ఏపీలో అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కొద్దిరోజులుగా రెబల్ గా మారి తన వ్యాఖ్యలతో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే క్రమశిక్షణ ఉల్లంఘించారని నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల‌కు సరైన సమాధానం ఇవ్వని పక్షంలో తగిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎలా ఇస్తార‌ని.. పార్టీ పేరు యువ‌జ‌న శ్రామిక రైతు పార్టీ అని ఉంది క‌దా ?  అని ప్ర‌శ్నించారు. 

 

దీనిని బ‌ట్టే ఆయ‌న పార్టీ నుంచి అవ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక ర‌ఘు రామ‌కృష్ణం రాజు ప‌క్క‌న పెడితే మ‌రో ముగ్గురు ఎంపీలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ ముగ్గురు ఎంపీలు రాజ్య‌స‌భ ఎన్నిక ల నేప‌థ్యంఓలోనే సైలెంటుగా ఉన్నార‌ని.. వీరు వ‌చ్చే ఒక‌టి రెండు నెల‌ల్లోనే బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో అనుమానాలు వ‌స్తున్నాయి. వీరిలో జ‌గ‌న్ పార్టీలో చేర‌డం ఏ మాత్రం ఇష్టం లేక‌పోయినా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని వీడి బ‌ల‌వంతంగా వైసీపీకి వెళ్లి ఎంపీలుగా గెలిచిన వారు ఇద్ద‌రు అయితే.. మ‌రో యువ ఎంపీ సైతం అదే రూట్లో ఉన్న‌ట్టు స‌మాచారం.

 

స‌ద‌రు యువ ఎంపీ సామాజిక వ‌ర్గాన్ని జ‌గ‌న్ బాగా టార్గెట్ చేస్తున్న‌ట్టు ఎక్కువుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. స‌ద‌రు యువ ఎంపీ ఉన్నా కూడా ఆయ‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మ‌రో సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేల హ‌వా ఉండ‌డంతో పాటు త‌న అనుచ‌రుల‌కు, త‌న సామాజిక వ‌ర్గానికి ఏ మాత్రం ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో స‌ద‌రు ఎంపీ కొద్ది రోజులుగా మౌనంగా ఉండ‌డంతో పాటు పార్టీ నేత‌ల‌తో అంటీముట్ట‌న‌ట్టుగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే స‌ద‌రు ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్తలు అయిన ఎంపీతో పాటు స‌ద‌రు యువ ఎంపీ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

 

ట్విస్ట్ ఏంటంటే ఇటీవ‌ల జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చిన మ‌రో యువ ఎంపీ పేరు సైతం జంపింగ్ ఎంపీల లిస్టులో ఉంది. స‌ద‌రు యువ ఎంపీ కూగా గ‌తంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన వాడే. ఆ యువ ఎంపీ మీడియాలో బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తారు. ఇటీవ‌ల జ‌గ‌న్ ఇచ్చిన వార్నింగ్‌తో ఆయ‌న కూడా జంపింగ్ ఎంపీల లిస్టులో ఉన్నార‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. మ‌రి ఈ వార్తల్లో నిజానిజాలేంటో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: