కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది కోటి కేసులతో కలవర పెడుతుంది. ఐదు లక్షల ప్రాణాలు స్వాహా చేసింది. ఇది  ప్రపంచమంతా కలిసి పోరాడాల్సిన సమయం. ఈ వైరస్ ప్రపంచ నలుమూలలా విస్తరించి ఉంది. వైద్య శాస్త్రం కొత్త ఆద్యాయనాలు చేసి శాస్త్ర వేత్తలు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం. జాతి బేదాలు జాతి విబేదాలు బార్డర్ సమస్యలు ఇలా అన్నిటిని పక్కనపెట్టి ఏకతాటి పైకి వచ్చి కలిసికట్టుగా పోరాడే సమయం. సాధారణంగా ఏదైనా రోగం వస్తే దాని గురించి స్టడీ చేసి దానికి సరైన ఔశదం తీసుకురావాలంటే కనీసం 10 నుండి 20 సంవత్సరాలు పడుతుంది.

 

వ్యాక్సిన్ వచ్చిన తరువాత కూడా దాన్ని మూడు ఫేజ్ లలో టెస్ట్ చేస్తారు మూడు పేజ్ లలో పాజిటివ్ అంశాలు వెల్లడవుతే గ్రూప్ క్లినికల్ ట్రయల్స్ చేస్తారు అక్కడ కూడా విజయవంతం అవుతే దాన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తారు. కానీ కరోనా మహమ్మారి వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుంది. శాస్త్రవేత్తలేమో మేము మందు కనిపెట్టాము మేము మందు కనిపెట్టాము అని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు చేశారో ఆ మందు పై ఎన్ని ఫేజ్ లలో పరీక్షలు చేశారో దేవుడెరుగు. మరోపక్క చైనా లోనే పుట్టిన వైరస్ కు చైనా వారే వ్యాక్సిన్ కనిపెట్టారని కానీ ప్రపంచ దేశాలకు ఆ వ్యాక్సిన్ ఇవ్వడం లేదని మరో వాదన వినిపిస్తుంది. అసలు నిజంగానే ఎవరైనా ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టారా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

 

అయితే భారత్ లోని ప్రముఖ ఔషధ కంపెనీలు అయిన సిప్లా హెటిరోలు కోవిడ్ కు వ్యాక్సిన్ కనుక్కున్నామని చెప్పుకుంటున్నారు మరి వారు చెప్పేవి నిజమేనా అంటే ట్రయల్స్ రిపోర్టులు చూపించమని కేంద్రం కోరితే నోరెళ్ళబెడ్డుతున్నారు. వారి దగ్గర నుండి ఎటువంటి సమాధానం ఎక్కడా వినిపించట్లేదు. ఇక ఇదే నేపద్యంలో చైనా క్యాపిటల్ బీజింగ్ లోని చైనా నేషనల్ బయోటిక్ సంస్థ కోవిడ్ వ్యాక్సిన్ పై నోరు మెదిపింది. తమ వద్ద వ్యాక్సిన్ కోసం చేస్తున్న రీసర్చ్ లో వచ్చిన ఫార్ములా జంతువుల పై చేసిన పరీక్షల్లో సఫలమయ్యిందని సంస్థ వెల్లడించింది. దాంతో వారు మొదట ఓ వ్యక్తి పై ఆ ఫార్ములా ను ప్రదర్శించగా అతని పై కూడా మంచి రిజల్ట్ నే చూపిండట ఇప్పుడు దాంతో వారు గ్రూప్ ట్రయల్స్ మొదలుపెట్టారు.

 

దాదాపుగా 1120 మంది పుష్టిగా ఉన్నవాళ్లని పిలిచి వారిపై రోగంతో పోరాడే యాంటీ బాడీస్ ను ప్రయోగించారు వారందరిలోనూ మంచి పరిణామమే కనిపించింది. దాంతో చైనా ప్రభుత్వం వారికి వారు కనుగొన్న వ్యాక్సిన్ ను 8 మంది దేశి విదేశీ వారి పై పరీక్షించేందుకు అనుమతి ఇచ్చింది. ఒకవేళ వారిలో కూడా మంచి రిజల్టే వస్తే కారోనా కట్టడవుతే మనకు చైనాతో ఎన్ని గొడవలు ఉన్నా వారిని ఆశ్రయించక తప్పదు. పైగా కరోనా ను కట్టడి చేసే వ్యాక్సిన్ కనుగొన్న మొదటి దేశం చైనా నే అవుతుంది. చైనా లోనే పుట్టిన వైరస్ కు చైనా నే సమాధానం చెప్పనుందా.. ప్రపంచాన్ని డేంజర్ లో పడేసిన చైనా నే మరలా ప్రపంచాన్ని కాపాడనుందా అనే ప్రశ్నకు జవాబు దొరకాలంటే మాత్రం ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: