చైనా- భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రెండు దేశాల బలాబలాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. యుద్ధం అంటూ వస్తే ఎవరి బలం ఏంటి.. ఎవరి బలహీనత ఏంటి అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఒక వేళ చైనాతో యుద్ధంలో తలపడితే భారత్‌ గెలవగలదా.. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమైన చైనాను భారత్ డీకొట్టగలదా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.

 

 

చైనా సైన్యం కవాతు చూస్తే.. డ్రాగన్ సైన్యం మహా పటిష్టంగా ఉందని అనిపిస్తుంది. పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ యుద్ధ భూమిలో దిగితే ప్రత్యర్థులు చిత్తు కావడం ఖాయమన్న భావన కలుగుతుంది. కానీ అదంతా పైకి మాత్రమే కనిపిస్తుందట. లోపల అంత సీన్ లేదట. ఈ విషయం నిపుణులు చెబుతున్నారు.

 

 

ఎందుకంటే.. చైనా సైన్యంలో ఇప్పుడున్న జవాన్లకు ఒక్కసారి కూడా యుద్ధంలో పాల్గొన్న అనుభవం లేదట. అవును ఇది నమ్మలేని నిజం.. వీరు నిజంగా యుద్ధం వస్తే ప్రత్యర్థిని ఎదుర్కొని, నిలబడగలరా అన్నది ప్రశ్నార్థకమే. యుద్ధ భూమిలో చైనా గత అనుభవాలు ఏమంత గొప్పగా లేవు. 1950లలో దిగ్గజ అమెరికన్ జనరల్ డగ్లస్ మెక్ కార్తర్ సేనను లొంగదీసుకున్నామని చెప్పే డ్రాగన్ సైన్యం ఆ తర్వాత పట్టు కోల్పోయింది.

 

 

1979లో వియత్నాం యుద్ధ సమయంలో చావు దెబ్బతింది చైనా. ఆయుద్ధంలో పీఎల్‌ఎకు చెందిన 62,500 మంది జవాన్లను చంపామని వియత్నాం ప్రకటించుకుంది. ఆ తర్వాత కూడా చైనా సైన్యం తన తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయలేదట. చైనా సైన్యంలో అవినీతి, అనైతికత పెరిగిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: