భార‌త్‌కు పొరుగు ఉన్న శ్రీలంక‌, నేపాల్‌, బంగ్లాదేశ్, మ‌య‌న్మార్,పాకిస్థాన్ దేశాల‌పై చైనా వ‌ల్ల‌మాలిన ప్రేమ‌ను కురిపిస్తోంది. అడ‌క్కున్నా వ‌రాలు కురిపించేస్తోంది. అది కూడా విరాళాల రూపంలో..డ‌బ్బులు ఎవ‌రికి చేదు చెప్పండి. ఆ దేశాలు కూడా ఇస్తానంటే మేము వ‌ద్దంట‌మా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. వెంటిలేట‌ర్లు కూడా కొనుక్కులేని దీన‌స్థితిలో ఉన్న పాకిస్థాన్‌కు అయితే చైనా క‌ల్ప‌త‌రువుగా మారింది. చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్ముకున్న చందంగా..భార‌త్‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతూ పాకిస్థాన్ డ్రాగ‌న్ ముందు ప్రేమ‌ను ఒల‌క బూస్తోంది. అందుకే పాకిస్థాన్ అడ‌గ‌గానే ఏకంగా తాత్క‌లిక ఆస్ప‌త్రి నిర్మించి ఇచ్చింది చైనా. 

 

శ్రీలంక అడంక‌ముందే వేలాది కోట్ల రూపాయ‌ల‌తో పోర్టు నిర్మాణాల‌కు కొంత విరాళం..కొంత సాయం రూపంలో ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా బంగ్లాదేశ్‌, నేపాల్ దేశాల‌ను బుట్ట‌లో వేసుకునేందుకు పెద్ద ఎత్తున విరాళాల‌ను ప్ర‌క‌టించేసింది.  ఇవ‌న్నీ కూడా చైనా ఆ దేశాల‌పై ప్రేమ కంటే భార‌త్‌పై క‌క్ష‌, ప‌గ‌, ద్వేషం, ఆధిప‌త్యం ఇలా ఎన్నో కోణాల్లో ఆలోచించుకుని ఆదేశాల‌కు ద‌గ్గ‌ర‌వుతుండ‌టం విశేషం. చైనా ఉద్దేశం ఏమైన‌ప్ప‌టికీ చాలా క‌ష్టాల్లో బీద దేశాలుగా వ‌ర్ధిలుతున్న భార‌త్ చుట్టూ ఉన్న దేశాల‌కు ఎంతో ఉప‌యుక్త‌క‌రంగా మార‌నుంది. చైనా ఇచ్చినంత మాత్ర‌నా ఆ దేశం తీసుకునే నిర్ణ‌యాల‌కు క‌ట్టుబ‌డి ఆదేశాలు ఉంటాయ‌న్న న‌మ్మ‌క‌మైతే లేదు. 

 

ఉంటే దాయాది పాకిస్థాన్ త‌ప్ప మిగ‌తా మూడు దేశాలు కూడా చైనా యుక్తులు తెలుసుకుని ప‌క్క‌కు జ‌రుగుతాయ‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ భార‌త్‌కు చిర‌కాల మిత్ర‌దేశం. శ్రీలంక‌తో కూడా భార‌త్‌కు మెరుగ్గానే స‌త్సంబంధాలున్నాయి. తాత్క‌లిక పొడ‌చూపులు త‌ప్పా..అక్క‌డి వాణిజ్య‌, తేయాకు, సుంగంధ ద్ర‌వ్యాల‌కు భార‌త్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక ప‌ర్యాట‌క‌ప‌రంగా కూడా భార‌త్ నుంచే ఎక్కువ జ‌నం వెళ్తుంటారు. ఎటు చూసిన శ్రీలంక‌కు భార‌త్ అవ‌స‌రం ఉంది. నేపాల్‌తో స‌రిహ‌ద్దు రేఖ వ‌ద్ద ఏర్ప‌డిన స‌మ‌స్య చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారించుకుంటే య‌థావిధి స్థాయికి చేరుకుంటుంది. కానీ చిన్న స‌మ‌స్య‌ల‌ను భూత‌ద్దంలో చూపెడుతూ..అంత‌ర్జాతీయ స‌మాజంలో భార‌త్‌ను వీక్ చేయాల‌ని చైనా య‌త్నిస్తోంది. అవ‌న్నీ కూడా ఎక్కువ‌కాలం నిల‌వ‌వ‌న్న విష‌యం తెలుసుకుంటే చైనాకు మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: