నిజ‌మే! రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో సీఎం జ‌గ‌న్ అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా అమ‌లు చేశారు. సామ్య‌వాద ప్ర‌భుత్వా లు కోరుకునే.. ప్ర‌జ‌ల చేతికి డ‌బ్బులు వెళ్లే సంక్షేమాన్ని గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వివిధ పేర్ల‌తో అందిస్తున్నారు. క‌ష్ట కాలం లో నేనున్నానంటూ.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సాయం చేస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. క్ష‌ణా ల్లో స్పం దించే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంగా దిశ యాప్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఇలా అనేక రూపాల్లో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సేవ అందిస్తున్నారు. తాజాగా నిర్దిష్ట వ్య‌వ‌ధిలో ప్ర‌భు త్వం తాలూకు ప‌నులు ప్ర‌జ‌ల‌కు అందించేలా కూడా చ‌ర్య‌లు చేప‌ట్టారు.


ఏ ప‌థ‌కానికి ఎంత స‌మ‌య‌మో.. కూడా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు. మ‌రి ఇంత చేసిన ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల ‌కు ఇంత ఇదిగా చేరువైన ప్ర‌భుత్వం.. రేటింగ్ కోసం ప్ర‌య‌త్నించ‌దా?  రేటింగ్ ఎంత ? అని సరి చూసు కోదా?  రేటింగ్ అంటూ.. ప్ర‌జ‌ల వెంట‌ప‌డ‌దా? అంటే.. ఎక్క‌డా జ‌గ‌న్ అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్న దాఖ ‌లా క‌నిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్నే తీసుకుంటే.. `ప్ర‌జ‌ల సంతృప్తి`- అంటూ.. ప్ర‌త్యేకంగా స‌ర్వేలు చేయించ‌డం, అయిన వారిని రంగంలోకి దింపి... అనుకూల మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి, అనుకూల క‌థ‌నాలు రాయించి.. ``మా ప్ర‌భుత్వానికి 80 శాతం ప్ర‌జ‌ల సంతృప్తి ఉంది.. మా ప్ర‌భుత్వానికి 90 శాతం సంతృప్తి వ‌చ్చింది``-అంటూ ఢంకా భ‌జాయించేవారు.


ఇక‌, అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేలు, ఎంపీల వ్య‌వ‌హార శైలిపై నిత్యం.. స‌ర్వేలు చేయిస్తూ.. వారిపై నిఘా ఉంచారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌రిగింది ఏంటి?  నిజంగానే ప్ర‌జా సంతృప్తి 90 శాతం ఉంటే.. ప్ర‌తిప‌క్షంలో ఎందుకు కూర్చోవాల్సివ‌చ్చింది? ఇక్క‌డే ఉంది అస‌లు లాజిక్కు! చంద్ర‌బాబు ప‌ట్ట‌ని జ‌నం నాడిని జ‌గ‌న్ ప‌ట్టేశారు!  ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో.. ఆయ‌న తెలుసుకున్నారు. స‌ర్వేలు చేయించి డ‌బ్బా కొట్టుకునే బ‌దులు.. ప్ర‌భుత్వంపై ప‌ర్వ‌వ‌సానం అనేది ప్ర‌జ‌ల‌కే వ‌దిలేయాలి. కేవ‌లం ప‌నిచేసుకుంటూ పోతే చాలు.. రేటింగ్ కోసం ఫైటింగ్ అవ‌స‌రం లేద‌ని భావించారు. అందుకే ఆయ‌న మీడియా కు అతి త‌క్కువ స‌మ‌యం కేటాయిస్తారు. ప‌నిచేసేందుకు ఎక్కువ స‌మ‌యం వెచ్చిస్తారు. ఇదీ డిఫ‌రెన్స్‌!!


అందుకే.. జ‌గ‌న్ విష‌యంలో రేటింగ్ కోసం గుంజాటన ఉండ‌దు. విమ‌ర్శ‌లు వ‌స్తే.. కుంగిపోవ‌డం క‌నిపిం చ‌దు.. అదేస‌మ‌యంలో త‌న సొంత ప‌త్రికే అయినా.. త‌న‌ను పొగిడినంత మాత్రాన ఆయ‌న పొంగిపోయిం ది కూడా లేదు. త‌న ప్ర‌భుత్వంపైనా.. త‌న పార్టీ నేత‌ల‌పైనా ఆయ‌న‌కు అపార‌మైన విశ్వాసం. తాము ప్ర‌జ‌ల కోణంలోనే ఆలోచిస్తున్నామ‌ని.. ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తున్నామ‌ని నిత్యం వారికోస‌మే ప‌థ‌కాలు ర‌చిస్తున్నామ‌ని జ‌గ‌న్ అనుకుంటారు. అందుకే. చంద్ర‌బాబును.. జ‌గ‌న్‌ను ప్ర‌జా కోణంలో చూడాల్సి వ‌స్తే.. ఇలానే చెప్పాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా.. జ‌గ‌న్ ఒక ప్ర‌జా కోణం.. స‌మ‌స్య‌ల‌పై ఎక్కుపెట్టిన బాణం!! 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: