జేసి బ్రదర్స్ కి టీడీపీ అధినేత చంద్రబాబు మీద నమ్మకం పోయిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇన్ని రోజులు కూడా చంద్రబాబు ఉన్నారు అని భావించిన వాళ్ళు ఇప్పుడు న్యాయ సహాయ౦ అంది౦చే విషయంలో చంద్రబాబు... జేసి బ్రదర్స్ కి సహకారం అందించడం లేదు అని అంటున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు అనంత‌పురం జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్ ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టుగా ఉంది. ఎప్పుడు అయితే పార్టీ ఓడిపోయిందో అప్ప‌టి నుంచి వాళ్ల‌కు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్ రెడ్డిని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. 

 

ఈ క్ర‌మంలోనే జేసీ కుటుంబానికి తాము అండ‌గా ఉంటామ‌ని బాబు హామీ ఇచ్చారు. ఇటీవల లోకేష్ పరామ‌ర్శ‌కు వెళ్ళిన సమయంలో న్యాయ సహాయం గురించి చర్చ జరిగింది. అప్పుడు లోకేష్ కూడా సానుకూలంగా స్పందించారు అని సమాచారం. కాని ఆ తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం దీని గురించి ఏమీ స్పందించలేదు అని తెలుస్తుంది. పార్టీ నేతలతో నిర్వహించిన ఒక సమావేశంలో అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత కూడా జేసీ కుటుంబానికి న్యాయ సహాయం అందించాలి అని సూచించినా సరే చంద్రబాబు నుంచి సరైన స్పందన రాలేదు అని అంటున్నారు. 

 

దీనితో జేసి బ్రదర్స్ లో ఇప్పుడు అసహనం తీవ్ర స్థాయిలో ఉంది అని అంటున్నారు. జేసి దివాకర్ రెడ్డి బిజెపిలోకి వెళ్ళాలి అని భావిస్తున్నార‌ట‌. ఈ ప్ర‌చారం గ‌త కొన్ని నెల‌లుగా జ‌రుగుతూనే ఉంది. అయితే  ఆ తర్వాత మళ్ళీ బిజెపి టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అప్పుడు మళ్ళీ చంద్రబాబు తో కలిసి పని చెయ్యాలి అనే ఆలోచన ఆయనలో ఉందని... అందుకే పార్టీ మారే విష‌యంలో వెనక్కు తగ్గుతున్నారని టాక్‌. ఇక జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సంగ‌తి ఏమో గాని దివాక‌ర్ రెడ్డి అయితే రాజకీయాల నుంచి శాశ్వ‌తంగా తప్పుకునే ఆలోచనలో ఉన్నారట. బాబోరికి వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో ఇది మ‌రో షాక్ అనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: