మాట త‌ప్పను-మ‌డ‌మ తిప్ప‌ను- అనే స్లోగ‌న్‌ను ఒంటినిండా.. మ‌న‌సునిండా నింపుకొన్న నాయ‌కుడు వైసీ పీ అధినేత జ‌గ‌న్‌. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు శాస‌న మండ‌లి విష‌యంలో మ‌డ‌మ తిప్పారా?  తాను అసెంబ్లీ సాక్షిగా చేసిన బిల్లు విష‌యంలో ఆయ‌న త‌న వ్యూహాన్ని వెన‌క్కి తీసుకున్నారా?  మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తిపాదించిన ఆయ‌నే ఇప్పుడు `వ‌ద్దులే..` అనేలా ఆలోచిస్తున్నారా?  అంటే.. ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంద‌రు ఔన‌ని, మ‌రికొంద‌రు కావొచ్చ‌ని.. ఇంకొంద‌రు కాద‌ని.. చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏపీకి చెందిన అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఢిల్లీలోనే మ‌కాం వేశారు. ఉన్న చోట నుంచి క‌ద‌ల కుండా ఢిల్లీలోనే ఉంటూ.. ఏపీ రాజ‌కీయాల‌పై ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్నారు. 


వీరిలో వైసీపీ నేత‌లు.. టీడీపీ నాయ‌కులు తాజాగా మండ‌లి విష‌యంపై చ‌ర్చించుకున్న‌ప్పుడు.. జ‌గ‌న్ త‌న వ్యూహం మార్చుకున్నార‌ని కొంద‌రు చెబితే.. కాదు.. మా నాయ‌కుడు అలాంటి నిర్ణ‌యం తీసుకోరు.. అని కొంద‌రు వాదిస్తున్నారు. ఈ ప‌రిణామంతో అస‌లు మండలి విష‌యంలో జ‌గ‌న్ వ్యూహం ఏంటి? అనే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌(అభివృద్ధి అని ప్ర‌భుత్వం చెబుతోంది) చేప ‌ట్ట‌డంతోపాటు, సీఆర్‌డీఏ చ‌ట్టం ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధిం చి అసెంబ్లీలోనూ బిల్లులు పాస్ చేసింది. అయితే, ఈ రెండు అంశాల‌నే టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇవి రెండూ కూడా చంద్ర‌బాబుకు మాన‌సిక పుత్రిక‌లు. 


దీంతో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకువ‌చ్చిన బిల్లులు.. అసెంబ్లీలో ఆమోదం పొందినా.. మండ‌లిలో త‌మ‌కు ఘ‌న మైన మెజార్టీ ఉండ‌డంతో టీడీపీ అడ్డుకుంది. అంతేకాదు.. తీవ్ర నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మం డ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌.. వీటిని సెల‌క్ట్ క‌మిటీకి పంపుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఈ విష‌యం ప్ర‌భుత్వా నికి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారి.. అస‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌మ‌ని క‌దా.. మండ‌లిని ఏర్పాటు చేసుకుం ది. అలాంటి మండ‌లి ప్ర‌భుత్వంపై పెత్త‌నం చేస్తానంటే ఎలా అంటూ.. ఆగ్ర‌హించి.. ఏకంగా మండ‌లి ర‌ద్దుకే మొగ్గు చూశారు. మండ‌లిలో ఈ రెండు బిల్లులకు ప్ర‌తిష్టంభ‌న ఎదురైన 47 గంటల్లోనే మండ‌లి ర‌ద్దును ప్ర‌తిపాదిస్తూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం బిల్లును ఆమోదించి పార్ల‌మెంటుకు పంపించేసింది.


దీంతో ఇప్పుడు మండ‌లి ర‌ద్దు లేదా ఈ బిల్లు ర‌ద్దు.. అనే విష‌యాలు.. కేంద్రం కోర్టుకు చేరాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్ల‌మెంటులో దీనిని ప్ర‌స్థావించ‌లేదు. మండ‌లి ర‌ద్దుపై కేంద్రం దృష్టి కూడా పెట్ట‌లేదు. అయితే, ఇది జ‌రిగి మూడు మాసాలు అయింది. ఈ క్ర‌మంలో ఇటు వైసీపీలోని ఒక రెబ‌ల్ ఎంపీ, టీడీపీలో ని ఒక ఎంపీ.. ఈ బిల్లుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో ఢిల్లీ రాజ‌కీయాల్లో కామెంట్లు చేశారు.  మా నాయ‌కుడు ఆవేశ ప‌డ్డారు. మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని ఆవేశంలో నిర్ణ‌యించుకున్నారు .. త‌ప్పితే.. ఆయ‌న‌కు మండ‌లిని ర‌ద్దు చేయాల‌నే ఉద్దేశం లేద‌ని వైసీపీలోని ఒక‌రిద్ద‌రు ఎంపీలు చెబుతున్నార‌ట‌. అయితే,ఈ వ్యాఖ్య‌ల‌ను మ‌రికొంద‌రు వైసీపీ ఎంపీలు కొట్టి పారేస్తున్నారు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కాబ‌ట్టి మండ‌లి ర‌ద్దు ఖాయ‌మ‌ని అంటున్నారు. 


ఇక‌, వైసీపీ రెబ‌ల్ ఎంపీ స‌హా మిగిలిన వారి వ్యాఖ్య‌ల‌కు విరుద్ధంగా టీడీపీ ఎంపీ ఒక‌రు మ‌రో ఆస‌క్తిక‌ర వ్యా ఖ్య చేశారు. నిజ‌మే!  జ‌గ‌న్ ఆవేశంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయినా కూడా మండ‌లిని ర‌ద్దు చే యాల‌నే అనుకుంటున్నారు. కానీ, చాలా మంది సీనియ‌ర్లు, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు వ‌దులుకుని త్యాగా లు చేసిన వారు మాత్రం జ‌గ‌న్‌పై ఒత్తిడి తెస్తున్నారు. `జ‌రిగిందేదో జ‌రిగిపోయింది సార్‌.. పార్ల‌మెంటుకు బిల్లు వెళ్ల‌కుండా చూసి.. మండ‌లిని ర‌క్షించుకుందాం. ఒక్క ఏడాది ఆగితే.. మండ‌లి మొత్తం మ‌న‌దైపోద్ది`` అని వారు హిత‌వు ప‌లుకుతున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ అజ్ఞాత వ్య‌క్తితో వైసీపీ హైకోర్టులో పిటిష‌న్ వేయించి.. మండ‌లి ర‌ద్దు కాకుండా చూస్తోంద‌న్న‌ది టీడీపీ ఎంపీవారి ఉవాచ‌. 


అంతేనా.. ఇదే వ్య‌క్తి.. కేంద్రానికి కూడా లేఖ‌రాశార‌ని.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆపేయాల‌ని.. మండ‌లిని ర‌ద్దు కాకుండా చూడాల‌ని కూడా లేఖ‌లో కోరార‌ని టీడీపీ ఎంపీ చెబుతున్నారు. దీనికి కొస‌మెరుపుగా ఈ ఎంపీ గారు.. తాజాగా ఎమ్మెల్సీ ప‌ద‌వికి వైసీపీ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను ఎంపిక చేసింద‌ని, ర‌ద్ద‌య్యే వ్యూహమే ఉండి ఉంటే.. ఆయ‌న‌ను ఎమ్మెల్సీగా ఎందుకు చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తంగా ఈ మండ‌లి ర‌ద్దు విష‌యం ఢిల్లీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారింద‌నే చెప్పాలి. మ‌రి జ‌గ‌న్ నిజంగానే వెన‌క్కి తీసుకుంటున్నారా?  లేక మండ‌లి ర‌ద్దుకే మొగ్గు చూపుతారా? అనేది చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: