నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వ్యక్తి ఇతను. అలా అని ఈయన రాజకీయనాయకుడు కాదు.. ఒక అధికారి. మరి ఒక అధికారి పేరు ఇంత సంచలంగా ఎందుకు మారింది..? దానికి కారకులేవరు..? ఒకసారి ఈ విషయాలను పరిశీలిస్తే..

 

ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా నెపంతో నిలిపివేశారు అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. వాస్తవానికి అప్పుడు ఏపీలో ఉంది 10 లోపు కేసులే అనుకోండి. అయితే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఆయన్ని పదవిలో నుంచి తొలిగించింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు తీర్పు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అనుకూలంగానే వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు, కొన్ని మీడియా ఛానళ్ళు ఓ రాద్దాంతం చేశాయి. న్యాయమే గెలిచింది, ధర్మమే నిలబండిది అంటూ జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోసాయి.

 

అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం మీడియా ముందుకి వచ్చి తాను నిప్పు అని, న్యాయానికి నిలువెత్తు రూపమని అందుకే కోర్టు తీర్పు తనకి అనుకూలంగా వచ్చిందని ప్రగల్బాలు పలికారు. అప్పటినుంచి ఏపీ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం అనే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించింది. అదేంటంటే.. బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి, బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ లతో హైద‌రాబాద్ లోని పార్క్ హ‌యాత్ లో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స‌మావేశం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో ఇవాళ ఉదయం నుంచి చకర్లు కొడుతున్నాయి.

 

అయినా ఇప్పటి వరకు దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించలేదు. అలాగే ప్రతిపక్షాలు సైతం నోరు మెదపలేదు. కోర్టు తీర్పు తనకి అనుకూలంగా రాగానే ఓ రెచ్చిపోయిన నిమ్మగడ్డ, దీనిపై స్పందించకపోవడంతో చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు వీరి భేటీకి కారణం ఏంటి..? అనేది ఇంత వరకు తెలియరాలేదు. అలాగే ఆయన మౌనానికి కారణం ఏంటనేది కూడా తెలియరాలేదు. చూద్దాం దీనిపైన ఆయన ఎప్పుడు స్పందిస్తారో.. దీనికి ఎలాంటి కట్టు కథ అల్లుతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: