ఫార్టీఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ. రాజ‌కీయ పండితుల‌కే పాఠాలు నేర్పిన రాజ‌కీయ వేత్త‌గా ఎవ‌రూ.. ఎలాం టి ప్ర‌శ్న‌లూ అడ‌గ‌కుండానే త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకునే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏడాది కాలం గా ప్ర‌తిప‌క్షంలో కూర్చున్నారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా స్టార్ట‌యి పోయింది. మ‌రి ఆయ‌న స‌భ్య స‌మా జానికి ఇచ్చే సందేశం ఏంటి?  పైగా ఇప్పుడు క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో సామాన్యుల నుంచి ప్ర‌భు త్వా ల వ‌ర‌కు కూడా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు చితికిపోయి.. అల‌మ‌టిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ఏం చెప్ప‌దలుచుకు న్నారు?  నేనే క‌నుక అధికారంలో ఉంటే.. అని చంద్ర‌బాబు, మా బాబే క‌నుక సీఎం పీఠంపై ఉంటే.. అని త‌మ్ముళ్లు.. ఈ క‌రోనా స‌మ‌యంలో ఈ క‌ష్ట కాలంలో పొలికేక‌లు పెడుతున్నారే త‌ప్ప‌.. అస‌లు విష‌యాన్ని మాత్రం ఎక్క‌డా వెల్ల‌డించ‌డం లేదు. 

నిజ‌మే!  ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు!! సో.. మీరు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. అయినా.. బాధ్య‌తాయుత ప్ర‌తిప‌క్షం అ ని మీరు చెప్పుకొంటున్నారు క‌నుక‌.. పోనీ.. ఫ‌ర్ స‌పోజ్‌.. మీరే అధికారంలో ఉండి ఉంటే. ఈ క‌రోనా స‌మ ‌యంలో ఏం చేసేవారు? ఇప్పుడు సామాన్యులు సంధిస్తున్న `కౌన్ బ‌నేగా క‌రోనా రిలీఫ్ ప‌తి!` ప్ర‌శ్న‌!! అయి తే, చంద్ర‌బాబుగారు ఈ సామాన్యుల గోల ప‌ట్టించుకునే రేంజ్‌లో లేర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ ‌న ఏదైతే.. అధికార ప‌క్షం వైసీపీని, సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి `కుట్ర రాజ‌కీయాలు మానండి`- అంటు న్నారో.. వాటినే ప‌ట్టుకుని వేలాడుతున్నారట‌! క‌రోనా నేప‌థ్యంలో ప‌డిపోయిన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను నిల‌బెట్టేందుకు, ప్ర‌జారోగ్యం స‌హా.. రాష్ట్ర ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు స‌ల‌హాలు , సూచ‌న‌లు ఇస్తార‌ని అంద‌రూ ఆశ పెట్టుకున్నారు. 

కానీ, చంద్ర‌బాబు మ‌న‌సు మాత్ర‌.. అధికార పార్టీ వైసీపీపై బుర‌ద‌జ‌ల్ల‌డం, సీఎం జ‌గ‌న్‌కు ప‌రిపాల‌న చేత‌కా దనే ట్యాగ్‌ను ఎలా త‌గిలించాలా? అనే ఆలోచ‌న‌లో ఆయ‌న మునిగిపోతున్నార‌ట‌. తాజాగా  మ‌ళ్లీ జ‌గ‌న్ స‌ర్కారుపై ఆయ‌న హైకోర్టులో ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డితో పిటిష‌న్లు వేయించారు. మండ‌లిని ర‌ద్దు చేయ‌డం అంటే.. ఎమ్మెల్సీల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మేన‌ని, అస‌లు మండ‌లిర‌ద్దు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కూడా ఆ పిటిష‌న్‌ల‌లో కొత్త వాద‌న తీసుకువ‌చ్చారు. అదేస‌మ‌యంలో మూడు రాజ‌ధానుల విష‌యంపై ఇప్ప‌టి కే మండ‌లి చైర్మ‌న్ సెల‌క్ట్ క‌మిటీకి పంపారు కాబ‌ట్టి.. ఇప్పుడు మ‌ళ్లీ బిల్లును ఆమోదించే హ‌క్కు అసెంబ్లీకి లేద‌ని కొత్త‌వాద‌న‌తో హైకోర్టుకు ఎక్కారు. స‌రే! ఈ విష‌యం న్యాయ ప‌రిధిలో ఉంది కాబ‌ట్టి.. దీనిపై ఎక్కువ చ‌ర్చ అన‌వ‌స‌రం. 

మ‌రి ఇలాంటి క‌రోనా స‌మ‌యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌భుత్వాల‌కు స‌ల‌హాలి వ్వాల్సింది పోయి.. అడుగ‌డుగునా.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం.. కుట్ర రాజ‌కీయం కాదా?  ఇప్ప‌టికే హైకోర్టులో ఉన్న అంశాల‌పై మ‌ళ్లీ మ‌ళ్లీ పిటిష‌న్లు దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం కుట్ర కింద‌కి రాదా?  మండ‌లి ర‌ద్దు చేయాలా...?  ఏర్పాటు చేయాలా? అనే అధికారం అస‌లు అసెంబ్లీకే లేద‌న ‌డం  కుట్ర అనిపించుకోదా?  ఏదో ర‌కంగా ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌కు అడ్డుత‌గ‌లాల‌నే ప్ర‌య‌త్నం కాదా?  మొత్తంగా చంద్ర‌బాబు చేస్తున్న రాజ‌కీయాలు ఏ కోవ‌లోకి వ‌స్తాయి. స‌భ్య స‌మాజానికి ఆయ‌న ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు మాన్యుల నుంచి సామాన్యుల వ‌ర‌కు సంధిస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి దీనికి బాబు.. ఆయ‌న ప‌రివారం ఏం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: