తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చదివితే అదే అనుమానం పెరుగుతోంది. కాపులకు బడ్జెట్లో ఎంత కేటాయించారు ? ఎంత ఖర్చు చేశారు ?   రిజర్వేషన్ల డిమాండ్  నుండి కాపుల దృష్టిని మళ్ళించేందుకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే కాపు నేస్తం అంటూ పవన్ ప్రభుత్వంపై మండిపోయాడు.  మొత్తానికి పవన్ అంగీకరించిన విషయం ఏమిటంటే కాపులకు ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చంద్రబాబునాయుడు చెప్పి ఏమార్చాడట. కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు ఎంత ఖర్చు చేశాడు ? ఇపుడు ఎంత ఖర్చు చేస్తున్నారు  ? అని పవన్ నిలదీయటమే విచిత్రంగా ఉంది.

 

ఐదేళ్ళపాటు చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కాపుల సంక్షేమం కోసం పవన్ ఒక్కసారి కూడా నిలదీయలేదు. కాపుల సంక్షేమం కోసం ఎంత కేటాయిస్తున్నారు ? ఎంత ఖర్చు చేశారో చెప్పటమని ఏనాడూ నిలదీయలేదు. పైగా అప్పట్లో తనను కాపు సామాజికవర్గానికి మాత్రమే పరిమితం చేయద్దంటూ ఎగస్ట్రాలు మాట్లాడాడు. తనకు కాపు సామాజికవర్గంతో సంబంధం లేదని కూడా బల్లగుద్ది మరీ చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకవైపు తాను అందరి వాడిని అంటూ చెప్పుకునే కలరింగ్ ఇస్తునే మరోవైపు చంద్రబాబు ప్రయోజనాలు కాపాడేందుకే రాజకీయాలు చేసిన విషయం అందరికీ అర్ధమైపోయంది. అందుకనే  మొన్నటి ఎన్నికల్లో చివరకు కాపుల ఓట్లు కూడా పూర్తిగా పడలేదు. పైగా పోటి చేసిన రెండో చోట్లా ఓడిపోయాడు.

 

మొన్నటి ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయిన పవన్ ఇపుడు కరోనా వురస్ కారణంగా మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లున్నాడు. అందులోను కాపు సామాజికవర్గం, కాపుల సంక్షేమం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు.  కాపుల సంక్షేమానికి ఏటా రూ. 2 వేల కోట్లిస్తానని చేసిన హామీని పవన్ గుర్తు చేస్తున్నాడు. నిజమే జగన్ హామీ ఇచ్చిన మాట నిజమే. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏదో ఓ అవాంతరం వచ్చి పడుతునే ఉన్న విషయం అందరు చూస్తన్నదే. దాదాపు మూడు నెలలుగా కరోనా వైరస్ సమస్య కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది.

 

ఒకవైపు ఆదాయానికి గండిపడినా హామీ ఇచ్చినట్లుగా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కాపు నేస్తం పథకంలో  2.3 లక్షలమంది కాపులకు రూ. 357 కోట్ల విడుదల చేశాడు. ఇంతటి కష్ట సమయంలో కూడా నిధులకు డబ్బులు విడుడల చేసిన జగన్ను అభినందించటానికి పవన్ కు మనసు రాలేదు. అదే సమయంలో కాపు కార్పొరేషన్ కు ఇస్తానన్న రూ. 2 వేల కోట్లేది అని అడగటమే విచిత్రంగా ఉంది. 

 

రాష్ట్రప్రభుత్వం ఆదాయ పరిస్ధితి ఏమిటి ? వైసిపి అధికారంలోకి వచ్చే సమయానికి ఖజానాలో ఉన్న సొమ్ములెన్ని ? అన్న విషయాలను పట్టించుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టే కాపులను ప్రభుత్వంపైకి పవన్ రెచ్చగొడుతున్నట్లే అనుమానంగా ఉంది. పవన్ మాటలు విని రెచ్చిపోవటానికి కాపులు ఏమీ అమాయకులు కాదు కదా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: