' మీడియా స్వేచ్ఛ ' అనే పదం అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. మీడియా పై దాడి అని, ఇలా చాలా పెద్ద పెద్ద పదాలే చాలా పెద్దగా రీసౌండ్ చేస్తుంటాయి. ఫోర్త్ ఎస్టేట్ అనే బిరుదు కూడా మీడియాకు ఉంది. సమాజం లో జరిగే అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తెచ్చి, పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు మీడియా మార్గం గా కనిపిస్తోంది. మీడియా ను చూసి పాలకులు భయపడుతూ ఉంటారు. ఎక్కడ తప్పు చేస్తే మీడియా ద్వారా నిలదీస్తారో.. ప్రజల్లో అభాసుపాలవుతామో అని ఆందోళన చెందుతుంటారు. ఇంతగా మీడియా అంటే టెర్రర్ నాయకులకు, తప్పు చేసే వారికి ఉంటుంది. అయితే అదంతా ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. 

IHG

మీడియా అంటే భయం కాదు కదా గౌరవం కూడా పోయింది. ఇందంతా ఇలా ఉంటే అప్పుడపుడు మీడియా స్వేచ్చ అనే పదాలు వినిపిస్తుంటాయి. ఏదైనా ప్రచారం చేసిన వార్త ఎదుటి వారికి నచ్చకపోయినా వారు కేసు పెట్టినా , మౌఖికంగానూ, భౌతికంగానూ దీనిపై స్పందించిన సమయంలో ఈ మీడియా స్వేచ్చ అనే పదం పదే పదే వినిపిస్తూ ఉంటుంది. మీడియాపై ఫలానా పార్టీ కక్ష గట్టింది అని, వేధిస్తోందని ఇలా ఎన్నో ఫిర్యాదు లు మీడియా అప్పుడప్పుడూ చేస్తూ ఉంటుంది. మీడియా పై దాడులు అంటే ఊరికే జరుగుతున్నాయా  ? నిజంగా ప్రజలపక్షాన పనిచేస్తున్నాయా ? నిస్పక్షపాతంగా ఉంటున్నాయా ? ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా జనాల ఇబ్బందులు తీర్చడమే తమ పనిగా పెట్టుకున్నాయా ? అంటే .. అది పెద్ద క్వశ్చన్ మార్క్ ?

 

IHG

 

ఇప్పుడు పార్టీకో పత్రిక, పత్రికకు ఓ పార్టీ అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి. పార్టీల ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా పనిచేసే మీడియా సంస్థలు పెరిగిపోయాయి. ఆర్ధికంగా లాభపడమే తమ ఏకైక లక్ష్యం అన్నట్టుగా కొన్ని మీడియా యాజమాన్యాలు తయారవ్వడంతో ఇప్పుడు జర్నలిజానికి ... మీడియాకు జనాల్లో ఉన్న గౌరవ మర్యాదలు మొత్తం తగ్గిపోయాయి. ఇక యాజమాన్యాల అభిపాయమే తమ అభిప్రాయం అన్నట్టుగా ఇప్పుడు జర్నలిస్ట్ లలో ఎక్కువమంది తయారయిపోయారు.ఉన్నది ఉన్నట్టుగా.. కట్టుకథలు అల్లకుండా, ధైర్యంగా చెప్పే జర్నలిస్ట్ లు ఇప్పుడెక్కడ ? ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా మరో పార్టీ మీద బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మీడియా సంస్థలకు ... జర్నలిస్టులకు మీడియా స్వేచ్చ అని గొంతెత్తే అర్హత లేనే లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: