ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అనేక మంది మేధావులు, అతిర‌థ‌మహార‌థులు చ‌రిత్ర సృష్టించారు. కొంద‌రు చ‌రిత్ర‌లో క‌లిసిపోయారు. అయితే, వీరంతా రాష్ట్రానికి అంతో ఇంతో మేలు చేసిన వారే. పార్టీపై అసంతృప్తి ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉన్నా పార్టీని వ‌దిలి పెట్ట‌కుండా ముందుకు సాగా రు. అయితే, ఇప్పుడు ఏపీ హిస్ట‌రీలో చ‌వి చూడ‌ని, బ‌హుశ చ‌రిత్ర‌కు సైతం అంద‌ని ఓ ఘ‌ట్టం చేసుకోనుం ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో అనేక పార్టీలు ఉన్నాయి. అనేక మంది నాయ‌కులు కూడా ఉన్నా రు. కానీ, ఎవ‌రివిష‌యంలోనూ జ‌ర‌గ‌ని, ఏ పార్టీ విష‌యంలోనూ చోటు చేసుకోని ఓ కీల‌క ఘ‌ట్టం ఇప్పుడు తెరమీదికి వ‌చ్చింది. అది కూడా అధికార పార్టీ వైసీపీ రాజ‌కీయ తెర‌మీదికి 70 ఎం.ఎం స్కోప్‌లో చూపిం చ‌బోతోంది. 


అదే, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు వ్య‌వ‌హారం. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం బాగానే ముదిరిపో యింది. ఇక, తెంచుకోవ‌డ‌మే త‌ప్ప‌.. కొన‌సాగించేందుకు కూడా అవ‌కాశం లేకుండా పోయినంత‌గా వ్య‌వ‌హా రం దూ సుకుపోయింది. `ఎవ‌రి క‌న్ను.. ఎవ‌రిది వేలు`-జ‌రిగే న‌ష్టంలో ఎవ‌రు బాధ్యులు అంటే.. ఖ‌చ్చితం గా ఇప్పుడు అంద‌రి వేళ్లూ.. ర‌ఘురామ‌కృష్ణంరాజు వైపే చూపిస్తున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు వివిధ పా ర్టీల నాయకు లు, కొన్ని మీడియా ఛానెళ్లు కూడా ర‌ఘును కొంత మేర‌కు వెనుకేసుకు వ‌చ్చాయి. కొంద ‌రు ఆయ‌నకు స‌పో ర్టుగా కూడా మాట్లాడారు. అదేస‌మ‌యంలో వైసీపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో న‌ని ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. 


ఈ క్ర‌మంలోనే ర‌ఘుకు వైసీపీలో నెంబ‌ర్‌-2గా చ‌లామ‌ణి అవుతున్న విజ‌య‌సాయిరెడ్డి నోటీసు జారీ చేశా రు. అయితే, ప్ర‌శ్న‌కుప్ర‌శ్న స‌మాధానం అన్న విధంగా ర‌ఘురామ ఏకంగా పార్టీ ఉనికినే ప్ర‌శ్నించారు. తా ను రాజ్యాంగాన్ని కాపాడేందుకు అవ‌త‌రించిన నాయ‌కుడిగా పేర్కొన్నారు. స‌హ‌జంగా.. ఇలాంటి వ్యాఖ్య ‌లు, వ్య‌వ‌హారాల‌ను ఏ పార్టీ కూడా అంగీక‌రించ‌దు. దీంతో ర‌ఘుకు నిన్న మొన్న‌టి వ‌రకు వివిధ రూపాల్లో వివిధ కోణాల్లో వ‌చ్చిన సింప‌తీ కాస్తా.. హ‌రించుకుపోయింది. అదేస‌మ‌యంలో.. ర‌ఘును నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ప్రొక్లెయిన్ చేస్తూ.. వ‌చ్చిన ఓ మీడియా.. ఇప్పుడు ర‌ఘు విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసింది. వైసీపీని ఇరుకున పెడ‌దామ‌ని భావించిన వారు కూడా ఇప్పుడు ర‌ఘు మేకులా మారేస‌రికి.. వారు ప‌క్క‌కు వెళ్లిపోయారు. 


దీంతో వైసీపీ కీల‌క నిర్ణ‌యం.. అందునా ఇప్ప‌టి వ‌రకు ఏపీలో ఏ పార్టీ కూడా తీసుకోని నిర్ణ‌యం.. ఆ మాట ‌కొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా ద‌క్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌ని విధంగా ర‌ఘు పార్ల‌మెంటు స‌భ్య ‌త్వంపై వేటు వేయించాల‌ని నిర్ణ‌యించింది. ఎంపీగా ఆయ‌న‌ను అన‌ర్హుడిని చేయ‌డం ద్వారా పార్ల‌మెం టులో అడుగు పెట్ట‌కుండా చేయ‌డంతోపాటు.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌నను తీవ్రంగా అవ‌మానించా ల‌నే ఏకైక ల‌క్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌లో ఏదో గొప్ప శ‌క్తి ఉంద‌ని భావించిన ర‌ఘు.. ఈ దెబ్బ‌తో న్యాయ పోరాటానికి దిగారు. కానీ, ఇది న్యాయ‌పోరాటం కింద‌కి రాద‌ని అంటున్నారు నిపుణులు. ఒక్క‌సారి క‌నుక ఈ విష‌యం లోక్ స‌భ స్పీక‌ర్ కోర్టులోకి వెళ్తే.. అంతా అక్క‌డే చ‌క్క‌బెట్టేస్తార‌ని, ఈ విష‌యంలో ర‌ఘును స‌మ‌ర్ధించేవారు, కాపాడే వారు కూడా ఎవ‌రూ ఉండ‌బోర‌ని అంటున్నారు. మొత్తానికి ర‌ఘును క‌నుక పార్ల‌మెంటు స‌భ్య‌త్వం నుంచి అన‌ర్హుడిని చేస్తే.. ఏపీ చ‌రిత్ర‌లోనే ఓ కీల‌క ఘ‌ట్టం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: