిల్లీ పెద్ద‌లు నిశితంగా గ‌మ‌నిస్తు న్నారు. జ‌గ‌న్ ప‌రిణితిగ‌ల నాయ‌కుడ‌ని, భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా ఆయ‌న రాణిస్తాడ‌ని.. ఢిల్లీ పెద్ద‌లు అంటుండ‌డం విశేషం. అంతేకాదు, పెద్ద‌గా ప్ర‌చారం కూడా కోరుకోవ‌డాన్ని వారు మ‌రింత పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ పాలిటిక్స్‌ ముందు.. పార్టీలు ఫిదా.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు.. మ‌న‌సు కొల్ల‌గొట్టారుగా! అని అన‌కుండా ఉండ‌గ‌ల‌మా!!

మరింత సమాచారం తెలుసుకోండి: