డ్రాగన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. మూడు ప్రాజెక్టుల ఏర్పాటుకు గతంలో మహారాష్ట్రప్రభుత్వానికి చైనా కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాల తర్వాత నుండి రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు మొదలయ్యాయి. మొన్నటి 15వ తేదీ రాత్రి  లడ్డాఖ్ లోయలోని గాల్వాన్ నదీ ప్రాంతంలో జరిగిన ఘర్షణలతో ఉద్రిక్తతలు తీవ్రస్ధాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే.  రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు చనిపోగా డ్రాగన్ దేశానికి చెందిన 40 మంది సైనికులు కూడా మరణించారు.

 

ఎప్పుడైతే గాల్వన్ నదీ ప్రాంతంలో ఘర్షణలు జరిగాయో యావత్ దేశంలో  చైనాపై నిరసనలు పెరిగిపోతున్నాయి. చైనా వస్తువులను భవిహష్కరించాలని, చైనా వస్తువులను నిషేధించాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చైనా వస్తువుల అమ్మకాలు, నిషేధం అన్నది డిమాండ్లు చేసినంత తేలిక కాదన్న విషయం తెలిసిందే.

 

ఈ నేపధ్యంలోనే చైనా కంపెనీలకు షాకిస్తు మహారాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.  ఘర్షణలకు ముందే ముంబాయ్ లో ’మేగ్నటిక్ మహారాష్ట్ర 2.0’  అనే కాన్సెప్టుతో ఇన్వెస్టర్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి చైనా కంపెనీలకు మధ్య రూ. 5 వేల కోట్ల విలువైన  మూడు ఒప్పందాలు జరిగాయి.  చైనాలోని హెంగ్లీ ఇంజనీరింగ్ తో రూ. 250 కోట్ల ఒప్పందాన్ని, గ్రేట్ వాల్ మోటార్స్ తో కుదుర్చుకున్న రూ. 3770 కోట్ల ప్రాజెక్టు, రూ. 1000 కోట్ల విలువ చేసే  పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ  ప్రాజెక్టును ప్రభుత్వం సస్పెన్షన్లో ఉంచింది.

 

 

పై మూడు కంపెనీలతో ప్రాజెక్టులను రద్దు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని  అనుమతి కోరింది. అనుమతి వచ్చేంత వరకు అగ్రిమెంట్లను సస్పెన్షన్ లో ఉంచినట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్దితుల దృష్ట్యా మూడు ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చైనా కంపెనీల యాజమాన్యాలకు చెప్పేసింది. మొత్తానికి చైనా ప్రాజెక్టులతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోబోతున్న మొదటి రాష్ట్రం మహారాష్ట్రానే ఏమో. చూడాలి ఇంకెన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయో.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: