ఎంద‌రు ఔన‌న్నా.. మ‌రెంద‌రు కాద‌న్నా.. రాజ‌కీయాల్లో ఉండేవారికి `సింప‌తీ` అత్యంత ప‌దునైన రాజ‌కీయ అస్త్రం! ఇటు ప్ర‌జ‌ల్లోనూ.. అటు పార్టీలోనూ ఇది లేక‌పోతే.. ప‌ని జ‌ర‌గ‌దు!  పాలిటిక్స్‌లో ఎంత ప‌నిమంతు డు ... అనే క‌న్నా కూడా.. అధినేత‌కు ఎంత విధేయుడు అనే మాటే తెర‌మీదికి వ‌స్తుంది. విధేయ‌త‌కు మా త్ర‌మే వీర‌తాళ్లు పడుతున్న రాజ‌కీయ కాలం న‌డుస్తోంది. మ‌రి ఈ స‌మ‌యంలో అటు సింప‌తీ పోయి.. ఇ టు విధే య‌తా జారిపోతే.. స‌ద‌రు నాయ‌కుడి ప‌రిస్థితి ఏంటి?  ఈ రెండు కోల్పోయిన ఎంద‌రో నాయ‌కులు ఇదే ఏపీలో రాజ‌కీయాల‌కు దూర‌మై.. చ‌రిత్ర‌లో క‌లిసిపోయిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. పేర్లు అవ ‌స‌రం లేక‌పో యినా.. ఉత్త‌రాంధ్ర‌జిల్లాల్లో ఉద్య‌మాల‌కు తెర‌దీసిన నాయ‌కులు.. మాక‌న్నా తోపులు ఎవ‌రు? అని ప్ర‌శ్నించి న నేత‌లు.. ఏమ‌య్యారో.. మ‌న క‌ళ్ల‌ముందు క‌నిపిస్తూనే ఉంది! 


ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. వైసీపీ త‌ర‌ఫున న‌ర‌సాపురం నుంచి ఎంపీగా గెలిచిన క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజు గారి ప‌రిస్థితిని చూసి!! ఆయ‌న‌ను వెనుక ఉండి ఎవ‌రు న‌డిపిస్తున్నారో.. లేదా.. ఆయ‌నే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారో తెలియ‌దు కానీ.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లోనూ.. ఇత‌ర పార్టీ నేత‌ల్లోనూ ఉన్న సున్నిత‌మైన సింప‌తీ అనే లైన్ తెగిపోతోంది!! ఇది నిజం అం టున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌నే స్వ‌యంగా సొంత పార్టీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. ప‌రోక్షం గా జ‌గ‌న్‌ను కూడా విమ‌ర్శించేస్తున్నారు. ఓ వ‌ర్గం మీడియా ఆయ‌న‌ను మోసేస్తుంటే.. త‌న బ‌రువు త‌న‌కే తెలియ‌డం లేద‌న్న‌ట్టుగా ఆయ‌న గెంతులు పెట్టేస్తున్నారు.  ఈ క్ర‌మంలో ఆయ‌న తీసుకుంటున్న గోతు ల‌ను ఆయ‌న మ‌రిచిపోతున్న‌ట్టుగా ఉన్నార‌నే వ్యాఖ్య‌లు అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లోనూ వినిపిస్తున్నాయి. 


రాజ‌కీయాల్లో ఉన్న‌వారిలో ఆవేద‌న చెంద‌ని వారు ఎవ‌రు? ఆక్రోశం లేనిదెవ‌రికి?  పార్టీ ఏదైనా.. త‌మ‌కు ప‌ద ‌వులు ద‌క్క‌లేద‌నో.. తాము అనుకున్న విధంగా అధినేత త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌నో.. నాయ‌కులు బాధ‌ప‌డ‌డం, ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం ఇప్పుడు కొత్త‌గా ఏమీ తెర‌మీదికి రాలేదు. పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి సేవ‌లు చేస్తున్నాం.. కుటుంబాల‌కు కుటుంబాల‌కే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం.. వ‌రుస పెట్టి విజ‌యా లు సాధిస్తూనే ఉన్నాం.. క‌ష్టాలు, న‌ష్టాల్లో పార్టీ జెండా మోశాం.. అయినా మ‌మ్మ‌ల్ని  ప‌ట్టించుకోవ‌డం లేద ‌ని.. కేవ‌లం రెండున్న‌రేళ్ల కింద‌ట టీడీపీలో ఎంత మంది నాయ‌కులు క‌న్నీటి ప‌ర్యంతం కాలేదు?   అధినేత అప్పాయింట్‌మెంట్ కోసం... త‌లుపుల ముందు ప‌డిగాపులు కాయ‌లేదు?? అంత‌మాత్రాన వారు రోడ్డెక్కారా?  పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ‌జారులో నిల‌బెట్టారా?  లేదే! 


మ‌రి అలాంటి ప‌రిస్థితి ఏమీ జ‌ర‌గ‌న‌ప్పుడు.. అలాంటి వాతావ‌ర‌ణం ఏమీ లేన‌ప్పుడు.. వైసీపీ ప‌రువును, నేత‌ల మ‌ర్యాద‌ల‌ను రోడ్డుమీద‌కు లాగాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది రాజు గారూ? అధినేత జ‌గ‌న్ అప్పా యింట్ కోసం.. మీలాగే.. అనేక మంది ఎంపీలు ఎదురు చూస్తున్నారు. అయినా వారికి లేని బాధ‌, ఆవేద‌న మీలోనే ఎందుకు క‌ట్ట‌లు తెంచుకుందో మీకే తెలియాలి. అయినా కూడా ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని.. అర్ధం చేసుకున్నారు. పార్టీ కూడా చాలా రోజులు మీరే మార‌తారులే! అని ఎదురు చూసింది. అయినా మీరు మార‌క‌పోగా.. మ‌ళ్లీ మ‌ళ్లీ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని విమ‌ర్శ‌లు చేసినా.. పార్టీ వైపు నుంచి స్పంద‌న రాక‌పోతే.. అది పార్టీ ఎలా అవుతుంది? అందుకే మీకు షోకాజ్ నోటీసు వ‌చ్చింది. దీనికి మీరు ఏదైనా సౌమ్యమైన వివ‌ర‌ణ ఇచ్చి ఉంటే.. ప‌రిస్థితి మీకు పాజిటివ్‌గా ఉండేది. 


కానీ, మీరు మ‌ళ్లీ రెచ్చిపోయి.. మీకు టికెట్ ఇచ్చిన‌.. మీరు ఎంపీగా ఎన్నిక‌య్యేందుకు వేదిక క‌ల్పించిన పార్టీ పుట్టు పూర్వోత్త‌రాల‌నే మీరు ప్ర‌శ్నించేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది? వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారు? రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధా న కార్యదర్శి ఎలా ఉంటారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘాని కి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపండి’’ -అంటూ మీరు రెచ్చిపోయారు. దీంతో ఇంత వ‌ర‌కు జ‌రిగిన ఎపిసోడ్‌లో మీపై సంచులు సంచులుగా సింప‌తీ కురిపించిన వారే.. ``అమ్మో.. సారు త‌క్కువేమీకారు!!`` అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. 


అంతేకాదు, ఇత‌ర పార్టీల అధినేత‌లు, సీనియ‌ర్ నాయ‌కులు కూడా `రాజుగారు చాలా దూరం వెళ్తున్నారు .. ఇలా అయితే.. ఆయ‌న ఏ పార్టీలోనూ ఇమ‌డ‌లేరు` అని తెర‌చాటుగా చెవులు కొరుక్కొంటున్నారు. ఫ‌లి తంగా మీరు సాధించిందేంటంటే.. `రెబ‌ల్‌` అనే ముద్ర మాత్ర‌మే!  ఇంత‌లా పాయింట్లు లాగే నాయ‌కు ల‌ను ఏ పార్టీ మాత్రం భ‌రించ‌గ‌ల‌దు రాజుగారూ.. అస‌లు ఎప్పుడో ఒక‌సారో.. రెండు సార్లో మాట్లాడే వారినే భ‌రించ‌లేని పార్టీలున్న ఈ రోజుల్లో.. ఇలా లా పాయింట్లు తీసి.. పార్టీ పుట్టుక‌ల‌నే ప్ర‌శ్నించే మీలాంటి వారికి ఏ పార్టీలోనూ చోటుండ‌ద‌నే అంటున్నారు త‌ల‌పండిన రాజ‌కీయ యోధులు!  సో.. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక‌.. మీరు ఒక‌వేళ వైసీపీని కాల‌ద‌న్నుకున్నా.. రాజుగారిని `భ‌రించే` పార్టీ క‌నుచూపు మేర‌ల్లో క‌నిపించ‌డం లేద‌ని కూడా వారు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. మ‌రి మీ పొలిటిక‌ల్ లైఫ్‌ను మీరేం చేసుకుంటారో.. మీ చేతుల్లోను, మీ చేత‌ల్లోనే ఉంది!! 

మరింత సమాచారం తెలుసుకోండి: