2004వ సంవ‌త్స‌రం, డిసెంబ‌రు నెల 9వ తారీకు. ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్(ఎయి మ్స్‌) ఆసుప‌త్రిలో వైద్యులు.. సిబ్బంది.. ప‌రుగులు తీస్తున్నారు. బ‌య‌ట నుంచి కుయ్‌.. కుయ్‌.. అని కూ త పెట్టుకుంటూ.. ఈ ఆసుప‌త్రికే చెందిన అంబులెన్స్ ర‌య్య‌న దూసుకువ‌చ్చి.. ప్ర‌ధాన కాంపౌండ్ లోకి చేరిం ది. అప్ప‌టికే స్ట్రేచ‌ర్‌, ఆక్సిజ‌న్‌తో సిద్ధంగా ఉన్న ప్ర‌ధాన వైద్యుల బృందం స‌హా.. సిబ్బంది అంబు లెన్స్‌లో నుంచి అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఊపిరాడ‌క అల్లాడుతున్న మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహా రావును పూల పొట్లంలా ప‌ట్టుకుని స్ట్రేచ‌ర్‌పైకి ఎక్కించారు. రెప్ప‌పాటులో ఐసీయూకు త‌ర‌లించారు. ఈలో గా.. మ‌రెన్నో కార్లు.. ఆసుప‌త్రి ప్రాంగ‌ణానికి వ‌చ్చి చేరాయి.


సూటూ బూటుతో ఉన్న ఓ వ్య‌క్తి.. ఓ కారులోంచి దిగుతూ దిగుతూనే.. డోర్ కూడా వేయ‌కుండా... హుటాహు టిన ఆసుప‌త్రి లోప‌లికి ప‌రుగు ప‌రుగున చేరుకున్నారు. `సార్‌కి ఇప్పుడు ఎలా ఉంది?  వైద్యులు ఏమ‌న్నా రు?  ప్రాణాపాయం లేదుక‌దా?.. అయినా.. మీరు నిన్నే ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చి ఉంటే బాగుండేది.` అం టూ.. ఆసుప‌త్రి ప్ర‌ధాన హాలు లో కుర్చీలో జార‌బ‌డి శూన్యంలోకి చూస్తూ.. ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని ప్ర‌య ‌త్న పూర్వ‌కంగా ఆపుకొంటున్న‌ పీవీ గారి పెద్ద కుమారుడు రంగారావు భుజం త‌డుతూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించేశారు ఆ వ‌చ్చిన వ్య‌క్తి. రంగారావు.. నిమ్మ‌ళంగా చెప్పారు.. `ఇప్పుడే ఐసీయూలోకి తీసుకువెళ్లారు. మేం కూడా వెయిట్ చేస్తున్నాం.. ఇప్ప‌టికైతే.. ప్రాణాపాయం లేద‌నే చెప్పారు` అని!


దీంతో.. ఆ వ‌చ్చిన మ‌నిషి.. `హ‌మ్మ‌య్య‌!. అయితే, ఫ‌ర్వాలేదు. అంతా ఆ వేంక‌టేశ్వ‌ర‌స్వామే చూసుకుం టారు. మీరు ధైర్యంగా ఉండండి!!`` అంటూ.. ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ రూమ్ వైపు వ‌డివ‌డిగా అడుగు లు వేశారు. ఆయ‌నే.. పీవీ దృష్టిలో మిత్రుడు.. నిజాయితీప‌రుడు.. ప్ర‌జా సేవ‌కుడు.. ఐఏఎస్ అధికారి పీవీ ఆర్ కే ప్ర‌సాద్. కొన్ని గంట‌లు గ‌డిచాయి.. ``సార్‌ని చూడొచ్చు!!`` వైద్యులు.. పీవీఆర్ కే ప్ర‌సాద్‌, పీవీ కు మారుడు రంగారావు ఉన్న రూమ్‌కు వ‌చ్చి చెప్పారు. దీంతో వారిద్ద‌రూ ఉన్న‌ప‌ళాన‌.. పీవీగారున్న రూమ్ వైపు అడుగులు వేశారు. ఐసీయూలోకి తీసుకు వెళ్తున్న స‌మ‌యంలో పీవీగారి ముఖానికి పెట్టి ఉన్న ఆక్సి జ‌న్ ఇప్పుడు లేదు. అంటే.. ఆయ‌న స్వ‌యంగా శ్వాస తీసుకోగ‌లుగుతున్నారు. `ద‌గ్గ‌ర‌గా వెళ్లి మాట్లాడొచ్చు!`-అనుకున్నారు రంగారావు.. ప్ర‌సాద్ గార్లు!


ఇంత‌లో సూప‌రింటెండెంట్ వీరిదగ్గ‌ర‌కు ప‌రుగు ప‌రుగున వ‌చ్చారు. ``సార్‌.. ప్లీజ్ ఇప్పుడే వ‌ద్దు! మీరు వెయిట్ చేయండి. చూశారుగా.. ఇక‌, కూర్చోండి`` అని అభ్య‌ర్థ‌నా పూర్వ‌క ఆదేశం ఇచ్చారు. దీంతో ఇద్ద‌రూ వెనుదిరిగారు.. కొన్ని నిముషాలు గ‌డిచాయి.. మ‌ళ్లీ అదే సూప‌రింటెండెంట్‌.. అదే రూం వ‌ద్ద‌కు వ‌చ్చి.. ``సార్‌.. ప్ర‌సాద్ గారూ.. సార్ మీతో ఏదో మాట్లాడ‌ట‌.. ర‌మ్మ న్నారు. ఆయ‌న‌ను ఖంగారు పెట్టే మాట‌లు మాట్లాడొద్దు.. ఎక్కువ సేపు ఆయ‌న‌తో మాట్లాడించొద్దు.. గాబ‌రా పెట్టొద్దు..`` అంటూ.. పీవీఆర్‌కే ప్ర‌సాద్‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు. దీంతో త‌న దేవుణ్ని(పీవీని ప్ర‌సాద్‌గారు ఇలానే అనేవారు సార్ స్థానంలో స్వామి అని పిలిచేవారు) చూసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని ప‌రుగు ప‌రుగున మ‌ళ్లీ పీవీగారిని ఉంచిన రూమ్‌లోకి వెళ్లారు. 


హ‌ఠాత్తుగా వ‌చ్చిన గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన పీవీలో ఎక్క‌డా ఖంగారు లేదు.. చ‌నిపోతానేమోన ‌న్న భ‌య‌మూ లేదు. ఆయ‌న క‌ర్మ యోగి(పెద్ద కుమారుడు రంగారావు ఇలా పిలిచారు. చాలా మంది మ‌న్మోహ‌న్ సింగ్‌ అన్నార‌నే ప్ర‌చారం చేస్తున్నారు. చేసిన ప‌నిని న‌మ్ముకున్నారే త‌ప్ప.. ఫ‌లితంపై పీవీ ఎప్పుడూ ఆశ‌లు పెట్టుకోలేదు(భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణుడు ఇదే క‌దా చెప్పాడు). త‌న రూంలోకి వ‌చ్చి.. త‌నున్న బెడ్‌కు కొంచెం దూరంగా నిల‌బ‌డ్డ పీవీఆర్‌కే ప్ర‌సాద్ క‌ళ్ల‌లోకి క‌ళ్ల పెట్టి చూస్తూ.. ద‌గ్గ‌రగా ర‌మ్మ‌ని పీవీ సైగ చేశారు. దీంతో ఆయ‌న రెండ‌డుగులు ముందుకు వేసి.. పీవీకి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. 

 

``(తెలుగులోనే)చూడు ప్ర‌సాదూ.. నేనెవ‌రికీ బాకీ అయితే లేను. కానీ, కొంత మందికి రుణ ప‌డిపోయాను. నా త‌ర‌ఫున ప‌ది ప‌దిహేను మంది లాయ‌ర్లు.. కోర్టుల్లో కేసుల‌పై వాదించారు. వారికి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు ప్ర‌సాదూ.. ఇప్పుడు ఇద్దామంటే.. నాద‌గ్గ‌ర పైసా కూడా లేదు. రంగారావు కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాడికి చెబితే బాధ‌ప‌డ‌తాడు. కానీ, రుణ ప‌డిపోయి.. `పోవ‌డం` నాకిష్టం లేదు ప్ర‌సాదూ.. నువ్వు నాకోసం ఒక‌‌ప‌ని చేసి పెట్టు``- ఆగుతూ.. ఆగుతూ.. వ‌స్తున్న స్వ‌రం.. కొన్ని నిముషాలు మూగ‌బోయింది. పీవీఆర్ కే ప్ర‌సాద్ క‌ళ్లు సుడిగుండాల‌య్యాయి! `ఎలాంటి నాయ‌కుడు.. ఎలాంటి జ్ఞాని.. మ‌న దేశం కాకుండా విదేశాల్లో పుట్టి ఉంటే.. ప్ర‌పంచ‌మే పూజించేది క‌దా.. పువ్వుల‌పై న‌డిపించేది క‌దా!!`  ప్ర‌సాద్ మ‌స్కిష్కంలో ఆలోచ‌నల ప‌రంప‌ర‌.. పెను వేగంతో సాగింది. 


మ‌ళ్లీ పీవీ నోరు విప్పారు.. ``ప్ర‌సాదూ.. నాకు బంజారాహిల్స్ ఓ ఇల్లు ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్లి.. దాన్ని అమ్మి పెట్టు. ప‌త్రాల‌న్నీ సిద్ధం చేసి.. రాజికి(పీవీ గారి వంట మ‌నిషి) చెప్పాను.. ఎక్క‌డ ఉన్నాయో చూపి స్తాడు. ఆ డ‌బ్బులు.. నా కేసుల‌పై వాదించిన లాయ‌ర్ల‌కు ఫీజుగా ఇచ్చెయ్‌! ఇదే ప్ర‌సాదూ.. నేను నిన్ను అడిగేది!`` పీవీ గారి కంఠం మ‌ళ్లీ మూగ‌బోయింది. కొన్ని రోజులు గ‌డిచాయి. పీవీఆర్ కే ప్ర‌సాద్‌గారు.. పీవీ ఇల్లు అమ్మేశారు. ఈ విష‌యం చెప్పేందుకు.. ఆయ‌న మ‌ళ్లీ ఢిల్లీ బ‌య‌ల్దేరారు. అది డిసెంబ‌రు 23. పీవీఆర్ కే ప్ర‌సాద్ బేగంపేట‌లోని విమానాశ్ర‌యానికి చేరుకుని ఢిల్లీ వెళ్లే.. విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ``స్వామీ మీరు చెప్పిన‌ట్టే.. మీ ఇల్లు అమ్మేశాను. వ‌చ్చిన డ‌బ్బును లాయ‌ర్ల‌కు ఇచ్చేశాను.. మీరు ధ‌న్యులు. రుణ విముక్త‌ల‌య్యారు. ప్ర‌శాంతంగా చిర‌కాలం జీవించండి. మాబోటి వారికి మార్గ‌ద‌ర్శులు కండి``- అని పీవీని క‌లిసి చెప్పాల‌ని మ‌న‌సులో సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌లోనే ఓ వార్త‌.. పీవీఆర్‌కే మ‌న‌సు ఛిద్ర‌మైంది.. ఆయ‌న హృద‌యం నిశీధిగా మారింది.. అదే పీవీ అస్త‌మించారు.. అనే మ‌ర‌ణ‌వార్త‌!!

మరింత సమాచారం తెలుసుకోండి: