2024 ఎన్నికలు లక్ష్యంగా ఇప్పుడు అన్ని పార్టీలు రాజకీయాలను నడిపిస్తున్నాయి.అధికార పార్టీ హవా తగ్గించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తుంటే, తమ బలం మరింత పెంచుకునే విధంగా అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఇవన్నీ ఇళ్ల ఉంటే ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరబోతోంది అనే సంకేతాలు వస్తుండడంతో బీజేపీ, జనసేన ఈ రెండు పార్టీలు బాగా ఆశలు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని అధికారం పంచుకోవాలని కలలు కుంటున్నాయి. బిజెపికి ఏపీలో ఉన్న బలం అంతంత మాత్రమేనని బాగా తెలుసు. అందుకే ప్రజా ఆకర్షణ నాయకుడు అవసరం ఉందని గ్రహించి, తెలివిగా జనసేన పార్టీని చేరదీసింది.

IHG


 ఆ పార్టీ అధినేత పవన్ కు జనాల్లో ఉన్న క్రేజ్ ను సక్రమంగా వాడుకుంటే, బిజెపికి కలిసి వస్తుందని అధిష్టానం పెద్దలు ముందుగానే గ్రహించారు. అంతేకాకుండా పవన్ సామాజిక వర్గం వారు కూడా ఆయనను ఆరాధిస్తూ ఉండటం, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం, ఇలా ఎన్నో అంశాలు జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీకి మార్గంగా కనిపించింది. పవన్ ను ముందు పెట్టి రాజకీయం నడిపిస్తే, సులువుగా అధికార పీఠం దక్కించుకోవచ్చు అని బిజెపి ఎత్తుగడలు వేసింది. అనుకున్నట్టుగానే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఇప్పటి  నుంచే జనసేన తో కలిసి వెళ్లే కంటే, ఎన్నికల సమయంలో చూద్దాంలే అన్నట్టుగా ప్రస్తుతం ఆ పార్టీ పట్టించుకోకుండా సొంతంగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు బిజెపి ఉంది.


 ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో అంశాల గురించి ప్రస్తావించారు. తనకు అధికారం ముఖ్యం కాదని, ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అంటూ పవన్ ఎన్నో మాటలు చెప్పాడు. బిజెపి, వైసిపి పార్టీలను గట్టిగానే విమర్శించాడు. ప్రధాని నరేంద్ర మోదీ ని సైతం తీవ్రస్థాయిలో దుయ్యబట్టాడు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత కానీ పవన్ కు తన బలం ఏమిటో అర్థం కాలేదు. ఇలాగే ఉంటే 2024 ఎన్నికల్లో ఇదే పరిస్థితి వస్తుందనే ఆలోచనతో బీజేపీతో దోస్తీ కి సై అన్నాడు .ఇక బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆ పార్టీ వ్యవహరిస్తుండడం, బిజెపి అగ్రనాయకులు అపాయింట్మెంట్ కూడా పవన్ కు లభించకపోవడం వంటి ఎన్నో అంశాలు ఆయనకు ఇప్పుడు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. 


ఏపీ లో జరిగే ప్రజా పోరాటాలు కానీ, ఏ విషయంలోనూ జనసేనను కలుపుకుని వెళ్లకుండా బిజెపి ఏపీలో ఒంటరిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరు  జన సైనికులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. బీజేపీతో పొత్తు అంటే అన్ని విషయాల్లోనూ తనను ముందు పెట్టి వెనకుండి చక్రం తిప్పుతారని పవన్ భావిస్తుంటే, బిజెపి జనసేన ను పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్న తీరు పవన్ కు మింగుడు పడడం లేదు. తాజాగా సెంటర్ ఫర్ సెపాలజీ అనే సంస్థ ఏపీలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి అధికారం దక్కుతుందని సర్వే చేపట్టగా, గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో వైసిపి గెలుస్తుందని, 55 శాతం ఓట్లు వస్తాయని, టిడిపి మరింత దిగజారుతుందని, ఇక బీజేపీ జనసేన కూటమికి 5.3 శాతానికి మించి ఓట్లు రావడం కష్టం అంటూ తేల్చడంతో ఇప్పుడు జనసేన పార్టీలో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. 


బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళినా తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని, ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్లే విధంగా బలం పుంజుకుంటే మంచిదని, అనవసరంగా పవన్ బిజెపి ట్రాప్ లో  చిక్కుకున్నారనే వాదన ఇప్పుడు జనసైనికులు తీసుకొస్తున్నారు. ఇక పవన్ కూడా చాలా రోజులుగా బిజెపి వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దశలో బీజేపీ ట్రాప్ నుంచి బయటకి వచ్చేయ్ పవన్ అంటూ సొంత పార్టీ నాయకులే పిలుపు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: