``ఇది మ‌న పార్టీ. మ‌న అంద‌రి పార్టీ. ఇంత భారీ మెజార్టీ ప్ర‌జ‌లు మ‌న‌కు ఇచ్చారు అంటే.. వాళ్లు మ‌న‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌నం అధికారంలో ఉన్నా.. అధికారం అనుభ‌వించేందుకు లేం. సేవ చేసేం దుకు మాత్ర‌మే ఉన్నాం. మ‌నం పాల‌కుల‌మే అయినా.. సేవ‌కులుగానే ఉండాలి!!``- ఇదీ ఏడాది కింద గ‌త ఏడాది మే 30న ఏపీ సీఎంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం.. త‌న పార్టీ ఎంపీలు, ఎమ్మె ల్యేల‌కు  చేసిన హిత వాక్యాలు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు స్వేచ్ఛ‌నిచ్చారు. కొన్ని కీల‌క విష‌యాలు మాత్ర‌మే తాను చెబుతూ.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా ఉండాలి?  పార్టీలో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? అనే విష‌యాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

అంటే.. పార్టీ నేత‌ల‌ను జ‌గ‌న్ గాలికి వ‌దిలేశార‌ని కాదు. పార్టీ కోసం త‌న‌తోపాటు ఎంతో క‌ష్ట‌ప‌డిన నాయ‌కు లు ఉన్నారు. విద్యావంతులు ఉన్నారు.. వివేకం తెలిసిన వారే అంద‌రూ. అలాంటి వారిని ఆంక్ష‌ల పేరు తో గుంజ‌కు క‌ట్టేయ‌డం. తాడేప‌ల్లినుంచి వారిని ఆడించ‌డం స‌బ‌బు కాద‌ని, విజ్ఞ‌త కూడా అనిపించుకో ద‌ని, అంద రూ ఎంతో ముందుచూపుతో పార్టీకి, ప్ర‌భుత్వానికి పేరు తెచ్చేలాగే వ్య‌వ‌హ‌రిస్తార‌ని జ‌గ‌న్ భావిం చారు. లేక పోతే.. గ‌త చంద్ర‌బాబు నాయుడు ప్ర‌బుత్వం అనుస‌రించిన‌ట్టుగా వారానికి ఒక‌సారి వీడియో కాన్ఫ‌రెన్స్ పెట్టి పార్టీ నేత‌ల‌కు గిరులు గీయ‌డం.. ప్ర‌తి ఒక్క‌రిపైనా నిఘా పెట్ట‌డం, అధికారుల‌కే పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం, వారి నుంచి కూడా నివేదిక‌లు తెప్పించుకోవ‌డం వంటివి జ‌గ‌న్ కూడా చేసి ఉండేవారు.

కానీ, జ‌గ‌న్‌.. త‌న పార్టీ నేత‌ల‌పై అపార‌మైన విశ్వాసం పెంచుకున్నారు. క‌న్న‌త‌ల్లి వంటి పార్టీని అంద‌రూ సొంత‌బిడ్డ‌ల్లానే కాచుకుంటున్నార‌ని అనుకున్నారు. నిజంగానే జ‌గ‌న్ భావించిన‌ట్టు వంద‌లో 90 మంది నాయ‌కులు అలానే ఉన్నారు. పార్టీ విష‌యంలో అత్యంత విధేయ‌త‌, జ‌గ‌న్ విష‌యంలో అంతే ఆత్మీయ‌త చూపిస్తున్నారు. కానీ, మ‌రో ప‌ది శాతం మంది మాత్ర‌మే కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు!  పార్టీ ప‌రువు పోయేలా ప్ర‌వ ర్తిస్తున్నారు. ఒక‌వైపు జ‌గ‌న్ అవినీతి వ‌ద్ద‌ని చెవిని ఇల్లుక‌ట్టుకుని పోరాడుతున్నా.. వారు మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. మ‌రి ఏడాది కాలంగా చెప్పినా విన‌ని వారిని ఏం చేయాలి?  ఎలా దారికి తేవాలి?  ఇప్పుడు ఈ విష‌యంపైనే జ‌గ‌న్ దృష్టి పెట్టారు.

జగన్‌ కనుసన్నల్లో పార్టీ నడక సాగడం లేదా? ఆయన చెప్పుచేతల్లో వైసీపీ ముఖ్య నేతలు అడుగులు వే యడం లేదా?  అనే సందేహాలు ముసురుకున్న స‌మ‌యంలో జ‌గ‌న్  కొర‌డా ఝ‌ళిపించేందుకు రెడీ అ య్యారు. రోజుకు ప‌ది మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో భేటీ అయి.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డంతోపాటు.. పార్టీ విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. వారిపై వ‌స్తున్న ఫిర్యాదులు ఏమిటో కూడా చెప్పి.. గాడిలో పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ ప‌రిణామాలు.. వైసీపీలో క‌ట్టు త‌ప్పుతున్న నేత‌ల‌ను స‌రిచేయ‌డానికి ఎంత మేర‌కు దోహ‌ద ప‌డ‌తాయో చూడాలి. ఏదేమైనా.. మితిమీరిన స్వేచ్ఛ అయినా.. హ‌ద్దులు మీరిన నిఘా అయినా.. పార్టీల‌ను పాడుచేస్తాయ‌ని ఈ రెండు ప‌రిణామాలు ఒక‌టి టీడీపీలో జ‌రిగితే.. ఒకటి వైసీపీలో జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: