ప్ర‌పంచ ప‌రిణామ క్ర‌మంలో 20వ శ‌తాబ్దంలో అగ్ర‌రాజ్యం అమెరికా ఎంత ప్ర‌భావితం చేస్తోందో అదే స్థాయిలో భార‌త్‌, చైనాల ప్ర‌భావ‌మూ ఉంది. చైనా ఇప్ప‌టికే అనేక రంగాల్లో అమెరికాకు స‌వాళ్లు విసిరే రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక భార‌త్ కూడా సూప‌ర్ ప‌వ‌ర్‌గా ఎదుగుతూనే ఉంది. ఈ రెండు దేశాల‌కూ ఉన్న బ‌లం..బ‌ల‌హీన‌త‌..అధిక జ‌నాభాయే. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక యువ‌శ‌క్తి క‌లిగిన దేశం భార‌త్‌...చైనాలో కూడా ఇంచుమించు అదే ప‌రిస్థితి. గ‌త పాతికేళ్ల‌లో చైనా సాధించిన ప్ర‌గ‌తి నిజానికి అమెరికాలోనూ జ‌ర‌గ‌లేద‌న్న‌ది వాస్త‌వం. ఇబ్బడి ముబ్బ‌డిగా చైనా వ‌స్తువుల‌ను అమెరికా దిగుమ‌తి చేసుకుంటోంది. ఆ మాట కొస్తే భార‌త్ ది కూడా అదే ప‌రిస్థితి. 


పారిశ్రామికంగా ఎంతో ప్ర‌గ‌తి సాధించామ‌ని చెప్పుకుంటున్న అమెరికాకు వాస్త‌వానికి ఇది ఒక‌ర‌కంగా ఎదురుదెబ్బేన‌ని చెప్పాలి. చైనా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తువుల‌ను ఎగుమ‌తి చేస్తుండ‌గా..దిగుమ‌తి చేసుకోని దేశం భూ మండ‌లం మీద లేదంటే ఆశ్చ‌ర్యం లేదు. అనేక దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు చైనా వ్యాపార సూత్రానికి దాసోహమ‌య్యాయి. డ్రాగ‌న్ వ్యాపారులు ప్ర‌పంచ‌మంతా విస్త‌రించి కారు చౌక‌గా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గుప్పిట ప‌ట్టేశారు. పేరుకే క‌మ్యూనిస్ట్ దేశం..అన్న మాటేగాని పెట్టుబ‌డి విధానంలో వారికెవ‌రూ సాటిరార‌న్న‌ది ప్ర‌పంచానికి అతిత‌క్కువ కాలంలోనే తెలిసివ‌చ్చింది. క‌రోనా విష‌యంలో చైనా వ్య‌వ‌హ‌రించిన తీరు మాత్రం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ను ఆ దేశానికి శ‌త్రువును చేస్తున్నాయి. వాస్త‌వానికి ఇందులో క‌చ్చితంగా చైనా త‌ప్పు ఉంది.


చైనా వ్యాపారాల‌కు ఐరోపా దేశాలు చెక్ పెట్టేస్తున్నాయి. దిగుమ‌తుల‌కు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అగ్రిమెంట్ల‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. చైనా క‌న్నింగ్ నేచ‌ర్ బ‌య‌ట‌ప‌డ‌టంతో  ఇప్పుడు ఆ దేశ వ్యాపార సంబంధాల‌ను తెంచుకుంటున్నాయి. ఈక్ర‌మంలోనే పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గధామంగా క‌నిపిస్తున్న భార‌త్‌ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్న చైనా ..బార్డ‌ర్‌లో అల‌జ‌డి రేపుతోంది. అయితే భార‌త్ నుంచి కూడా చైనాకు అంతకంటే ఎక్కువ‌గానే  ప్ర‌తిస్పంద‌న వ‌స్తుండ‌టంతో డ్రాగ‌న్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిక్కులు త‌ప్పేలా లేవ‌న్న‌ది నిజం. చైనాతో ఇప్ప‌టికే అనేక వాణిజ్యం సంబంధాల‌ను భార‌త్ తెంచుకుంటూ వ‌స్తోంది. ఐరోపా దేశాల మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. చైనాకు భార‌త్ ఎగుమ‌తుల‌ను ఇప్ప‌టికే నిలిపేసింది. అక్క‌డి నుంచి వ‌స్తున్న వ‌స్తువుల‌పై చాలా ఆంక్ష‌లే విధిస్తోంది.

 

 తాజాగా  చైనా నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకోవడం.. సాధ్యమైనంత మేర నివారించాలని భారత సైన్యానికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు తయారు చేసే సంస్థలను నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్ కోర‌డం గ‌మ‌నార్హం. చైనా సరకులో నాణ్యతా లోపాలు ఉన్నాయని తెలిపారు. సైనికుల శరీరాలను రక్షించే కవచాల తయారీలో స్వదేశీ సంస్థలను ప్రోత్సహించాలని ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం..నీతి ఆయోగ్‌కి సూచించింది. భారత సైన్యానికి మూడు లక్షల బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు అవసరమని ప్రభుత్వ వర్గాల అంచనా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: