భారత్ చుట్టూ డ్రాగన్ తన సైన్యాలను మోహరిస్తోంది. జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలోని లడ్డాఖ్ లోయలో నేరుగానే దురాక్రమణకు పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. భారత్ భూభాగాన్ని అక్రమించాలనే ఏకైక లక్ష్యంతోనే చైనా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే లడ్డాఖ్, గాల్వాన్ నదీ ప్రాంతాల్లో సరిహద్దురేఖలను దాటి ముందుకొచ్చేసి  తరచూ ఉధ్రిక్తతలు సృష్టిస్తోంది. ఈ విషయాలు ఇలాగుంటా భారత్-చైనా సరిహద్దుల్లో కూడా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. యుద్ధ విమానాలు, ట్యంకర్లు, ఫైటర్ జెట్లతో పాటు మిలటరీని కూడా పెద్ద ఎత్తున తరలిస్తోంది. ఇదే సమయంలో  నేపాల్, భూటాన్ తో పాటు శ్రీలంలోని సముద్ర జలాల్లో కూడా చైనా నావికా దశాలు రెడీగా ఉన్నట్లు  రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

అంటే ఎలాగైనా సరే భారత్ లో చికాకులు సృష్టించి, మైండ్ గేమ్ ఆడటం ద్వారా దేశంలో అభద్రతను సృష్టించాలన్న ఎత్తుగడలో చైనా ఉన్నట్లు అర్ధమవుతోంది. మనదేశంలో అభద్రతను సృష్టిస్తే చైనాకు వచ్చే లాభం ఏమిటి ? ఏమిటంటే  రాజకీయంగా  చైనాలో కూడా అధ్యక్షుడు జిన్ పింగ్ పరిస్ధితి ఏమీ బావోలేదట. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తాను ఎదుర్కొంటున్న సమస్యల్లో నుండి బయటపడాలంటే ఏదో ఓ బూచిని సృష్టించాలి. అదే భారత్-చైనా సరిహద్దుల్లో ఉధ్రిక్తతలు.  దేశజనాభా దృష్టిని మళ్ళించాలంటే చైనాలోని అంతర్గత సమస్యలకు మించిన దాన్ని సృష్టించటం ఒకటే మార్గం. అందుకనే జిన్ పింగ్ సరిహద్దు వివాదాన్ని రేపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

నిజానికి జిన్ పింగ్ వేసిన ఎత్తుగడ ఆయనకే రివర్సు తగిలిందట. ఎలాగంటే మొన్నటి గాల్వాన్ నదీ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో డ్రాగన్ కు చెందిన 40 మంది సైనికులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. భారత్ సైన్యంలో కూడా 20 మంది చనిపోయినా  చైనాకు జరిగిన నష్టమే చాలా ఎక్కువ.  గడచిన 40 ఏళ్ళల్లో సరిహద్దుల్లో కాపలాకాస్తున్న సైన్యంలో చైనాలో ఇంత మంది సైనికులు చనిపోలేదట. ఎప్పుడైతే అకారణంగా డ్రాగన్ సైనికులు చనిపోయారో వెంటనే చైనా జనాల్లో జిన్ పింగ్ పై వ్యతిరేకత పెరిగిపోయిందట.

 

దేశజనాల దృష్టి మరల్చేందుకు అధ్యక్షుడు చేసిన ప్లాన్ ఈ విధంగా రివర్సు కొట్టడంతో చైనాలో కూడా అంతర్గతంగా సమస్యలు పెరిగిపోయాయట.  ఆ సమస్యల్లో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక ఇపు అధ్యక్షుడు తల పట్టుకున్నాడు. అందుకనే చర్యలని ఇంకోటని డ్రామాలు మొదలుపెట్టాడు. అయితే చైనా  చరిత్రను చూస్తే ఏ విషయంలో కూడా ఎంత మాత్రం నమ్మదగ్గ దేశం కాదని అందరికీ అర్ధమైపోయింది. చనిపోయిన సైనికుల విషయంలో కేంద్రప్రభుత్వం వివరాలు బహిర్గతం చేసింది. అలాగే చనిపోయిన వాళ్ళకు సైనిక లాంఛనాలతో ఘనంగా  క్రిమేషన్ జరిపించింది. మరి ఇదే పరిస్దితి చైనాలో ఎలాగుంది ?

 

గాల్వాన్ ఘర్షణల్లో ఎంతమంది సైనికులు చనిపోయారనే విషయంలో ఇప్పటికి కూడా చైనా ప్రభుత్వం లెక్కలు ప్రకటించలేదు.  తమ దేశజనాలు కూడా పరిస్ధితులను వివరించలేకపోతోంది. అంటే గాల్వాన్ ప్రాంతంలో ఏమి జరిగిందనే విషయంలో నిజాలను డ్రాగన్ దేశం దాచిపెడుతోందని అక్కడి జనాలకు కూడా అర్ధమైపోయింది.  అందుకనే పరిస్ధితి విషమించకుండానే మళ్ళీ దేశం దృష్టి మరల్చేందుకు జిన్ పింగ్ ప్లాన్ వేస్తున్నాడు. ఇందులో భాగంగానే తన సైన్యాన్ని భారత్ చుట్టూ మోహరిస్తున్నట్లు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. జిన్ పింగ్ ఎత్తుగడులు ఎన్ని రోజులు సాగుతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: