యూసీ బ్రౌజ‌ర్ ఆప్ మొద‌టి నుంచి భార‌త్‌లో వివాదాస్ప‌దంగానే వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. అత్య‌ధికంగా భార‌త యూజ‌ర్ల‌ను క‌లిగి ఉన్న ఈ యాప్ చైనాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న నేప‌థ్యంలో  ఇప్పుడు నిరూపిత‌మైంద‌నే చెప్పాలి. యూసీ బ్రౌజ‌ర్ చేతిలో భార‌త మీడియా బంధి అయిందా..? అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  చైనా-భార‌త్‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నా..చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌పై ఒక్క వార్త కూడా కాన‌రాక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. వాస్త‌వానికి ఇదొక్క‌టి చాలు యూసీ బ్రౌజ‌ర్ యాజ‌మాన్యం వైఖ‌రేంటో అంటూ భార‌తీయులు మండిప‌డుతున్నారు. అందుకే అన్ ఇన్స్టాల్ చేయాల‌న్న నినాదం మ‌రింత ఊపందుకుంది.

 

వాస్త‌వానికి ఈ ఆప్ భార‌త యూజ‌ర్ల ఇన్ఫ‌ర్మేష‌న్‌ను త‌స్క‌రిస్తోంద‌ని గ‌తంలోనే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో చాలా రోజుల పాటు ప్లే స్టోర్ నుంచి తొల‌గించేశారు. అయితే ఈ సంఘ‌ట‌న‌కు ముందే దాదాపు 2కోట్ల మందికి పైగా త‌మ స్మార్ట్ ఫోన్ల‌లో డౌన్లోడ్ చేసుకుని నిక్షిప్తం చేసుకున్నారు. అప్ప‌టి నుంచి ఈ ఆప్‌కు ఆద‌ర‌ణ త‌గ్గిన మాటయితే వాస్త‌వం. అలా అని పూర్తిగా కొత్త యూజ‌ర్స్ రాకుండా..లేకుండా పోవ‌డం లేదు. థర్డ్ ‌పార్టీ వెబ్‌ బ్రౌజర్‌ ‘యూసీ’ మరింత విస్తరించాలనే ప్రయత్నంలో ఉంది.ఇప్పటికే దీన్ని ప్రపంచవ్యాప్తంగా  1.1 బిలియన్ల మంది వాడుతున్నారు. ఇంటర్నెట్‌ పోటీ పెరుగుతున్న నేనథ్యంలో ఇది మరింత అభివృద్ధితో యూజర్లను ఆకట్టుకుంటున్నది.

 

ముఖ్యంగా భారత మార్కెట్‌లో దీన్ని విస్తరించేందుకు కంపెనీ కసరత్తు చేస్తున్నది. అందుకే ‘యూసీ క్లౌడ్‌' పేరుతో ఉచిత క్లౌడ్‌ స్టోరేజీని ఇవ్వనుంది. ఇందు కోసం ‘ యూసీ క్లౌడ్‌ యాప్‌' ను రిలీజ్‌ చేసింది. దీని ద్వారా డాటాను అంతా యూసీ డ్రైవ్‌లో భద్రపరుచుకోవచ్చు.ఈ డ్రైవ్‌లో నుంచి ఒకరికన్న ఎక్కువ మందితో సమాచారాన్ని షేర్‌ చేసుకొనే వీలుందని కంపెనీ చెబుతోంది. ఇదిలా ఉండ‌గా చైనా దేశానికి చెందిన ఈ  కంపెనీ భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై వార్త‌లు పెట్ట‌క‌పోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: