ఓవర్ యాక్షన్ చేస్తున్న డ్రాగన్ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎగిరెగిరి  పడుతున్న చైనా సైన్యాన్ని దెబ్బకొట్టేందుకు భారీ ఎత్తున అత్యంత అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవాలని మోడి నిర్ణయించాడు. ఇందుకు రూ. 38, 900 కోట్లు ఖర్చు పెట్టటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మొత్తంతో రష్యా నుండే కాకుండా ఇజ్రాయెల్ నుండి అత్యంత అధునాతన క్షిపణులను కొనటమే కాకుండా దేశంగా హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసే యుద్ధ విమానాలకు ఖర్చు చేయబోతున్నారు. అంటే ఇప్పటికే మనదేశం దగ్గర అవసరమైనన్ని యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, క్షపణి వ్యవస్ధలు ఉన్నాయి.

 

ఒకసారి  యుద్ధమంటూ మొదలైతే ఎక్కడలేని ఆయుధాలు అవసరం అవుతాయనటంలో సందేహం లేదు. అందుకనే మరిన్ని ఆయుధాలను సమకూర్చుకుంటోంది. రష్యానుండి మిగ్-29 యుద్ధ విమానాలను 21 కొంటోంది. అలాగే ఇపుడు మనదగ్గరున్న 59  మిగ్-29 యుద్ధ విమానాలను మరింత డెవలప్ చేస్తారు. ఇందుకోసం రూ. 7418 కోట్ల ఖర్చు చేయబోతున్నారు. అలాగే హెచ్ఏఎల్ నుండి కొత్తగా 12 సుఖోయ్-30 ఎంకేఐ పోరాట విమానాలను రెడీ చేయిస్తోంది. ఇందుకోసం రూ. 10,730 కోట్లు వ్యయం చేయబోతోంది. 248 అస్త్ర క్షిపణలను కూడా కొనుగోలు చేస్తోంది. ఈ అస్త్ర క్షిపణలు సూపర్ సోనిక్ విమానాలను కూడా ఆకాశంలో నుండి ఆకాశంలోనే  మట్టికరిపించగలవట.

 

శతృవులపైకి శరపరంపరగా రాకెట్లను  ప్రయోగించే  పినాక క్షిపణి వ్యవస్ధను కూడా కొనబోతున్నారు. శతృబలగాలు, యుద్ధట్యాంకులు, కమ్యూనికేషన్ కేంద్రాలు, వైమానికి కేంద్రాలు, ఆయుధగారాలను గుర్తించి ధ్వంసం చేయగలవు. అలాగే వెయ్యి కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగల క్రూయిజ్ క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకుంటోంది.  ఇలాంటి అనేక వ్యవస్ధలను ఆధునీకరించటంతో పాటు కొత్తగా కొన్నింటిని సమకూర్చుకునేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తోంది. మనదేశం అవసరాలను కనిపెట్టుకుని, అవసరానికి సరిపోయే ఆయుధాలను సకమూర్చేందుకు రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలు రెడీగా ఉన్నాయి.

 

కేంద్రం డిసైడ్ చేసినట్లు  అత్యంత అధునాతన ఆయుధాలు గనుక మనకు వెంటనే సమకూరితే చైనాకు చుక్కలు కనబడటం ఖాయమనే అనుకోవాలి. అయితే చైనా సామర్ధ్యాన్ని కూడా తక్కువ అంచనా వేసేందుకు లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చైనాలో ఏమి జరుగుతోందనే విషయం ఇక్క అంగుళం కూడా బయటకు పొక్కదు. అక్కడి సమాచార వ్యవస్ధ, సెన్సారింగ్ అంత పకడ్బందీగా ఉంటుంది. ఇపుడు మనదేశం సమీకరించాలని అనుకుంటున్న ఆయుధాలను, ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్న ఆయుధాల్లో చైనా ఎన్నింటిని రెడీగా పెట్టుకున్నదో తెలీదు.  ఏదేమైనా చైనాకు వ్యతిరేకంగా భారత్ కు చాలా దేశాలే మద్దతుగా నిలబడుతున్నది మాత్రం వాస్తవం. ఈ విషయంలో డ్రాగన్ కు మోడి పెద్ద షాకిచ్చాడనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: