టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కొత్త భయం పట్టుకుందా..? ఆ సంఖ్య వినగానే వెన్నులో వణుకు మొదలవుతుందా..? అసలు ఆ సంఖ్యకి బాబుకి ఉన్న లింక్ ఏంటి..? అసలు ఆ సంఖ్య ఏంటి..? పూర్తి వివరాలు మీకోసం..

 

2014 లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఆ పార్టీలోకి ఆకర్షించిన సంగతి తెలిసిందే. దీనికి వేరువేరు కారణాలు ఉన్నాయి. కొంత మందిని భయపెట్టి, మరికొంత మందిని బెదిరించి మొత్తం మీద ఏదోలా చేసి వారిని తమ పార్టీలోకి తీసుకున్నారు టీడీపీ అధినేతలు. దీనికి ఫలితంగా మొన్నటి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి అదే 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలుపొందారు. పైగా ఆ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చింది మే 23వ తేదీన కావడం మరింత యాధృచ్ఛికం. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా పలుమార్లు ప్రస్తావించారు. అలాగే వైసీపీ ముఖ్య నేతలు సైతం ఎన్నో సార్లు దీన్ని ప్రస్తావించారు.

 

దీంతో ఒకానొక సమయంలో చంద్రబాబుకి 23 గండం ఉందని రాష్ట్రంలో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత అదే 23 న కొన్ని కొన్ని పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఎవరూ.. అయితే ఇప్పుడు తాజాగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశం కావడం.. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆన్ లైన్ లో పాల్గొన్నారనే ఆరోపణలు రావడం.. దానిపై టీడీపీ విరుచుకుపడటం తెలిసిందే. ఈ సమావేశం ఈనెల 13న జరిగానా.. బయటకు వచ్చింది మాత్రం 23న. దీంతో నిజంగానే 23 టీడీపీకి కలిసి రాదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు 23 కు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చంద్రబాబు కొడుకు, మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు కూడా 23 నాడే.

మరింత సమాచారం తెలుసుకోండి: