ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతాం, వయస్సుతో సంబంధం లేకుండా మా ఆకలి తీర్చుకుంటాం. అడ్డం అనుకుంటే చంపేస్తాం. ఇది నేటి సమాజంలోని కొంత మంది మానవ మృగాల వికృతచేష్టలకు ప్రతిరూపం. ఈ వికృతచేష్టలు పెద్దవారిలోనే కాదు.. మూతి మీద మీసం కూడా రాని చిన్న పిల్లల్లో కూడా ఉన్నాయి. తమ వయసుకు మించిన పనులు చేస్తూ.. తప్పుదారిలో పోతున్నారు. 10 ఏళ్ల వయసులోనే మానవ మృగాలుగ మారుతున్న కమాంధులు ఎందరో..

 

తాజాగా.. ఛతర్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల మహిళ పుట్టుకతోనే మూగ. ఆదివారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా రోడ్డు పక్కన గాయాలతో కనిపించింది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. యువతిని పరీక్షించిన డాక్టర్లు ఆమెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేసినట్లు చెప్పారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు వెంటనే గౌరీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలు సైగలతో తనపై జరిగిన ఘోరాన్ని కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులందరూ మైనర్లేనని, తామే నేరం చేసినట్లు అంగీకరించారని ఛతర్‌పూర్ ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. నిందితుల్లో ఒకరు 11 ఏళ్ల బాలుడని ఎస్పీ చెప్పడంతో అందరూ షాకయ్యారు.

 

11 ఏళ్ల బాలుడు ఇంతటి దారుణానికి వడిగట్టాడంటే అది ఎవరి తప్పు..? సరిగ్గా ఆలోచించే వయసు కూడా రాని ఆ బాలుడు కమాంధుడిగా మారాడంటే అది ఎవరి తప్పు.? సమాజానిది కాదా ఆ తప్పు.. అతని తల్లిదండ్రులది కాదా తప్పు. నిత్యం ఇలాంటి వార్తలను మీడియాలో చూసి దీనికి ఆకర్షితులవుతున్నారు. సమాజంలో జరిగే పరిణామాలకు ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు సరైన రీతిలో పెంచకపోయినా.. పిల్లలు చేసే పనులను గ్రహించపోయినా.. ఇలాంటి పరిస్తితులే ఎదురవుతాయి. ఇకనైనా మారండి.. ఇలాంటి చిన్న పిల్లలు నేరాలకు పాల్పడి.. చిన్న వయసులో జైలు జీవితాన్ని అనుభవించకుండా చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: