తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌, ఆయన కుటుంబానికి చెందిన కంపెనీకి వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ఫోటెక్‌ కు కేటాయించిన భూమిలో సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమర రాజా ఇన్‌ఫ్రాటెక్ నుంచి భూమిని వెనక్కు తీసుకునేందుకు ఏపీఐఐసీకి పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

 

2010లో చిత్తూరు జిల్లా యడమర్రి మండలం కొత్తపల్లిలో డిజిటల్ వరల్డ్ సిటీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని అమర్ రాజా ఇన్‌ఫ్రాటెక్‌ కు ప్రభుత్వం కేటాయించింది. పదేళ్లు దాటినా నిబంధనల ప్రకారం ఉద్యోగాల కల్పన, సంస్థ విస్తరణ లేకపోవడంతో 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. దీంతో షాక్ తిన్న గల్లా జయదేవ్‌.. సందిగ్ధంలో పడ్డారని తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా తన వ్యాపారాలకు అడ్డు తగులుతుందని ఆయన భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆర్ధికంగా తనకు నష్టం రావడమే కాకుండా.. న్యాయపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని భావించిన ఆయన..

 

ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారట. బీజేపీలో ఉంటే ఆయనకి ఇలాంటి చిక్కులు రావు.. కేంద్ర ప్రభుత్వం ఆయనకి అండగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని ఏమీ చేయలేదని ఆయన భావిస్తున్నారట. పైగా సొంత పార్టీలోనే కొందరు వ్యక్తులు ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారని కూడా టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో బీజేపీ ప్రభుత్వమే దానికి సరైనదని ఆయన అభిప్రాయపడుతున్నారట. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర పెద్దలతో కూడా చర్చించినట్టు.. వారు కూడా గల్లాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పరిస్తితులన్నీ సక్రమంగా ఉంటే అతి త్వరలోనే గల్లా జయదేవ్‌ బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: