అవును ట్రవెల్స్ ముసుగులో అక్రమాలకు పాల్పడిన జేసిల కుటుంబం ఇపుడు రెండు విధాలుగాను చెడిపోయినట్లు అనిపిస్తోంది. జేసి ట్రావెల్స్ ను అడ్డం పెట్టుకుని రవాణాశాఖను జేసి సోదరులు చాలా రకాలుగా మోసం చేసిన విషయం సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. జేసి బ్రదర్స్ అంటే మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి. బస్సుల కొనుగోళ్ళు, లారీలను కొని వాటిని బస్సులుగా మార్చటం, ఫేక్ ఇన్స్యూరెన్స్, రూట్ పర్మిట్లను అతిక్రమించటం ఇలా చాలా అక్రమాలకు పాల్పడింది జేసి ట్రావెల్స్.

 

అధికారంలో ఉన్నంత కాలం ఏమి చేసినా చెల్లుబాటయిన జేసి బ్రదర్స్ అక్రమాలు ప్రతిపక్షంలోకి రాగానే ఒక్కసారిగా బయటపడ్డాయి. దాంతో జేసి ప్రభాకర్ రెడ్డితో పాటు కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అసలు విషయం ఏమిటంటే  వీళ్ళ అరెస్టు విషయంలో ఒక్కరు కూడా అయ్యోపాపం అని సానుభూతి చూపటం లేదు. వీళ్ళు అరెస్టు కాగానే చంద్రబాబునాయుడు, లోకేష్ కాస్త హడావుడి చేశారు. అమరావతి నుండి తాడిపత్రికి వెళ్ళి లోకేష్ జేసి కుటుంబాన్ని పరామర్శించాడు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి పెద్ద వార్నింగులే ఇచ్చాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీపరంగా నేతలెవ్వరూ జేసి కుటుంబానికి మద్దతుగా నిలవలేదు. అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వంలోను పార్టీలోను   కమ్మోళ్ళ పెత్తనం ఎక్కువైపోయిందని చాలా సార్లే దివాకర్ రెడ్డి అన్నాడు. కమ్మోళ్ళ పెత్తనాన్ని కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ ఎన్నిసార్లు బహిరంగంగా వ్యాఖ్యానించాడో లెక్కేలేదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరి, పయ్యావుల కేశవ్, హనుమంతరాయ చౌదరి, కందికుంట శివప్రసాద్ లాంటి వాళ్ళ పేర్లు చెప్పకపోయినా వాళ్ళతో 24 గంటలూ గొడవలే. అందుకనే కమ్మోళ్ళు, కమ్మోళ్ళు అంటూ నానా గోల చేసేవాడు. అందుకనే ప్రభాకర్ రెడ్డి అరెస్టయినా జిల్లాలోని ప్రముఖ కమ్మ నేతల్లో ఒక్కళ్ళు కూడా నోరిప్పలేదు.

 

సరే వీళ్ళ సంగతిని వదిలేస్తే మొత్తం రెడ్డి సామాజికవర్గానికి తాము మాత్రమే ఏకైక దిక్కుగా మాట్లాడేవాడు దివాకర్ రెడ్డి.  రెడ్లలో ఎక్కువమంది జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారనే కోపంతో రెడ్లను కూడా నోటికొచ్చినట్లు తిట్టిన విషయం అందరికీ తెలిసిందే.  అంటే ఏకకాలంలో ఇటు కమ్మోళ్ళంటూ కమ్మ సామాజికవర్గాన్ని, రెడ్డోళ్ళంటూ రెడ్డి సామాజికవర్గాన్ని నోటికొచ్చినట్లు తిట్టేవాడు.  దాంతో మొన్నటి ఎన్నికల సమయంలోనే జిల్లాలోని చాలామంది రెడ్డి నేతలు జేసి బ్రదర్స్ ను దూరంగా పెట్టారు.

 

దాని ప్రభావం ఇపుడు ప్రభాకర్ రెడ్డి అరెస్టు నేపధ్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కమ్మ, అటు రెడ్డి సామాజికవర్గాల్లోని నేతలెవరు కూడా ప్రభాకర్ రెడ్డి అరెస్టును ఖండిస్తు ఒక్కమాటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇందుకు రెండు కారణాలను చెప్పవచ్చు. మొదటిదేమో అక్రమాలు  చేసి సాక్ష్యాలతో సహా అరెస్టవ్వడం. ఇక రెండో కారణం ఏమో నోటి దురుసుతో అందరితోను గొడవలు పడటం, నోటికెంతొస్తే అంతా మాట్లాడటం.  మొత్తం ఎపిసోడ్ ను చూసిన తర్వాత తమ నోరే తమకు శతృవైపోయిన విషయాన్ని ఇప్పటికైనా జేసి బ్రదర్స్ గుర్తిస్తారా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: