ఇది నిజంగా చాలా చిక్కుముడి ఉన్న ప్రశ్న. బతకడానికి పోరాడాలా ? బతుకు కోసం పోరాడాలా ? అంటే ఇప్పుడున్న కరోనా కాలంలో చెప్పడం కష్టమే. ఈ కరోనా జన జీవనాన్ని అంతలాకుతలం చేసేసింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసినా పరిస్థితి లో ఏ మాత్రం మార్పు కనిపించడంలేదు. బతుకు భారంగా కనిపిస్తున్నా.. బతకక తప్పదు. ఒక వైపు కరోనా భయం .. మరో వైపు కరువు భయం. నిత్యం భయం భయంగానే ప్రజలంతా రోడ్లపై కి వచ్చి బతుకు బండిని లాగిస్తున్నారు. గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు లేవు. లాక్ డౌన్ కి ముందు లాక్ డౌన్ తరువాత. కరోనాకి ముందు.. కరోనా తరువాత అన్నట్టుగానే ఇప్పుడు లెక్కలు వేసుకోవాలి. ప్రతి ఒక్కరి బతుకుని ఈ కరోనా భూతం కలవరపెట్టింది.

IHG


 ఎంతో మంది ఉసురు తీసుకుంది.మరెంతో మంది ఊపిరి తీసుకుంది. కష్టమంటే తెలియని వారు కూడా కరోనా కాటుకి అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు కరోనా కాటు నుంచి తప్పించుకుంటూ.. భయం భయంగా అయినా బతుకు బండిని లాగాల్సిందే. కరోనా కాటు వేస్తుంది అని ఇంట్లోనే కూర్చుంటే కడుపు కాలక తప్పదు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్న వారంతా కకలా వికలం అయ్యారు. 

IHG


ఇప్పటికీ కరోనా కట్టడి కాకపోగా మరింతగా విజృభిస్తుండడంతో ఎక్కడికక్కడ కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తోంది. వ్యాపారాలు సాగడంలేదు. సామాన్యుడి బతుకు చక్రం మారిపోయింది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. గతంలో వలే కులాసాగా కూర్చునివ్వడంలేదు. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. ముఖ్యంగా ఈ సమయంలో ఏ పూటకి ఆ పుట పనిచేస్తే కానీ నాలుగు వేళ్ళు లోపాలకి వెళ్లని వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇక వలస కూలీల సంగతి చెప్పనవసరంలేదు. ఉన్న ఊళ్ళల్లో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వేలాది కిలోమీటర్లు వలసపోయి బతుకు బండిని నెట్టుకొస్తున్న వారి బతుక్కి భరోసా ఎక్కడ ? 

IHG


కేంద్రం ప్రకటించిన 20  లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఎక్కడా ? అతలాకుతలం అయిన బతుకుల మాటేమిటి ? అసలు ఇప్పట్లో ఈ కరోనా కంట్రోల్ కాదు అని తేలిపోయిన పరిస్థితుల్లో మరి కొంత కాలం ఈ అనధికారిక కర్ఫ్యూ కి అలవాటు పడాల్సిందేనా ? ఈ కరోనా కాటు నుంచి ప్రతిక్షణం తప్పించుకుంటూ కాలే కడుపుని నింపుకోవాల్సిందేనా ? ఈ బతుక్కి భరోసా ఎప్పుడు లభిస్తుంది. ఇంకా మరికొంత కాలం బతకడానికి పోరాడల్సిందేనా ? బతుకుతూ పోరాడాల్సిందేనా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: