క‌రోనా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో, క‌రోనా కేసుల‌ను గుర్తించ‌డంలో...గుర్తించిన రోగుల‌కు స‌రైన వ‌సతుల మ‌ధ్య నాణ్య‌మైన వైద్యం అందించ‌డంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్న విమ‌ర్శ‌లు జ‌నం నుంచి వినిపిస్తున్నాయి. అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క్వారంటైన్ త‌ర‌లించి స‌రైన చికిత్స అందించాల్సి ఉన్నా ప్ర‌భుత్వం ఎందుక‌నో నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రయివేటు ల్యాబ్‌ లలో తాత్కాలికంగా కరోనా టెస్టులను నిలిపి వేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి. ప్ర‌భుత్వం చేయించ‌దు...తాము చేసుకోవాల‌నుకుంటే అడ్డుప‌డుతోంద‌న్న నిర‌స‌న ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది.

 

ఐదో తేదీ వరకు శాంపిళ్లు తీసుకోవడాన్ని ఆ పేసిన విష‌యం తెలిసిందే. ఐసీఎంఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రయివేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిం చేందుకు అనుమతిచ్చింది. దీంతో 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారుల బృందం ప్రయివేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించింది. అక్కడ జరుగుతున్న లోపాలను ఎత్తిచూ పింది. 48 గంటల్లో ఆ లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగ మే ఘాల మీద కొన్ని ల్యాబ్‌లు తమ తప్పులను సరిదిద్దుకున్నాయి. కరోనా శాంపిళ్లను సేకరించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు డిజ్‌ ఇన్‌ఫెక్షన్‌ కోసం నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రయివేటు ల్యాబ్‌లు ప్రకటించాయి.

 

 ఓ వైపు క‌రోనా కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో స‌ర్కారు తీరిపారిగా నిర్ణ‌యాలు వెల్ల‌డించండ‌మేటంటూ విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయన్న నిర‌స‌న స్వ‌రం ఇప్పుడు రాష్ట్రంలో వినిపించ‌డం మొద‌ల‌వుతోంది.  క‌రోనా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా..నిమ్మకు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విప‌క్షాలు మండిపడుతున్నాయి. వాస్త‌వానికి కూడా వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ఎంతో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప్ర‌భుత్వం చేతులెత్తిన‌ట్లే క‌నిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: