ఎల్లో మీడియా అనే పేరు ఎలా వ‌చ్చిందో కానీ.. దానిని సార్థ‌కం చేసుకుంటున్నారు.. టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో అగ్ర‌గామిగా పేరు తెచ్చుకున్న ఓ ద‌మ్మున్న అధినేత!  ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావ‌డ‌మే ఇష్టం లేని.. మీడియా అధిప‌తుల్లో ఆయ‌న అత్యంత కీలకం. మిగిలిన వారు ఎక్క‌డో ఒక‌క్క‌డ రాజీ ప‌డ‌డ‌మో.. లేదా ప్ర‌భుత్వం నిజంగానే మంచిచేస్తే.. దానిని ప్ర‌స్తావించ‌డ‌మో.. చేస్తాయి. మొత్తానికి విమ‌ర్శించాల్సిన స‌మ‌యంలో విమ‌ర్శిస్తాయి.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల్సిన స‌మ‌యంలో అండ‌గా నిలుస్తాయి. నిజానికి ఇలా ఉంటే పెద్ద‌గా త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

 

కానీ, ఎల్లో మీడియాలో త‌న‌దే పైచేయి.. తాను త‌ప్ప టీడీపీని ఆ పార్టీ నాయ‌కుల‌ను కాపాడేది ఎవ‌రూ లేర‌ని అనుకుంటూ.. ఫ‌క్తు టీడీపీ కండువా క‌ప్పుకొన్న నాయ‌కుడి కంటే ఘోరంగా వ్య‌వ‌హ‌రించే ఈ ద‌మ్మున్న అధినేత‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌సిపూసైనా మారేడు కాయ చేసి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా వ్య‌తిరేక వార్త‌లు వండి వార్చ‌డంలో దిట్ట‌! ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌పై వ్య‌తిరేకంగా వ‌రుస పెట్టి వ్య‌తిరేక వార్త‌లు రాస్తున్నా రు. అక్క‌డ గ‌నులు దోచేస్తున్నారు.. ఇక్క‌డ డాక్ట‌ర్ల‌ను రోడ్ల‌పైనే కొడుతున్నారు.. అంటూ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాసుకొచ్చారు. అదే స‌మ‌యంలో వైసీపీలో చిచ్చు పెట్టేలా నాయ‌కుల‌కు-నాయ‌కులకు మ‌ధ్య నార‌దాస్త్రం సంధిస్తూ.. రెచ్చ‌గొట్టే చ‌ర్చ‌లు చేస్తున్నారు.

 

స‌రే! మొత్తానికి ఈ ద‌మ్మున్న అధిప‌తి.. తాను అనుకున్న విష‌యంలో దూసుకుపోతున్నార‌నే అనుకు న్నా.. నిజానికి ప్ర‌భుత్వానికి నిత్యం వ్య‌తిరేకంగా ఉండే వార్త‌లు ఉండ‌వు క‌దా! అలాంటి ప‌రిస్థితే.. శ‌నివా రం నాటి ప‌త్రిక‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రాసేందుకు ఒక్క విష‌య‌మూ ఆయ‌న‌కు ల‌భించ‌లేదు. ఎంత త‌వ్వినా.. ఎక్క‌డా అవినీతి కానీ.. విమ‌ర్శ‌లు కానీ లేవు. ఉన్న‌దంతా కేవ‌లం జ‌గ‌న్ తాజాగా ప్ర‌వేశ పెట్టిన రైతుల‌కు బీమా కార్య‌క్ర‌మం. ఒక్క రూపాయి మాత్ర‌మే రైతుల నుంచి ప్రీమియంగా తీసుకుని.. మిగిలినదంతా కూడా ప్ర‌భుత్వ‌మే క‌డుతుంది. ఇది త‌ప్ప పెద్ద‌గా నిన్న‌టి వార్త‌ల్లో సంచ‌ల‌నాలు లేవు.

 

అయితే, దీనిని ప‌త్రిక మొద‌టి పేజీలో వేసేందుకు కానీ, క‌నీసం మేక‌ప్ చేసేందుకు కానీ.. స‌ద‌రు ఎల్లో మీడియా అధినేత‌కు మ‌నసు ఒప్పుకోలేదు. దీంతో ఆయ‌న ఒక ప్లాన్ వేశారు. ఎలాగూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌లు లేవుకాబ‌ట్టి.. ఎడ్యుకేష‌న్ ఐటంను హైలెట్ చేయాల‌ని సూచ‌న‌లు చేశార‌ట‌. నిజానికి ఏ ప‌త్రిక అయినా.. నిష్ప‌క్ష‌పాతంగా లేక పోయినా.. స‌రే.. ప్ర‌జాకోణంలో ఆలోచిస్తే..ల‌క్షల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చే  ప‌థ‌కాన్ని జ‌గ‌న్ ప్రారంభించిన‌ప్పుడు .. దానినే ప్ర‌మోట్ చేయాలి.

 

 కానీ, దీనికి భిన్నంగా ఈ ఎల్లో మీడియా అధినేత మాత్రం ``ఇంట‌ర్న‌ల్ మార్కుల్లో కాసుల వేట‌`` అంటూ.. ఎలాంటి ఆధార‌మూలేని ఓ వార్త‌ను అచ్చేశారు. అత్యంత కీల‌కం,ల‌క్ష‌ల్లో రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే ప‌థ‌కం ప్రారంభోత్స‌వాన్ని మాత్రం లోప‌లిపేజీల్లోకి నొక్కేశారు! ఇదీ.. వ్య‌తిరేక వార్త లేదా.. అయితే ఇలా చేయండి.. అంటూ ఎల్లో మీడియా  అధిప‌తి వేసిన‌ ప్లాన్‌!!  

మరింత సమాచారం తెలుసుకోండి: