రాజ‌కీయాల్లో ఉన్న వారు ఎవ‌రిని న‌మ్మాలి? ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దు? అంటే.. స‌హ‌జంగా వ‌చ్చే స‌మాధానం న‌మ్మాల్సింది.. ప్ర‌జ‌ల‌ని, ఫాలో కావాల్సింది.. తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ పార్టీని! కానీ, ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో కొంద‌రు నేత‌లు.. అదికూడా అధికార పార్టీ వైసీపీకి చెందిన కొంద‌రు అత్యుత్సాహం ప్ర‌ద ర్శించే నాయ‌కులు.. ఓ వ‌ర్గం మీడియాను న‌మ్ముతున్నారు. ఆ మీడియా వ‌ల‌కు చిక్కుకుంటున్నారు. దీం తో స‌ద‌రు మీడియా వారిని త‌న‌ ట్రాప్‌లోకి తెచ్చుకుని.. ఎంత `రాజ‌కీయం` చేయాలో అంతా చేసేసి.. చివ రాఖ‌రికి వారిని రోడ్డున ప‌డేసి.. పైశాచిక ఆనందం పొందుతోంది. అయితే, ఈ విష‌యాన్ని స‌ద‌రు  నేత‌లు  గ్ర‌హించ‌లేక‌.. ఆ మీడియా విసిరిన‌ ట్రాప్‌కు చిక్కుకుని.. ఎంత‌గా రెచ్చిపోవాలో.. అంత‌కు మించి అనే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. 


త‌ల్లిలాంటి పార్టీపై విరుచుకుప‌డుతున్నారు. త‌మ‌కు టికెట్ ఇచ్చి.. ప్రోత్స‌హించి.. ప్ర‌చారం చేసిన అధినేత‌నే తూల‌నాడుతున్నారు. మొత్తంగా పార్టీకే సున్నం రాస్తున్నారు. దీంతో స‌ద‌రు మీడియా.. క‌జ్జాలు భ‌లేగా పెట్టానులే అని చంక‌లు గుద్దుకుని పండ‌గ చేసుకుంటే.. ఈ నేత‌లు మాత్రం దిక్కు దివాణం లేకుండా పోయే ప‌రిస్థితికి చేరుకుంటున్నా రు.  ఒక్క నేత‌లే కాదండోయ్‌.. ఈ మీడియా ట్రాప్‌లో చిక్కు కుంటున్న వారి జాబితాలో కీల‌క అధికారులు కూడా ఉన్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే చ‌ర్చ న‌డుస్తోంది. ఏపీలో మీడియా రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన విష ‌యం తెలిసిందే. అధికార పార్టీకి ఎలాగూ.. సొంత మీడియా ఉంది. ఇక‌, ప్ర‌తిప‌క్షం టీడీపీకి నేరుగా మీడి యా కానీ, ప‌త్రిక కానీ లేక‌పోయినా.. ఈ పార్టీని స‌పోర్టు చేసే మీడియా అధిప‌తులు ఉన్నారు. 


వీరిలోనూ మ‌రీ క‌ర‌డుగట్టిన `ఎల్లోయిజం` నిండిన అధినేత ఒక‌రు ఉన్నారు. త‌న‌కు ద‌మ్ముంద‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే ఆయ‌న అధికార పార్టీ వైసీపీ టార్గెట్‌గా  వండి వార్చ‌ని విషపు రాత‌లు లేవ‌ని అంటారు ఈ రంగంలోని వారే! ఈ మీడియా అధినేత‌కు వ్య‌క్తుల‌తో ప‌నిలేదు. కేవ‌లం వైసీపీని తిట్టిపోసివారు.. ఆ పార్టీని బ‌జారున ప‌డేసే వారు.. వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించేవారంటే.. `పుల‌స చేప` పులుసంత పండ‌గ‌! ఈ చేప ఏటికి ఎదురీదిన‌ట్టే.. ఈయ‌న కూడా ప్ర‌జా ప్ర‌యోజ‌నం క‌న్నా.. త‌న వ్యాపార సామ్రాజ్యానికి ఇతోధికం గా సాయం చేసిన టీడీపీ ప్ర‌యోజ‌నాల కోసం ఎంతైనా ఎదురీదుతారని అంటారు.


దీంతో.. నేత ఎవ‌రు?  ఆయ‌న స్థాయి ఏంటి? అనే దాంతో ప‌నిలేదు.. జ‌గ‌న్‌ను తిట్టిపోస్తే.. చాలు.. ప్ర‌భు త్వంపై దుమ్మెత్తిపోస్తే.. చాలు.. ఆ నాయ‌కులను ఫ‌స్ట్ పేజీల్లో అచ్చేస్తారు! దీంతో ఆ నాయ‌కులు త‌మ‌కేదో ఫాలోయింగ్ వ‌చ్చేసింద‌ని అనుకుంటారు. మ‌రింత రెచ్చిపోతారు. ఇక‌, వీరే.. ఏదైనా సంద‌ర్భంలో చంద్ర ‌బాబు త‌ప్పును ఎత్తిచూపారో.. అంతే సంగ‌తులు! వారి మొహం కూడా మీడియా చూపించ‌దు! ఇదో భాగ‌మై తే.. ఈ మీడియా కొన్ని సార్లు.. కొంద‌రు నేత‌ల‌కు ఏదో అన్యాయం జ‌రిగిపోతున్న‌ట్టు క‌న్నీళ్లు పెట్టుకుం టుంది. వారి ప‌క్షాన `అయ్యో.. పాపం..` అంటూ జాలి వార్త‌లు రాస్తుంది. దీంతో ఆ నేతలు నిజ‌మే క‌దా అనుకుంటారు. ఈ మీడియా ట్రాప్‌లో చిక్కుకుంటారు. 


త‌ర్వాత‌.. పైన చెప్పుకొన్న‌ట్టే.. వారిని ఎంత రెచ్చ‌గొట్టాలో అంతా రెచ్చిగొట్టేసి పులుసు పిండేసి.. ఠ‌క్కున వ‌దిలేస్తుంది. దీంతో వారి ప‌రిస్థితి రోడ్డుపాలే! దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు.. ఆయ‌న‌ను రెచ్చ‌గొట్టిన ఈ ద‌మ్మున్న అధినేత మీడియా.. ఆయ‌నతో ఎన్ని విమ‌ర్శ‌లు చేయించాలో .. ఎన్ని మాట‌లు అనిపించాలో అన్నీ చేసేసింది. దీంతో వైసీపీకి - ర‌ఘుకు మ‌ధ్య అంత‌రం పెరిగి పెరిగి తెగ‌తెంపులు చేసుకునే వ‌ర‌కు వ‌చ్చింది. అదేవిధంగా.. కొన్నాళ్ల కింద‌ట‌ నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డిని కూడా ట్రాప్‌లోకి లాగాల‌ని ప్ర‌య‌త్నించిన ఈ మీడియా విఫ‌ల‌మైంది. ఆయ‌నేదో.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమర్శ‌లు గుప్పించారంటూ.. కొన్నిరోజులు వార్త‌లు ప్ర‌చారం చేసి.. ఫ‌స్ట్‌పేజీకి ఇచ్చింది. 


అయితే, ఆయ‌న రాజ‌కీయాల్లో కొంత అనుభ‌వం గ‌డించారు కాబ‌ట్టి.. ఆయ‌న ఈ మీడియాకు చిక్కుకోలేదు.  ఇక‌, ఈ మీడియా ట్రాప్‌లో చిక్కుకున్న స‌బ్బం హ‌రి.. గ‌తంలో వైసీపీలోకి రావాల్సిఉన్నా.. పోయి పోయి.. టీడీపీ సైకిల్ ఎక్కారు. ఈయ‌న ఇంకా.. ఈ ట్రాప్‌లోంచి బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా చాలా మంది నాయ‌కులు ఈ మీడియా దెబ్బ‌కు అడ్ర‌స్ లేకుండా పోయారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి వంటి మ‌హిళా మ‌ణులు కూడా ఉన్నారు. ఇప్పుడు.. ఎంపీ ర‌ఘు స‌హా.. కొంద‌రు నేత‌లు ఈ మీడియా ట్రాప్‌కు చిక్కుకుని తెగేదాకా తెచ్చుకుంటున్నారు. అదేసమ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ విష‌యం కూడా ఇంతే! ప్ర‌భుత్వానికి, నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌ధ్య అంత‌రం పెంచేలా .. స‌ద‌రు ద‌మ్మున్న అధినేత‌.. ఎంత వ‌ర‌కు పాటు ప‌డాలో అంతా పాటుప‌డ్డాడు. త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ‌ను వ‌దిలేశారు. ఈ మీడియాకు చిక్కుకుని బాగుప‌డిన నాయ‌కులు అంటూ లేర‌ని అంటారు ప‌రిశీల‌కులు. కొంద‌రు రాజ‌కీయ నేత‌లు కూడా `ఔను.. ఇది నిజ‌మే.. వాడుకుని వ‌దిలేసే టైపు!`-అంటున్నారు. సో.. ఇదీ స్టోరీ!!

మరింత సమాచారం తెలుసుకోండి: