కొన్ని కొన్ని సార్లు సామాన్యులైనా దేశ ప్రధానులైనా వారు ఎవ్వరైనా వింత చేష్టలు చేస్తూ కెమెరా కు చిక్కుతారు. కొన్ని కొన్ని సార్లు కెమెరా ఉంది కదా అని కెమెరా ముందే కావాలని వింత చేష్టలు చేస్తారు. దీంతో వార్తాలు భారీగా ప్రచారం అయ్యి వైరల్ అవుతాయి..! ఈమధ్య ప్రధానులు ఊరికేనే ట్రెండ్ అవుతున్నారు. వారు చేసే పనులవల్లా ట్రెండ్ అవుతున్నారు వారు చెప్పే మాటల వల్లా ట్రెండ్ అవుతున్నారు వారు చేసే చేష్టల వల్లా ట్రెండ్ అవుతున్నారు. అలా ట్రెండ్ అయిన వారిలో...

 

ముందుగా... డెన్ మార్క్ దేశ ప్రధాని మెట్టే ఫ్రెడ్రిక్ సన్ ఈవిడ కేవలం తాను చెప్పిన మాటకే ట్రెండ్ అయ్యారు. త్వరలో తన పెళ్లి జరుగుతుంది త్వరలో తన పెళ్లి జరుగుతుంది అంటూ 2020 సగం గడిచిపోయింది కానీ తన పెళ్లి మాత్రం జరగడం లేదు. విషయం ఏంటంటే తాను పెళ్లి చేసుకునేందుకు మంచి డేట్ ఫిక్స్ చేయించుకుంటుంది.. అదే డేట్ కల్లా ఏదో ఒక ఆటంకం రావడంతో తన పెళ్లి వాయిదా పడిపోతుంది. అలా ఇప్పటికే మూడు సార్లు డేట్ ఫిక్స్ చేసింది. ఆ డేట్ వచ్చేసరికి పెళ్లి వాయిదా పడిపోతుంది. అయితే ఆమెను తన పెళ్లి వాయిదా పడటానికి గల కారణం ఏమిటి అని అడగగా ముందు తడబడినా తరువాత యూరోపియన్ కౌన్సిల్ లో నిర్వహించే కోవిడ్ సమావేశానికి హాజరవ్వాలని అందుకే తన పెల్లిని వాయిదా వేయించుకున్నాను అని చెప్పింది... అంటే తాను ఇచ్చిన స్టేట్ మెంట్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ లోకి వచ్చింది. పీఎం పెళ్ళి మూడవసారి వాయిదా అంటూ వార్త చక్కర్లు కొట్టింది.

 

ఇక రెండవ విషయం... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత తమ్ముడిలా కనిపించే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్ సన్. ఈయన తన చేష్టలతో ట్రెండ్ అయ్యాడు. బోరిస్ కు దురదృష్టవాశాత్తు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా పాజిటివ్ రావడం ప్రపంచాన్ని అందరినీ బాధ పెట్టింది. తాను కరోనా వచ్చిన వెంటనే ఆ విషయాన్ని తెలియజేసి తన ఇంట్లోనే ఇసోలేషన్ లోకి వెళ్లిపోయాడు. ఇసోలేషన్ లో కరోనా తో పొరాడి కరోనాని జయించి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చి మరలా బాధ్యతలు చేపట్టినా ప్రతిపక్షాలు మాత్రం ఆయనని విమర్శించాయి. కోవిడ్ వచ్చిన అనంతరం మరలా పనిలోకి ఎలా వచ్చావని ప్రధాని పోస్ట్ లో పని చేయాలంటే ఫిట్ గా ఉండాలని ఆయనకు ఫిట్ నెస్ నిరూపించుకొమ్మని సవాల్ విసిరారు. ఈ సవాల్ స్వీకరించిన ఆయన ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నేను చాలా ఫిట్ గా ఉన్నాను అంటూ నేరుగా చైర్ దిగి అక్కడున్న రెడ్ కార్పెట్ పై 50 పుష్ అప్స్ చేసి చూపించాడు. ఆ వీడియో చూసిన ప్రతి పక్షాలే కాదు ప్రపంచం అంతా నోరెళ్ళబెట్టింది. ఈయన అలా ట్రెండ్ అయ్యాడు.

 

ఇక మూడవ విషయం... బల్గేరియా ప్రధాని బొయ్కో బోరిసోవ్. ఈయన కూడా తాను చేసిన పొరపాటుకి ట్రెండ్ అయ్యాడు. బొయ్కో చేసిన పనిని తాజాగా మన ప్రధాని మోడీ కూడా తన సంభాషణలో తీసుకొచ్చాడు..ఆ విషయం అంతా ట్రెండ్ అయ్యింది. అయితే ఆయన తన బృందాన్ని వెంటపెట్టుకొని కొందరు పోలీసులు జర్నలిస్టులతో కలిసి ఓ ప్రార్థనా మందిరానికి తీసుకెళ్ళాడు. అయితే ముందే కోవిడ్ కాలం, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఇలాంటి నేపద్యంలో బొయ్కో ఓ దేశ ప్రధానిగా ఉంటూ ముఖానికి మాస్క్ పెట్టుకోలేదు. అది గమనించిన అక్కడి పోలీసులు సాక్షాత్తు ప్రధాని అయినా ముఖానికి మాస్క్ పెట్టుకోనందుకు జరిమానా విధించారు. ఆ ప్రార్థనా మందిరం లోనికి కూడా అనుమతించలేదు. ఆపై ఆయన మాస్క్ ధరించుకొని జరిమానా కట్టి లోనికి వెళ్ళాడు. దాంతో ఆ వార్తా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి మన ఆర్టికల్ వరకూ చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: