వినేవాడు వెర్రి పుష్పం అయితే.. చెప్పేవాడు చంద్రబాబునాయుడు అని ఓ రాజకీయ సామెత ఉంది. ఇప్పుడు తెలుగుదేశం నేతలు అంబులెన్సుల స్కామ్ అంటూ చేస్తున్న హడావిడి కూడా అలాగే ఉంది. రాజకీయ నేతల్లో అవినీతి అన్నది సాధారణ విషయంగా మారిపోయింది. అందులోనూ ప్రభుత్వం ఓ కాంట్రాక్టు ఇచ్చినా.. ఓ పథకం రూపొందించినా..ఆ పని చేసే పెట్టాల్సింది కాంట్రాక్టర్లే.

 

 

ఈ కాంట్రాక్టుల్లో, టెండర్లలో కొంత పర్సెంటేజీ రాజకీయ నేతలు, అధికారంలో ఉన్నవారు కాజేస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. అయితే అవినీతీ ఓ లెక్క అంటూ ఉంటుంది. కొందరు 10 పర్సంట్ తింటే.. ఇంకొందరు 20 పర్సంట్ తింటారు. ఇక అసలు విషయానికి వస్తే.. జూలై ఒకటిన ఏపీ సీఎం జగన్ ఏకంగా 1088 అధునాత అంబులెన్సు వాహనాలు ప్రారంభించారు.

 

 

ఆ కార్యక్రమాన్ని విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. వందల కొద్దీ అంబులెన్సులు పేరేడ్‌గా వెళ్తుంటే.. విజయవాడ అంతా అవాక్కై చూసింది. టీవీల్లో చూసిన జనం ఆశ్చర్యపోయారు. అయితే ఆ క్రెడిట్ జగన్ కు వెళ్లకూడదంటే దానిపై ఓ అవినీతి బురద జల్లాలని టీడీపీ నేతలు కొన్ని రోజులు ముందు నుంచే ప్రిపేరయ్యారు. ఆ కాంట్రాక్టు దక్కించుకున్నది విజయసాయిరెడ్డి అల్లుడని.. ఆయనకు జగన్ అంబులెన్సుల పేరిట 300 కోట్లు దోచిపెట్టాడని గగ్గోలు పెట్టారు.

 

 

ఇక్కడే ఉంది అదిరిపోయే అసలైన పొలిటికల్ కామెడీ. అసలు ఈ కొత్త అంబులెన్సుల స్కీము విలువే రూ. 250కోట్ల రూపాయలు. అందులో 10 పర్సెంట్ అవినీతి జరిగితే.. ఓ పాతిక కోట్లు ఉంటుంది. లేదు.. సగానికి సగం అవినీతి అన్నా.. 120 కోట్లు ఉంటుంది. మరి టీడీపీ నేతలు మాత్రం అత్యుత్సాహంతో ఏకంగా 300 కోట్ల అవినీతి అంటూ రచ్చ మొదలెట్టారు. ఇది చూసిన జనం అసలు వీళ్లకు బుర్రుందా.. బురద జల్లినా కాస్త తెలివిగా జల్లాలి కదా అంటూ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: