అటు వైపున నుండి చైనా ఇటు వైపున నుండి పాకిస్థాన్ భారత్ పై కుతంత్రం పన్నుతున్నాయి. భారత్ రెండు వైపులా పోరాడుతూ సతమతమవుతుంది. ఇలా రెండు వైపుల నుండి భారత్ పై దాడి చేయడం ఇదేమి తొలిసారి కాదు భారత్ తనకు స్వతంత్రం వచ్చినప్పటినుండి ఇరు దేశాలతో పోరాడాతూనే ఉంది. స్వతంత్రం వచ్చిన నాటినుండి సరిహద్దు సమస్యలు మొదలయ్యాయి. ఆ సరిహద్దు సమస్యలు ఇప్పటికీ సద్దుమనగడం లేవు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ను తరలించిన చైనా భారత్ ను కరోనా అస్త్రం తో ఎంతలా దెబ్బ తీసిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ తన మిత్ర దేశం అయిన పాక్ లో ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య తగ్గడం గమనార్హం.

 

ఇక మరో పక్క నుండి పాక్ భారత్ పై పాత కక్షలు తీర్చుకునేందుకు ఈ సమయాన్ని భలే ఉపయోగించుకుంటుంది. తనకు అండగా పెద్దన్న చైనా పక్కనే ఉండటంతో పాక్ చర్యలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. తమ దేశం లో జరిగిన దాడులను భారత్ చేసిందని భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రెడిబిలిటీ ని దెబ్బ తీయాలని చూస్తుంది. భారత్ కరోనా ను అరికట్టలేక కిందా మీదా పడుతుంటే పాక్ చైనా లు ఒకరితో ఒకరు సంప్రదింపులు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకుంటూ భారత్ ను ఎలా దెబ్బ తీయాలో చర్చించుకుంటున్నారు. భారత్ కు కష్టకాలం వచ్చిన సమయంలో బీజింగ్ నుండి చైనా ఇస్లామాబాద్ నుండి పాక్ భారత్ పై పెద్ద స్కెచ్ లే వేస్తున్నాయి.

 

గల్వాన్ ఘటన ఒక పక్క జరుగుతుంటే మరో పక్క అదే సమయంలో కాశ్మీర్ బార్డర్ సమీపంలో భారత జవాన్లు ఆయుదాలతో కూడిన ఇద్దరు తీవ్రవాదులను హతమార్చారు. వారి వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.. మరి ఇది పాక్ దుశ్చర్య కాదా..? గాల్వాన్ ఘటన జరగకముందే ఇరు దేశాలు పెద్ద చర్చలే జరిపి ఈ దాడులకు పాల్పడ్డారు. భారత్ కరోనాతో సతమతమవుతున్న వేల భారత్ ను దెబ్బతీయాలని భావిస్తున్నారు. భారత్ ఇంటెలిజెన్స్ ప్రకారం చైనాతో పాక్ తో బార్డర్ పంచుకుంటున్న ఢిల్లీ పెద్ద ఆపదలో ఉంది. ఢిల్లీ లో కరోనా భీబత్సం గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఇక ఇలా ఢిల్లీ బాధ పడుతుంటే అక్కడ టెర్రర్ దాడులకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయట..! ఇరు దేశాలు ఈ దాడులను ముందుగానే చర్చించి పాండమిక్ ఉన్న సమయంలో పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాయట...!

మరింత సమాచారం తెలుసుకోండి: