ఎత్తులకి పై ఎత్తులు.. వ్యూహాలకి ప్రతివ్యూహాలు.. ఇదే అసలైన నేటి రాజకీయం. అందితే జుట్టు.. లేదంటే కాళ్ళు అనేది పాత సామెత.. అందినా, అందకపోయిన.. మన కంటే ముందంజలో ఉంటే మాత్రం మడతపెట్టడమే.. ఇదే నేటి రాజకీయనాయకుల సామెత. ఇప్పుడు ఇదే పరిస్థితి బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఎదురైనట్టు సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. వీటికి అనుగుణంగానే ఇప్పుడు ఢిల్లీలో ఒక కీలక పరిణామం రూపుదిద్దుకుంటునట్టు తెలుస్తుంది.

 

2019 వరకు టీడీపీలో ఉన్న సుజనా చౌదరి.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అక్కడ చేరిన వెంటనే కీలక నేతల్లో ఒకరిగా మారిపోయారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన పలుకుబడి ఏంటో.. జాతీయ స్థాయి నేతలతో ఆయనకున్న బంధాలు ఎలాంటివో. అందుకే ఆయన బీజేపీలోకి చేరిన వెంటనే మాజీ ఎంపీ హరిబాబు సహా మరి కొంతమంది సీనియర్ నేతలు కూడా ఆయన్ను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసి ఘన స్వాగతాలు కూడా పలికారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ మధ్య కాలంలోనే సుజనా చౌదరిపై బీజేపీ నేతలు కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.

 

2019 ఎన్నికల తర్వాత రాష్ట్ర బీజేపీ ఎప్పుడూ వైసీపీకి కాస్త అనుకూల వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ నాయకత్వం మీద ఒంటికాలితో లేసేది. ఇక సుజనా చౌదరి వచ్చాక ఆ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందని ఏపీ బీజేపీలో ఉన్న వైసీపీ అనుకూల వర్గం భావిస్తుంది. అందుకే ఇప్పుడు సుజనా చౌదరి సామాజికవర్గానికి చెందిన ఒక టీడీపీ ఎంపీని ఎదోక రకంగా పార్టీలోకి తీసుకుని రావాలని ఏపీ బీజేపీలోని సుజనా చౌదరి వ్యతిరేక వర్గం ఎత్తులు వేస్తుంది. ఈ మేరకు టీడీపీ ఎంపీకి అనుకూలంగా ఉండే కేంద్ర మంత్రులతో కూడా చర్చలు జరుపుతున్నారట.. ఆయనను ఏదోక విధంగా తీసుకొస్తే ఆర్ధికంగా కూడా బలమైన నేత కాబట్టి కలిసి వస్తుంది అని భావిస్తున్నారట. ఆయన రాకతో సుజనా చౌదరికి చెక్ పెట్టవచ్చని సుజనా వ్యతిరేఖ వర్గం భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: