తన తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఉర్రూతలూగించిన రియాలిటీ షో 'బిగ్ బాస్' నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. బిగ్ బాస్ అటు బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన రియాల్టీ షో. ఇకపోతే ఈ సీజన్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

 

ప్రతి సీజన్ బిగ్ బాస్ కి ముందు అందులో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ కన్నా కూడా హోస్ట్ గా వ్యవహరించే సెలబ్రిటీ పైనే ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంటుంది. ఆ అంచనాలకు తగ్గట్టే మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేయగా రెండో సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మూడవ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున నాలుగో సీజన్ కు కూడా వ్యాఖ్యాతగా కొనసాగుతారని వార్తలు వచ్చాయి.

 

అయితే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం ఏమిటంటే అక్కినేని కోడలు సమంత నాలుగో సీజన్ హోస్ట్ గా వ్యవహరించబోతోందట. నిర్వాహకులు ఈమెని హోస్ట్ గా తీసుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. 

 

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో కి ఫిమేల్ హోస్ట్ గా ఎవరు వ్యవహరించలేదు. సీజన్- 3 కి అక్కినేని నాగార్జున అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఎపిసోడ్స్ కు రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక ఈ సారి కంటెస్టెంట్స్ లిస్టు లో హీరో తరుణ్, యాంకర్ వర్షిని, సింగర్ మంగ్లీ, అఖిల్ సర్తార్, యాంకర్ మరియు కమెడియన్ బిత్తిరి సత్తి పేర్లు ఖరాలు అయినట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ విజేత గా శివ బాలాజీ నిలవగా.. రెండవ సీజన్ టైటిల్ ను కౌశల్ ఏకగ్రీవంగా ఎగరేసుకుపోయాడు. మూడవ సీజన్ ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: