గత కొన్ని రోజులుగా పార్టీకి.. పార్టీ నిర్ణయాలకు.. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అలాగే తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి అని గడువు విధించింది. వివరణ రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

 

మరి రాజు గారు ఏం చేస్తారు…? ఇప్పుడు ఆ పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇదే. ఆయన వైసీపీతో పూర్తిగా తెగ తెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆయన ఇలాంటి సందర్భం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని టాక్. వైసీపీ నుంచి బయటకి వచ్చి బీజేపీతో కలిసేందుకు ఆయన రెడీగా ఉన్నారని వినికిడి. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే బీజేపీ పెద్దలతో తాజా పరిస్థితుల గురించి చర్చించారట. వారు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో కేంద్ర పెద్దలని కలిసేందుకు ఈ నెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు రఘురామకృష్ణంరాజు. అయితే అంతకముందు ఆయనకి ఇక్కడ ఒక చిన్న పని పడ్డట్టు సమాచారం ఉంది. అదేంటంటే..

 

తనకు సన్నిహితంగా ఉండే, తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను తనతో పాటు బీజేపీలోకి తీసుకెళ్లేందుకు రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దానికి అనుగుణంగా కొంతమందితో చర్చలు కూడా జరిపారట. ఆయనతో పాటు బీజేపీలో చేరే వారి లిస్ట్ ఒకటి తయారుచేసి.. 28 న ఢిల్లీ వెళ్ళి, కేంద్ర పెద్దల సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకొని, ఆ లిస్ట్ వారికి ఇవ్వబోతున్నారట రఘురామకృష్ణంరాజు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఏపీకి పిలిపించి ఆయన ఆధ్వర్యంలో మిగిలిన వారిని బీజేపీలోకి చేర్చేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తద్వారా ఆయన ఎప్పటినుంచో వేచి చూస్తున్న కీలక పదవిని పొందాలని భావిస్తున్నారట. మరి ఆయనతో పాటు బీజేపీ లో చేరే నాయకులేవరు..? ఆయనకు దక్కబోతున్న కీలక పదవి ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: