క‌య్యానికి కాలు దువ్వుతున్న చైనాకు తగిన శాస్తి చేసేందుకు భార‌త్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. చైనాను ఎదుర్కొనేందుకు త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అంత‌ర్జాతీయంగా ఒత్తిడి తీసుకువ‌చ్చి శాంతియుత చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించేలా చేయ‌డం.. ఇందులో భాగంగానే ద్వైపాక్షిక ఒప్పందాల‌ను అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై బ‌హిర్గ‌త ప‌ర్చ‌డం ద్వారా భార‌త్‌కు అంత‌ర్జాతీయ మ‌ద్ద‌తు కూడా గ‌ట్ట‌డం జ‌రుగుతుంది. రెండోది వ్యాపార,వాణిజ్య సంబంధాల‌ను తెగ‌దెంపులు చేసుకుంటూ ఒత్తిడిపెంచ‌డం..మిత్ర‌దేశాల్లోనూ అమ‌ల‌య్యేలా చూడ‌టం. చ‌ర్చ‌లు విఫ‌ల‌మై..చైనా దురాక్ర‌మ‌ణ‌లు ఆప‌క‌పోతే అవ‌స‌ర‌మైతే యుద్ధానికి సైతం వెళ్ల‌డం.

 

అయితే చ‌ర్చ‌ల‌కు విఫ‌ల‌మైతేనే...చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌కు తెగ‌ప‌డితే..సైన్యంపై దాడులు జ‌రిగితే మాత్రం ఎంత‌మాత్రం సంహించేందుకు భార‌త్ సిద్ధంగా లేద‌న్న విష‌యాన్ని ర‌క్ష‌ణ రంగ అధికారులు ఇప్ప‌టికే తేల్చి చెప్పారు.ఇందుకు సంబంధించి కేంద్ర‌ప్ర‌భుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే యుద్ధ‌నివార‌ణ చ‌ర్య‌ల‌కే భార‌త్ మొద‌ట ప్రాధాన్యం ఇస్తుంద‌న్న విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా భార‌త్‌ను దెబ్బ‌కొట్ట‌డానికి చైనా చుట్టూ ఉన్న దేశాల‌ను దూరం చేస్తూ వ‌స్తోంది. అదే స‌మ‌యంలో విరాళాలు ప్ర‌క‌టించి శ్రీలంక‌,బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ల‌కు ద‌గ్గ‌రైంది. 

 

అయితే భార‌త్‌కు అగ్ర‌రాజ్యం అమెరికా నుంచి ఫుల్ సపోర్టు ఉంది. అయితే ఇది అంత‌ర్జాతీయంగా చైనాకు పెద్ద దెబ్బ అవుతుంది. మ‌రింత బ‌లం కోసం భార‌త్ త‌న చిర‌కాల వ్యూహాత్మ‌క మిత్ర‌దేశం ర‌ష్యా మ‌ద్ద‌తు కోరుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రాన్స్‌, బ్రిట‌న్ దేశాల మ‌ద్ద‌తు ఎలాగు ఉంటుంది. కరోనా వైర‌స్ విష‌యం దాచిపెట్టి ప్ర‌పంచం సంక్షోభంలో కూరుకుపోవ‌డానికి డ్రాగ‌న్ దేశ‌మే కార‌ణ‌మ‌ని ఆయా దేశాలు విశ్వ‌సిస్తుండ‌టం కూడా కొంత భార‌త్‌కు క‌ల‌సిరానుంది. ఐరాస‌లో ప‌లుకుబ‌డి ఉన్న ప్ర‌ధాన పెద్ద దేశాలు భార‌త్‌కు అండ‌గా నిల‌వ‌నున్నాయి. ర‌ష్యా మ‌ద్ద‌తు సంపూర్ణంగా ల‌భిస్తే భార‌త్ ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొగ‌ల‌ద‌నే చెప్పాలి. 

 

ర‌ష్యా మ‌రి భార‌త్‌కు మ‌ద్ద‌తిస్తుందా..? మ క‌మ్యూనిస్ట్ చైనా దేశానికి అండ‌గా నిలుస్తుందా అన్న‌ది ఇప్ప‌టికైతే క్వ‌శ్చ‌న్ మార్కేన‌ని చెప్పాలి. వాస్త‌వానికి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకుంటూ ర‌ష్యాను కొద్ది సంవ‌త్స‌రాల క్రిత‌మే చైనా వెన‌క్కి నెట్టింది. చైనాతో పెద్ద‌గా వ్యాపార సంబంధాలు కూడా ర‌ష్యాకు లేక‌పోవ‌డం వంటి అంశాలు ర‌ష్యా భార‌త్ వైపు మొగ్గు చూపుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..?!

మరింత సమాచారం తెలుసుకోండి: