ఒక‌ప్పుడు మైనార్టీలు.. ఇప్పుడు కాపులు! రాజ‌కీయాల‌కు ఏ సామాజిక వ‌ర్గ‌మూ అతీతం కాద‌నుకునేలా ఇప్పు డు కాపు సామాజిక వ‌ర్గం సెంట్రిక్‌గా పొలిటిక‌ల్ ఎజెండా రంగులు మారుతున్నాయి. ``మేం.. అధికా రంలో ఉండ‌గా.. కాపుల‌కు అన్ని కోట్లు ఇచ్చాం.. ఏటా ఇన్ని కోట్లు ధారాద‌త్తం చేశాం. మీరు ఇప్పుడు క‌నీ సం ఎంగిలి మెతుకులు కూడా వేయ‌డం లేదు. అన్నివ‌ర్గాల‌కు క‌లిపిన ఇచ్చిన సంక్షేమాన్ని పెద్ద‌ది చేసి చెబుతూ.. కాపుల కంట్లో కారం కొడుతున్నారు!`` అంటూ ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున దీర్ఘాలు తీసింది. దీనికి ఆ పార్టీని గుడ్డిగా సపోర్టు చేసే ఓ మీడియా కారాలు మిరియాలు నూరుతూ పేజీల‌కు పేజీలు క‌థ‌నాలు వండివ‌డ్డించింది. వెన‌క‌టికి ``చెప్పేవాడు చిరంజివి`` అయ్యాడ‌న్న సామెత‌ను గుర్తు చేస్తూ...!


ఇక‌, టీడీపీ చేసిన విమ‌ర్శ‌ల‌పై అధికార పార్టీ వైసీపీ త‌న వాద‌న త‌ను చేసింది. ``అస‌లు కారం కొట్టింది మీ రే! వారిని నాలుగేళ్ల‌పాటు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్ ఇస్తామ‌ని మ‌భ్య‌పెట్టి ఓట్లు గుంజుకోవాల‌ని చూసింది మీరు కాదా?  కాపుల్లోనూ మీవారిని ఏరికోరి ప‌ద‌వుల పందేరం చేయ‌లేదా? అయినా.. మేం ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఏం చెప్పామో.. అదేచేస్తున్నాం. కావాలంటే.. మేనిఫెస్టో చ‌దువుకోండి!!`` అంటూ ఎదురు దాడి చేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కాపుల‌కు ఎవ‌రు ఏం చేస్తున్నారో తెల‌య‌ద‌ని అనుకొనే ప‌రిస్థితి నేడు లేదు. ఏ పార్ట ఏం చేసిందో.. ఏం చేస్తోందో.. వారికి అంతా తెలుసు. టీడీపీ అధికారంలో ఉండ‌గా.. కాపు కార్పొరేష‌న్ ‌ను ఏర్పాటు చేశారు. ఏటా వెయ్యి కోట్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో నాలుగేళ్ల‌లో మూడు సంవ‌త్స‌రావుల స‌క్ర‌మంగా ఇచ్చి.. మిగిలిన సంక్షేమ ప‌థ‌కాల‌కువారిని దూరం చేశారు. 


పైగా, టీడీపీ హ‌యాంలో కాపుల‌కు బీసీల రిజ‌ర్వేష‌న్‌పై 5శాతం రిజ‌ర్వేష‌న్ ఇస్తున్నామ‌ని(ఇది సుప్రీం కోర్టు తీర్పు మేర‌కు సాధ్యం కాద‌ని తెలిసి కూడా) అసెంబ్లీలో ఓ బిల్లు పాస్ చేసి పార్ల‌మెంటుకు పంపించి.. చేతులు దులుపుకొన్నారు. ఇక‌, కాపుల కోసం ఉద్య‌మించిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై సంఘ‌విద్రోహ వ్య‌క్తి గా ముద్ర‌వేసి.. ఆయ‌న‌ను, ఆయ‌న కుటుంబాన్ని ఎన్ని తిప్ప‌లు పెట్టారో అంద‌రికీ తెలిసిందే. తుని ఘ‌ట‌న దీనిలో భాగమే అంటారు. మ‌రి టీడీపీ ఇప్పుడు చెబుతున్న‌ట్టు కాపుల‌కు ఇంత‌గా మేలు చేసి ఉంటే.. అదేకాపు సామాజిక వ‌ర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావ‌రిలో కేవ‌లం మూడు స్థానాల‌తోనే గెలుపును స‌రిపెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందో  టీడీపీ అంత‌ర్మ‌థ‌నం చేసుకుంటే స‌రిపోతుంది. 


అదేస‌మ‌యంలో వైసీపీ విష‌యానికి వ‌ద్దాం. ఇప్ప‌టి వ‌ర‌కు కాపు కార్పొరేష‌న్‌కు రూ.2 వేల కోట్లు ప్ర‌తి బ‌డ్జెట్‌లోనూ కేటాయించారు. వీటితోపాటుగా ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కంలోనూ వారిని ప్ర‌త్యేక అర్హులుగా పేర్కొన్నారు. ఈ 13 నెలల కాలంలో పలు పథకాల కింద 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు.  కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌కు  అమ్మ ఒడిని అమ‌లు చేశారు. వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర, చేదోడు, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, చేయూత, కాపు నేస్తం వంటి అనేక పథకాల ద్వారా దాదాపు 23 లక్షల మందికి రూ.4,770 కోట్లు లబ్ధి చేకూర్చారు. అంతేకాదు, ఇప్పుడు బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి రూ.15 వేల చొ ప్పున సహాయం చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. 


ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించబోతున్నారు. ఇలా .. మొత్తంగా కాపుల‌కు అన్ని రూపాలు, అన్ని కోణాల్లోనూ వైసీపీ ప్ర‌భుత్వం ఆప‌న్న హ‌స్తం అందిస్తోంది. అంతేకాదు, రాజ్యాంగ నిబంధ‌న‌ల మేర‌కు(రిజ‌ర్వేష‌న్లు 50 శాతం మించ‌రాదు) కాపుల‌కు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్ సాధ్యం కాద‌నే విష‌యాన్ని గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు అదే కాపుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోనే త‌న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పారు. కాపుల విష‌యంలో ఎక్క‌డా వారిని మోసం చేసింది కానీ, మాయ చేసింది కానీ జ‌గ‌న్ పొలిటిక‌ల్ హిస్ట‌రీలోనే లేదు. సో.. దీనిని బ‌ట్టి ఎవ‌రు కాపుల కంట్లో కారం కొట్టారో.. వారిని రాజ‌కీయంగా వాడుకునేందుకు రిజ‌ర్వేష‌న్ అనే గంత‌లు ఎవ‌రు క‌ట్టారో.. అర్ధం కావ‌డం లేదా?!  అర్ధం అయిన వారికి(కాపులు) అర్ధ‌మైంది.. అందుకే జ‌గ‌న్‌కు అత్య‌ధిక మెజారిటీ ఇచ్చారు. ఇంకా ఈ విష‌యం తెలుసుకోక‌పోతే.. ఏం చేస్తాం.. వారి ఖ‌ర్మ వారిద‌ని స‌రిపెట్టుకోవాల్సిందే!!

మరింత సమాచారం తెలుసుకోండి: