అతనో సాధారణ కుటుంబం నుండి వచ్చాడు. తన కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. కష్టం దైర్యం క్రమశిక్షణ అనే అస్త్రాలు తప్ప అతని దగ్గర మరేమీ లేవు. కష్టపడేవాడికే కలలుగనే అర్హత ఉంటుందని అంటారు...! పుతిన్ కష్టపడేవాడు కలలుగనే వాడు. పుతిన్ కు చిన్న వయసు నుండే దేశ అధ్యక్షుడిగా ఎదగాలని కల ఉండేది ఆ కలే తరువాత నిజం అయ్యింది. పుతిన్ చాలా కష్టపడే వాడు తన కష్టానికి ప్రతిఫలంగా మిలిటరీ లో పని చేసేందుకు అవకాశం దక్కింది. అక్కడనుండి ఇంటెలిజెన్స్ అధికారిగా ఎదిగాడు. అక్కడనుండి రాజకీయాల్లో అడుపెట్టి మంత్రిగా పని చేస్శాడు. మంత్రిగా ఎదిగి ప్రధాన మంత్రి అయ్యాడు.

 

ప్రధానిగా ఎదిగి పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన 4 నెలల్లోనే దేశ అధ్యక్షుడు అయ్యాడు. పుతిన్ ఇప్పుడు రష్యాలో నాలుగవ సారి అధ్యక్షుడిగా పని చేస్తున్న ఏకైక వ్యక్తి. ఇతను ఇప్పటికే అధ్యక్షుడిగా 20 ఏళ్ళు పని చేశాడు దీంతో ప్రపంచం లోనే ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రష్యా లోని రాజ్యాంగం ప్రకారం ‘’ఏ వ్యక్తి అయినా కేవలం మూడు సార్లకు మించి అధ్యక్ష పదవిలో ఉండటానికి వీలు పడదు’’ అని ఉన్న నిబంధనను పుతిన్ తిరగరాశారు.

 

పుతిన్ వరుసగా మూడు సార్లు అత్యధిక మెజారిటీ తో గెలిచాడు.. నాలుగవ సారికూడా ప్రజలు తన పరిపాలననే కోరుతున్నారు. కానీ తనకి అధ్యక్ష బాధ్యతలకు రాజ్యాంగం లోని నిబంధన అడ్డుపడుతుంది.. దీంతో రష్యాలో పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వాలంటే రాజ్యాంగంలోని నిబంధనను మార్చాలి అంటూ దానికి ప్రజల సమ్మతిని కోరుతూ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ లో రష్యాలోని జనం అంతా పుతిన్ కు మద్దత్తుగా పుతిన్ కోసం నిబంధన ను మార్చాలి అంటూ దాదాపుగా 67 శాతం మంది తమ సమ్మతను పోలింగ్ ద్వారా తెలియజేశారు ఈ పోలింగ్ 2018 లో జరిగింది. దీంతో 2018 లో జరగాల్సిన ఎన్నికలు ఆగిపోయాయి.

 

2018 లో జరగాల్సిన ఎన్నికలు అలా వాయిదా పడుతూ 2020 వచ్చినా అతనే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది అయితే మరోసారి కూడా అదే పద్దతిని రష్యా లో అమలు చేశారు దీంతో ఈసారి కూడా అదే పరిస్థితి, మళ్ళీ పుతిన్ వైపే ప్రజలు మొగ్గు చూపించారు. అంటే పుతిన్ 2024 వరకు అంటే నాలుగవ సారిగా అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న ఏకైక అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఈసారి పుతిన్ రాజ్యాంగం సవరణలో భాగంగా మరి కొన్ని మార్పులు చేశారు ‘’ఏ వ్యక్తి అయితే సమర్ధుడో ఆ వ్యక్తికి 6 సార్లు కూడా పరీపాలన చేసే అర్హత కలుగుతుంది’’ అనే సవరణ చేశాడు.

 

దీంతో ఆయనకు 2036 వరకూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే హక్కు కూడా కలుగుతుంది. అంటే 20 కాదు 36 పరిపాలన చేయాలని 36 ఏళ్ళకు పుతిన్ స్కెచ్ ఎశారు. ఇక ఈ విషయాన్ని కొందరు విమర్శకులు కొట్టిపారేస్తున్నారు, పుతిన్ ఓ రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని ఓ నియంతలా ఆలోచించి రాజ్యాంగాన్నే సవరించాడని తనకి అనుకూలంగా రాజ్యాన్ని మార్చుకుంటున్నాడని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: