వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మౌనం దేనికి సంకేతం..? ఆయన మౌనమే ఆయన పాలిట శాపం కానుందా..? ఆ మౌనమే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందా..? ఆ మౌనమే వైసీపీని ఇరుకున పెట్టబోతుందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనుననే అనిపిస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయమంతా ఇప్పుడు ఒక్కే ఒక్క దాని చుట్టూ తిరుగుతుంది.. అదే 108 అంబులెన్స్‌ల కుంభకోణం. అసలు ఈ కుంభకోణం ఏంటి..? దీని వెనుక ఉన్నది ఎవరు..? అనే వివరాలు చూస్తే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అంబులెన్స్‌ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. 800 కోట్లకు పైగా అవినీతి ఈ అంబులెన్స్‌ల విషయంలో జరిగిందన్నది టీడీపీ ఆరోపణ. ఈ మేరకు టీడీపీ నేత పట్టాభి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాల్ని ఆయన మీడియా ముందుకు తెచ్చారు. విజయసాయిరెడ్డి తన అల్లుడికి లబ్ది చేకూర్చేలా వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణ.

 

అలాగే 150 కోట్ల కుంభకోణమంటూ అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదు.? అని టీడీపీ ప్రశ్నిస్తోంది. మరోపక్క.. పట్టాభి తప్పుడు ఆరోపణలు చేశారన్న కోణంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్దామయ్యారు పోలీసులు. దీంతో ఏ క్షణమైనా పట్టాభిని అరెస్ట్‌ చేయొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తుంది. అసలు ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. విజయసాయి రెడ్డి దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఇక్కడే అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌ గా వుంటారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలకు ఆయన నిత్యం ప్రశ్నలు, కౌంటర్ లు వేస్తూనే ఉంటారు.

 

రాష్ట్రంలో ఏం జరిగినా దానిపై స్పందించే విజయసాయి.. ఈ వ్యవహారంపై స్పందించకపోవటంతో రాజకీయ వర్గాల్లో చాలా అనుమానాలు తేలెత్తుతున్నాయి. ఈ అవినీతి ఆరోపణలపై విజయసాయి నోరు తెరవట్లేదు అంటే దీన్ని నిజం అని భావించాలా. లేకపోతే ఆయన మౌనం వెనుక వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది అర్ధం కావట్లేదు. పైగా ఈ వ్యవహారం సీఎం జగన్ కి కూడా తలనొప్పిగా మారినట్టు వైసీపీ వర్గాల్లో టాక్. మరి విజయసాయి ఇప్పటికైనా నోరు విప్పి ప్రతిపక్షాల నోర్లు మూపిస్తారా. లేక మౌనంగా ఉంటూ అధినేత ఆగ్రహానికి గురవుతార. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: