ఏపీ రాజ‌కీయాల్లో ఆశ్చ‌ర్య‌క‌ర పోక‌డ‌లు చోటు చేసుకున్నాయి. పాత మిత్రులు ఒక్క‌ట‌వుతున్న సంకేతాలు ఒక‌వైపు క‌నిపిస్తున్నా.. మ‌రోవైపు మాత్రం  కాదు కాదు.. మేం మారేదిలేదు.. మా సిద్ధాంతం మార్చుకునేది లేదు.. అనే సిగ్న‌ల్స్ వ‌స్తున్నాయి. కానీ, మొత్తంగా చూస్తే.. ఏదో జ‌రుగుతోంద‌నే వ్యాఖ్య‌లు మాత్రం వినిపిస్తు న్నాయి. వాస్త‌వానికి రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు కానీ, శాశ్వ‌త శ‌త్రువులు కానీ ఎవ‌రూ ఉండ‌రు. మొత్తంగా అవ‌స‌రం-అవ‌కాశం అనే ఏకైక వ్యూహమే త‌ప్ప‌.. మ‌రేమీ క‌నిపించ‌ని నేటి రాజ‌కీయాల్లో ఏది జ‌రిగినా.. ఆశ్చ ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌, తాజా విష‌యంలోకి వ‌స్తే.. త‌న చిర‌కాల మిత్రుడు బీజేపీతో గ‌త ఎన్నిక ‌ల‌కు ముందు క‌టీఫ్ చెప్పిన చంద్ర‌బాబు.. ఎప్పుడెప్పుడు మ‌ళ్లీ క‌మ‌లం గూటికి చేరదామా? అని ఎదురు చూస్తున్నారు.

అయితే, బీజేపీ నేత‌లు మాత్రం అస‌లు ఏపీలో ప‌రిస్థితిని చాలా నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే ప వ‌న్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ పెద్ద‌లు.. బాబు త‌మ‌తో పొత్తుకు రెడీ ఉన్నార‌న్న విష‌యం తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాబు కూడా మ‌ళ్లీ పొత్తుకు రెడీ అయిన‌ప్ప‌టికీ.. ఏదో అప్పుడ‌ప్పుడు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ప్ర‌స్తుతించ‌డంతోనే స‌రిపెడుతున్నారు. త‌లాఖ్ బిల్లును ఆమోదించిన‌ప్పుడు.. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌క‌టించిన ఆర్థిక ప్యాకేజీ విష‌యంలోనూ మోడీని చంద్ర‌బాబు బాహాటంగానే కొనియాడారు. కానీ, ఇదే త‌ర‌హా సిగ్న‌ళ్లు బీజేపీ నుంచి చంద్ర‌బాబుకు రావ‌డం లేదు. ఇటీవ‌ల దేశ భ‌ద్ర‌త ‌కు సంబంధించిన విష‌యం తెర‌మీద‌కు రాగానే.. అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌‌తోనూ మాట్లా డారు.

ఈ క్ర‌మంలోనే త‌న‌తోనూ చ‌ర్చిస్తార‌ని, త‌న పార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వాన్ని రంగ‌రించి దేశం కోసం స‌ల‌హా ఇ వ్వాల‌ని చంద్ర‌బాబు భావించినా.. ఎందుకో బెడిసి కొట్టింది. ప్ర‌ధాని మోడీ నుంచి ఆయ‌నకు ఫోన్ రాలేదు. స‌ల‌హా అడ‌గ‌లేదు. క‌ట్ చేస్తే.. ఇక‌, చంద్ర‌బాబుకు బీజేపీకి ఎప్ప‌టికీ కుదిరే అవ‌కాశం లేద‌ని అంద‌రూ అనుకున్నారు. తాజాగా మ‌ళ్లీ చంద్ర‌బాబు. ఆయ‌న ప‌రివారం ఒక్క‌సారిగా బీజేపీని భుజాలపై మోసే కార్య క్రమాన్ని ఎత్తుకున్నారు. `పార్క్ హ‌య‌త్ ర‌హ‌స్య భేటీ` విష‌యంలో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఆ పార్టీ మా జీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ల‌పై  వెల్లువెత్తిన నిర‌స‌న‌ల‌కు వారు బాధ‌ప‌డ్డారో లేదో తెలియ‌దు కానీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం మాత్రం తెగ ఫీలైపోయారు.

వాస్త‌వానికి పార్క్ హ‌య‌త్ ఘ‌ట‌న‌లో వైసీపీ నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.. బీజేపీ నాయ‌కులు.. సో.. వైసీ పీపై పోరు చేయాలంటే.. బీజేపీ నేత‌లు చేయాలి. కానీ, ఇక్క‌డ పూర్తిగా త‌మ‌కు సంబంధం లేకున్నా.. కూ డా బాబు ఆయ‌న ప‌రివారం వ‌కాల్తా పుచ్చుకుని, ``ఆ భేటీ రాజ్యాంగ విరుద్ధ‌మా?  ఎందుకు విమ‌ర్శిస్తు న్నారు? ఆయ‌న ఎంపీ.. ఆయ‌న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కాబ‌ట్టి మాట్లాడితే త‌ప్పేంటి?``- అంటూ.. త‌మ్ముళ్లు పెద్ద ఎత్తున మోసేశారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో ఎక్క‌డా బీజేపీ రాష్ట్ర నేత‌లు కానీ, కేంద్ర నేత‌లు కానీ వే లు పెట్ట‌లేదు. కేవ‌లం టీడీపీ మాత్రం మొత్తం మోసుకుంది. ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తే.. మ‌ళ్లీ చంద్ర‌బా బు నైస్‌గా  బీజేపీతో పొత్తుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే సంకేతాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ ప్ర‌యాస‌లో బాబు ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: