ఏపీలో ఏది జ‌ర‌గ‌కూడ‌ద‌ని అనుకున్నారో.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అదే జ‌రుగుతోంద‌ట‌! ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.. ఏకంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆపార్టీ సీనియ‌ర్ నాయ‌కులే చెవులు కొరు క్కుం టున్నారు. ఇటీవ‌లి ప‌రిణామాల‌పై వారు ఒక‌రికొక‌రు ఫోన్లు చేసుకుని చ‌ర్చించుకుంటున్నారు. ఈ చ‌ర్చల సారాంశం ఏంటంటే.. టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి ఇప్ప‌ట్లో లేద‌నే! నిజానికి టీడీపీ అభిమానుల‌ను సైతం ఒకింత ఆశ్చ‌ర్యంలో ముంచెత్తే ఈ విష‌యం జీర్ణించుకోక త‌ప్ప‌ద‌ని కూడా చెబుతున్నారు. అచ్చ న్నాయుడు అరెస్టు, జేసీ ప్ర‌భాక‌ర్ అరెస్టు.. త‌ర్వాత గంటా శ్రీనివాస‌రావు స‌హాయ‌కుడిని సోష‌ల్ మీడియా లో పోస్టులు ఫార్వ‌ర్డ్ చేశార‌ని అదుపులోకి తీసుకోవ‌డం.


ఇవ‌న్నీ ఇలా ఉంటే.. టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డికి ఏపీలో చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల‌కు, తెలంగాణ‌లో చేసిన క‌రో నా ప‌రీక్ష‌ల‌కు మ‌ధ్య తేడా ఉండ‌డం వంటి అంశాలు స‌హా పార్టీ నాయ‌కుడు ప‌ట్టాభిరాం.. వెలుగులోకి తెచ్చి న 108 కుంభ‌కోణం వంటివాటిపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ధ్వ‌జ‌మెత్తారు. వీటి ని ప‌ట్టు కుని ఓ రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకున్నారు. అనుకున్న విధంగానే ఆయ‌న హుటా హుటిన అనంత‌పురం వెళ్లి జేసీ కుటుంబాన్ని ఓదార్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. రాజా రెడ్డి రాజ్యాం గం అమ‌ల‌వుతోంద‌ని నిప్పులు చెరిగారు. ఇక‌, దీప‌క్ రెడ్డి విష‌యంలోనూ ట్విట్ట‌ర్ వేదిక‌గా రెచ్చిపోయారు. అదేస‌మ‌యంలో 108 కుంభ‌కోణం జ‌రిగింద‌న్న ప‌ట్టాభివ్యాఖ్య‌ల‌పైనా ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. 


ఈ ప‌రిణామాల‌తో టీడీపీ అనుకూల మీడియా లోకేష్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంద‌ని అనుకున్నారు పార్టీలో సీనియ‌ర్లు. ఎందుకంటే.. అనుకూల మీడియానే న‌మ్ముకుని లోకేష్ రాజ‌కీయాలు చేస్తున్నారు. గ‌త ఏడాది ఓట‌మి త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల్లోకి ఆయ‌న వెళ్లింది లేదు. కేవ‌లం అనుకూల మీడియాలోనే అంతా న‌డిపించేస్తు న్నారు. దీంతో లోకేష్ దూకుడుకు మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని, అనుకూల మీడియా పుంఖాను పుంఖాలుగా వార్త‌లు అచ్చేస్తుంద‌ని భావించారు. కానీ, అనూహ్యంగా స‌ద‌రు అనుకూల మీడియా లోకేష్ వ్యూహాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. సింగిల్ కాల‌మ్‌, లేదా వ‌న్ అండ్ ఆఫ్ కాలం వార్త‌ల‌తోనే స‌రిపెట్టింద‌ట‌! దీనిని సీనియ‌ర్లు బాగా ఫోక‌స్ చేస్తున్నారు. 


ఈ క్ర‌మంలోనే వారు చిన్న‌బాబు ఎప్ప‌టికీ.. `చిన్న‌`బాబుగానే ఉండిపోతారా? అని వారు చ‌ర్చించుకుంటు న్నారు. అంతేకాదు ఈ అనుకూల మీడియా ఒక్క‌సారిగా ఎందుకు యూట‌ర్న్ తీసుకుందా? అనే చ‌ర్చ కూడా సాగిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ మీడియాను ప‌ట్టించుకో వడంలేదు. ప్ర‌భుత్వం ఇచ్చే ప్ర‌క‌ట‌న‌ల్లో ఈ మీడియాను ప‌క్క‌న పెడుతున్నారు. దీంతో ఇప్పుడు మిగిలింది కేంద్రంలోని బీజేపీని ప‌ట్టుకుని వేలాడ‌డ‌మే! అందుకే .. బీజేపీకి అనుకూలంగా.. ఏమాత్రం ల‌బ్ధి చేకూర్చినా.. త‌మ ప‌త్రిక నిల‌బ‌డుతుంద‌ని.. లేకుండా శంక‌ర‌గిరి మాన్యాలు త‌ప్ప‌వ‌ని గుర్తించిన టీడీపీ అనుకూల మీడియా.. బాబు ఆయ‌న కుమారుడికి ఫోక‌స్‌ను త‌గ్గించి.. బీజేపీ అనుకూల వ్య‌వ‌హారం దిశ‌గా అడుగులు వేస్తోంద‌ట‌! దీంతో ఇప్పుడు సీనియ‌ర్లు అంద‌రూ ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామం ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: